Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Redmi A1: సెప్టెంబర్‌ 6న రెడ్‌మి నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌.. పూర్తి వివరాలు

Redmi A1:దేశంలో కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్‌లు విడుదలవుతున్నాయి. టెక్నాలజీని ఉపయోగించి కొత్త కొత్త ఫీచర్స్‌ను జోడిస్తూ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి..

Redmi A1: సెప్టెంబర్‌ 6న రెడ్‌మి నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌.. పూర్తి వివరాలు
Redmi A1
Follow us
Subhash Goud

|

Updated on: Sep 03, 2022 | 6:39 PM

Redmi A1:దేశంలో కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్‌లు విడుదలవుతున్నాయి. టెక్నాలజీని ఉపయోగించి కొత్త కొత్త ఫీచర్స్‌ను జోడిస్తూ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి కంపెనీలు. ఇక రెడ్‌మి నుంచి కూడా అద్భుతమైన స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి రాగా, తాజాగా మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ విడుదల కానుంది. Redmi A1పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో సెప్టెంబర్‌ 6న విడుదల చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ MediaTek చిప్‌సెట్‌తో అందుబాటులోకి రానుంది. Redmi A1 స్మార్ట్‌ఫోన్‌లో వెనుకాల డ్యూయల్ కెమెరా సెటప్‌ ఉంటుంది. లెదర్ ఆకృతితో వెనుక ప్యానెల్‌ను కలిగి ఉండేలా స్మార్ట్‌ఫోన్ ఉంటుంది. ఈ ఫోన్‌కు 5000mAh బ్యాటరీతో వస్తుంది. Redmi A1 సెప్టెంబర్ 6 న మధ్యాహ్నం 12 గంటలకు భారత్‌లో విడుదల చేయనున్నట్లు Xiaomi అనుబంధ సంస్థ ట్విట్టర్ ద్వారా శుక్రవారం ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

Redmi A1 LED ఫ్లాష్‌తో డ్యూయల్ రియర్ AI కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ మూడు కలర్స్‌లో అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 164.67 మిమీ పొడవు, వెడల్పు 76.56 మిమీ ఉంటుంది. 3GB RAMతో ఉండనుంది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 12 పై రన్‌ అవుతుందని కంపెనీ తెలిపింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి