AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

iPhone 14 Launch: ఐఫోన్‌ 14 విడుదల చేయడానికి రెండు రోజుల ముందు ధర, ఫీచర్స్‌ లీక్‌..!

iPhone 14 Launch: అమెరికన్ కంపెనీ Apple సెప్టెంబర్ 7న ఒక ఈవెంట్‌ను నిర్వహించబోతోంది. ఈ ఈవెంట్ సందర్భంగా కంపెనీ కొన్ని ఉత్పత్తులను ఆవిష్కరిస్తుంది..

iPhone 14 Launch: ఐఫోన్‌ 14 విడుదల చేయడానికి రెండు రోజుల ముందు ధర, ఫీచర్స్‌ లీక్‌..!
Apple Iphone 14
Subhash Goud
|

Updated on: Sep 04, 2022 | 5:12 PM

Share

iPhone 14 Launch: అమెరికన్ కంపెనీ Apple సెప్టెంబర్ 7న ఒక ఈవెంట్‌ను నిర్వహించబోతోంది. ఈ ఈవెంట్ సందర్భంగా కంపెనీ కొన్ని ఉత్పత్తులను ఆవిష్కరిస్తుంది. వాటిలో నాలుగు మొబైల్‌లు ఐఫోన్ 14 సిరీస్‌లో విడుదల కానున్నాయి. ఈ మొబైల్‌ల పేర్లు Apple iPhone 14 , Apple iPhone 14 Plus, Apple iPhone 14 Pro, Apple iPhone 14 Pro Max. కంపెనీ ఈ ఫోన్‌ల గురించి ఎటువంటి సమాచారం ఇవ్వనప్పటికీ.. టెక్ ప్రపంచంలో ఈ మొబైల్‌ల గురించి చాలా విషయాలు లీకయ్యాయి.

Apple iPhone 14 సిరీస్ ధర, ఇతర ఫీచర్స్‌ విషయాలు లీకయ్యాయి. దీనిలో Apple iPhone 13 కంటే iPhone 14 చౌకగా ఉంటుందని సమాచారం. చాలా నివేదికలు ఈ ఫోన్ $ 50 చౌకగా ఉండవచ్చని పేర్కొంది. అయితే అధికారిక ధర ఎంత అన్నది సెప్టెంబర్ 7న వెల్లడి కానుంది. ఈ ఐఫోన్ 14 డిజైన్ ఐఫోన్ 13కి చాలా పోలి ఉంటుందని లీకుల ద్వారా సమాచారం. ఇది స్లిమ్ బెజెల్‌లను కలిగి ఉంటుంది. అంచుల కంటే కొంచెం వెడల్పుగా ఉంటుంది. అయితే ఇతర మోడళ్లలో పిల్ ఆకారంలో పంచ్ హోల్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ రకమైన పంచ్ హోల్ ఇప్పటికే Samsung S10లో ప్రవేశపెట్టబడింది. Apple iPhone 14 ఫోన్‌ 128 GB వరకు ఇంటర్నల్‌ స్టోరేజీ ఉండే అవకాశం ఉంది. ఐఫోన్ 14లో A16 చిప్‌సెట్‌ని ఉపయోగించినట్లు తెలుస్తోంది.

డిస్‌ప్లే, ఫీచర్స్‌..

ఇవి కూడా చదవండి

పెద్ద సైజు డిస్‌ప్లేను ఈ Apple iPhone 14లో ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఇది 6.1 అంగుళాలు ఉంటుంది. ఇది లిక్విడ్ రెటినా డిస్‌ప్లే అవుతుంది. అలాగే, కంపెనీ ఈ తాజా సిరీస్‌తో ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే ఫీచర్‌లను ఉపయోగించనుంది. ప్రో మోడల్స్‌లో చాలా కనిపిస్తాయి. అయితే ప్రో, మ్యాక్స్ వేరియంట్‌లలో కంపెనీ ఎలాంటి ఫీచర్లను ఉపయోగిస్తుందనే దాని గురించి పూర్తి సమాచారం వెల్లడి కాలేదు. కొన్ని లీకుల ద్వారా ఈ ఫోన్‌ల సమాచారం బయటకు వచ్చింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి