Samsung Galaxy Wide 6: శాంసంగ్‌ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ఫోటోగ్రాఫీకి ప్రత్యేకం.. అద్భుతమైన ఫీచర్స్‌.. ధర వివరాలు

Samsung Galaxy Wide 6: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. గెలాక్సీ వైడ్ 5 స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా కంపెనీ..

Samsung Galaxy Wide 6: శాంసంగ్‌ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ఫోటోగ్రాఫీకి ప్రత్యేకం.. అద్భుతమైన ఫీచర్స్‌.. ధర వివరాలు
Samsung Galaxy Wide 6
Follow us
Subhash Goud

|

Updated on: Sep 04, 2022 | 7:34 PM

Samsung Galaxy Wide 6: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. గెలాక్సీ వైడ్ 5 స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా కంపెనీ Samsung Galaxy Wide 6ని పరిచయం చేసింది. దక్షిణ కొరియా మార్కెట్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయబడింది. దీని ధర KRW 3,49,000 (సుమారు రూ. 20,417). కొత్త స్మార్ట్‌ఫోన్ 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో నాక్ చేయబడింది. గెలాక్సీ వైడ్ 6 స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 700 చిప్‌సెట్ సపోర్ట్‌తో వస్తుంది. Samsung Galaxy Wide 6 స్మార్ట్‌ఫోన్‌లో 6.5-అంగుళాల LCD డిస్‌ప్లే ఉంది. ఇది 720 x 1600 పిక్సెల్‌ల HD + రిజల్యూషన్‌తో ఉంటుంది.

మీ ఫోటోగ్రఫీని మరింత ప్రత్యేకంగా చేయడానికి ఇది 50 MP ప్రధాన కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి వచ్చంది. ఇది కాకుండా 2 MP మాక్రో కెమెరా, 2 MP డెప్త్ కెమెరా, LED ఫ్లాష్ అందుబాటులో ఉన్నాయి. స్క్రీన్‌పై వాటర్‌డ్రాప్ నాచ్‌లో 8 MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ One UI ఆధారిత Android 12 OS పై నడుస్తుంది. ఈ ఫోన్‌ 5,000mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimension 700 చిప్‌సెట్ సపోర్ట్‌తో వస్తుంది.

తాజా స్మార్ట్‌ఫోన్‌లో 4 GB RAM, 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌లో ఉంది. ఇవే కాకుండా స్టోరేజీని పెంచడానికి మైక్రో SD కార్డ్ కోసం స్లాట్ కూడా ఉంది. యూజర్లు ఫేస్ అన్‌లాక్, సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి సెక్యూరిటీ ఫీచర్‌లు కూడా ఉన్నాయి. Samsung Galaxy Wide 6 స్మార్ట్‌ఫోన్ Galaxy A13 5G రీబ్రాండెడ్ వెర్షన్. ప్రస్తుతం, గెలాక్సీ వైడ్ 6 దక్షిణ కొరియాలో ప్రత్యేకంగా అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి