Realme C33: 50 మెగాపిక్సెల్‌తో రియల్‌మి నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్.. భారత్‌లో ఎప్పుడు విడుదల అంటే..!
Realme C33: ప్రస్తుతం కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. మొబైల్ తయారీ కంపెనీలు అత్యాధునిక ఫీచర్లను జోడిస్తూ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి..
Realme C33: ప్రస్తుతం కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. మొబైల్ తయారీ కంపెనీలు అత్యాధునిక ఫీచర్లను జోడిస్తూ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి.రియల్‌మి నుంచి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రానుంది. Realme C33 ఇండియా విడుదల తేదీని సెప్టెంబర్ 6న నిర్ణయించినట్లు కంపెనీ ప్రకటించింది. Realme నుండి రాబోయే స్మార్ట్‌ఫోన్ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా, 5000mAh బ్యాటరీని ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతానికి ఈ స్మా్ర్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఇతర వివరాలు వెల్లించలేదు. అయితే, ఫోన్ కోసం మైక్రోసైట్ అధికారిక Realme India వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. ఇది డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, స్లిమ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. గత నెలలో Realme C33 మూడు కలర్స్‌తో వస్తుందని తెలుస్తోంది. రియల్‌మే C33 సెప్టెంబర్ 6 మధ్యాహ్నం 12 గంటలకు భారత్‌లో విడుదల కానున్నట్లు కంపెనీ తెలిపింది.
Realme C33 డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది, ఇది 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. Realme ప్రకారం, స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో అత్యధిక పిక్సెల్-పనితీరును అందిస్తుంది. స్పష్టమైన బ్యాక్‌లిట్ ఫోటోల కోసం CHDR అల్గోరిథంతో వస్తుంది. ఈ ఫోన్ గరిష్టంగా 37 రోజుల స్టాండ్‌బైని అందిస్తుందని తెలుస్తోంది.
లీక్‌ల ప్రకారం.. ఈ ఫోన్ బరువు187 గ్రా బరువు ఉంటుందని Realme తెలిపింది. స్మార్ట్‌ఫోన్ శాండీ గోల్డ్, ఆక్వా బ్లూ, నైట్ సీ కలర్ ఆప్షన్‌లలో వస్తుందని తెలుస్తోంది. ఇది 3GB RAM + 32GB స్టోరేజ్, 4GB RAM + 64GB స్టోరేజ్, 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్లలో రానున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.రూ. 9,500,రూ.10,500 వరకు ఉండే అవకాశం ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి