Protein Food: ప్రోటీన్ సూపర్ ఫుడ్స్ ఇవే.. వీటిని తింటే శాకాహారులకు ప్రోటీన్ సమస్య దరిచేరదంతే..!

మాంసాహారులు మాంసాహారం రూపంలో ప్రోటీన్ల ఆహార వనరులను కనుగొనడం సులువుగా ఉంటుంది. అయితే శాకాహారులు మాంసాహారానికి సమానమైన తగినంత ప్రోటీన్-రిచ్ ఆహారాలను కనుగొనడంలో కొంత సమస్య ఉండవచ్చు.

Protein Food: ప్రోటీన్ సూపర్ ఫుడ్స్ ఇవే.. వీటిని తింటే శాకాహారులకు ప్రోటీన్ సమస్య దరిచేరదంతే..!
Protein
Follow us
Srinu

| Edited By: Anil kumar poka

Updated on: Jan 26, 2023 | 3:16 PM

ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారంలో ప్రోటీన్ ముఖ్యమైన భాగం. ఇది శరీరానికి శక్తిని, ఎముకలకు బలాన్ని, కడుపునకు తృప్తిని అందిస్తుంది. మాంసాహారులు మాంసాహారం రూపంలో ప్రోటీన్ల ఆహార వనరులను కనుగొనడం సులువుగా ఉంటుంది. అయితే శాకాహారులు మాంసాహారానికి సమానమైన తగినంత ప్రోటీన్-రిచ్ ఆహారాలను కనుగొనడంలో కొంత సమస్య ఉండవచ్చు. ప్రోటీన్స్ కోసం శాకాహారంతో తగినన్ని మూలాలు ఉండవు. కాబట్టి శాకాహారులు ప్రోటీన్ సమస్యకు గురవుతుంటారు. అయితే శాకాహారులు మాంసాహారులతో పాటుగా ప్రోటీన్లను పొందడానికి ప్రతిరోజూ ఆహారంలో కొన్ని పదార్థాలను జోడించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. వైద్యులు సూచించే ఆ ఆహార పదర్థాలేంటో? ఓ సారి తెలుసుకుందాం. 

వేరుశెనగ

మనం డైలీ వాడే వేరుశెనగలోప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అలాగే చాలా మంది వేయించిన వేరుశెనగ గుళ్లు స్నాక్ గా తినడానికి ఇష్టపడతారు. మీరు ఒక రోజులో 2 టేబుల్ స్పూన్లు దాదాపు 8 గ్రాములు వేరుశెనగ తింటే మంచి ఫలితాలు ఉంటాయి వైద్యు నిపుణులు చెబతున్నారు. 

చిక్పీస్

శెనగలు మనం డైలీ ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. శరీరానికి అవసరమైన ప్రోటీన్లు అందించడానికి శెనగలు-చావల్ తో చేసిన మిశ్రమాన్ని తింటే మంచిది. ముఖ్యంగా సలాడ్స్ వీటిని వినియోగిస్తే మంచింది.

ఇవి కూడా చదవండి

పాలు

పాలల్లో కాల్షియం మాత్రమే కాదు ప్రోటీన్ కూడా చాలా అధిక శాతం ఉంటుంది. మీకు డైరెక్ట్ గా పాలు తాగడం ఇష్టం లేకపోతే వాటిని ఓట్స్ ఇతర ఆహార పదార్థాలతో మిక్స్ చేసుకుని తినాలి. అలాగే శీతాకాలంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి పసుపు, పాలను కలిపి తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

వాల్ నట్స్

వాల్స్ నట్స్ ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. రోజుకు కేవలం రెండు టేబుల్ స్పూన్ల వాల్ నట్స్ తింటే శరీరానికి అవసరమైన ప్రోటీన్లు అందించవచ్చు. మిల్క్ షేక్, జ్యూస్ లు, సలాడ్ వంటి వాటితో కలిపి తినాలని సూచిస్తున్నారు. 

గుడ్లు

కొంతమంది గుడ్డును మాంసాహారంగా, మరికొంత మంది శాకాహారంగా భావిస్తారు. లాక్టో-ఓవో వెజిటేరియన్ డైట్ ను ఫాలో అయ్యే వారికి గుడ్డు మంచి ఎంపిక లాక్టో అంటే డైరీ ఉత్పత్తులు, ఓవో అంటే గుడ్లు. శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్లు అందించాలంటే డైలీ గుడ్లు తింటే మంచిది.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం