Pregnant Diet Tips: గర్భిణులు శీతాకాలంలో ఇవి తిన్నారంటే ఆరోగ్యకరమైన శిశువు జననం…అస్సలు స్కిప్ చేయకుండా చదవాల్సిందే..
గర్భధారణ నుంచే గర్భిణులు ఆహారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. ఎందుకంటే కడుపుతో ఉన్నప్పుడు ఎంత మంచి పౌష్టికాహారం తింటామో? దాని ఆధారంగానే ఆరోగ్యకరమైన బిడ్డను జన్మనివ్వడానికి సాధ్యపడుతుందని చెబుతున్నారు.
ఆడవారి జీవితంలో గర్భధారణ అనేది ముఖ్యమైన ఘట్టం. ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వడం అనేది చాలా ముఖ్యమని భావిస్తుంటారు. అయితే చాలా మంది ఆహారం తినడానికి చాలా ఇబ్బందిపడుతుంటారు. ఓ వైపు వాంతులు అవ్వడంతో ఆహారంపై నిర్లిప్తత చూపిస్తుంటారు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం ఆహారం తీసుకోవాల్సిందే అని పట్టుబడుతుంటారు. వైద్య నిపుణులు మాత్రం గర్భధారణ నుంచే గర్భిణులు ఆహారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. ఎందుకంటే కడుపుతో ఉన్నప్పుడు ఎంత మంచి పౌష్టికాహారం తింటామో? దాని ఆధారంగానే ఆరోగ్యకరమైన బిడ్డను జన్మనివ్వడానికి సాధ్యపడుతుందని చెబుతున్నారు. అలాగే ప్రస్తుతం చలికాలంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలని పేర్కొంటున్నారు. అలాగే పౌష్టికాహారంపై కూడా దృష్టి పెట్టాలని చెబుతున్నారు. శీతాకాలంలో గర్భిణులు తీసుకోవాల్సిన ముఖ్యమైన ఆహారాల గురించి తెలుసుకుందాం.
డ్రై ఫ్రూట్స్
చలికాలంలో గర్భిణులు కచ్చితంగా డ్రై ఫ్రూట్స్ ను తమ ఆహారంలో చేర్చుకోవాలి. బాదం, జీడీపప్పు, వాల్ నట్స్ వంటి ఆహారం కచ్చితంగా తినాలి. ఎందుకంటే వీటిలో విటమిన్లు, పోలేట్, పొటాషియం, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బాదం ఎక్కువ తింటే కడుపులో బిడ్డ ఎముకలు, దంతాల వృద్ధికి సాయం చేస్తుంది. అయితే ప్రాసెస్ చేసిన డ్రైఫ్రూట్స్ మాత్రం అస్సలు తీసుకోవద్దని సూచిస్తున్నారు. అల్పాహారం తినాలని అనిపించినప్పుడల్లా డ్రైఫ్రూట్స్ తింటే మేలు జరుగుతుందని సూచిస్తున్నారు.
గుడ్లు
గుడ్లు అనేది కచ్చితంగా గర్భిణులు ప్రతిరోజూ తీసుకోవాల్సిన ఆహారం. ప్రభుత్వాలు కూడా గర్భిణులకు అంగన్ వాడీల ద్వారా గుడ్లను ఇస్తుంటాయి. గుడ్డు అనేది ప్రోటీన్లకు అద్భుతమైన మూలం. కోలిన్, లుటిన్, విటమిన్లు డీ, బీ12, రిబోఫ్లెవిన్, ఫోలేట్ వంటి పోషకాలు గుడ్డు తినే గర్భిణులకు అందుతాయి. గుడ్డు తినడం కడుపు ఉండే శిశువు ఎముక, కండరాల అభివృద్ధి సాయం చేస్తుంది.
ఆకు కూరలు
శీతాకాలంలో లభించే బచ్చలి కూర, మెంతి కూర వంటి ఆకు కూరలు తింటే గర్భిణులు చాలా మేలు జరుగుతుంది. వీటి ద్వారా విటమిన్లు ఏ, సి, కె తో పాటు కాల్షియం, ఐరన్, ఫోలెట్, పొటాషియం వంట పోషకాలు శరీరానికి అందుతాయి. అయితే ఆకు కూరల వల్ల ఫోలిక్ ఆమ్లం కూడా అందడంతో గర్భంలో ఉండే శిశువుకు పుట్టుకతో వచ్చే వెన్ను సమస్యల నుంచి బయటపడవచ్చు.
చేపలు
సాధారణంగా గర్భిణులు చేపలు తినడానికి ఇష్టపడరు. అయితే చేపల్లోని సాల్మన్, ట్యూనా వంటి కొవ్వు చేపలను గర్భిణులు తీసుకుంటే చాలా మేలు జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. వీటిల్లో ఉండే ఓమెగా -3 వంటి ఆమ్లాలు అద్భుత స్థాయిల్లో ఉంటాయి. జింక్, సెలినియం, విటమిన్-డి కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి కొన్ని శాస్త్రీయ ఆధారాల ప్రకారం గర్భధారణ సమయంలో చేపలను తీసుకుంటే శిశువుకు మెదడు వృద్ధి సాయం చేస్తుంది.
చిక్కులు, బీన్స్, గింజ ఆహారాలు
చిక్కులు, బీన్స్ వంటి గింజ ఆహారాల్లో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. బీన్స్, కాయధాన్యాలు, బఠానీలు, వేరుశెనగల్లో ప్రోటీన్, ఫైబర్, ఖనిజాలు, ఇనుము, ఫైటో కెమికల్స్ వంటివి ఉంటాయి. వీటిని గర్భిణులు తీసుకుంటే నాణ్యమైన పాలను ఉత్పత్తి చేయడానికి సాయం చేస్తాయి. తల్లీ, బిడ్డకు ఎక్కువ రక్తాన్ని వృద్ది చేయడంలో కూడా సాయం చేస్తాయి.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి