Sleeping Problems: మీకు నోరు తెరిచి పడుకునే అలవాటు ఉందా..? అయితే మీకు ఈ వ్యాధి ఉన్నట్లే

నిద్రపోతున్నప్పుడు ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడితే ఆటోమెటిక్ గా నోటితో శ్వాస తీసుకుంటాం. అయితే ఇది స్లీప్ అప్నియా వ్యాధిని సూచిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే కొందరు అలవాటు కొద్దీ నోరు తెరిచి పడుకుంటారని, నోరు తెరిచి పడుకున్న వారందరికీ ఈ వ్యాధి ఉన్నట్లు కాదని చెబుతున్నారు.

Sleeping Problems: మీకు నోరు తెరిచి పడుకునే అలవాటు ఉందా..? అయితే మీకు ఈ వ్యాధి ఉన్నట్లే
Sleeping (File Photo)
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 04, 2023 | 3:38 PM

మనలో చాలా మందికి పడుకున్నప్పుడు నోరు తెరిచి పడుకోవడం అలావాటు ఉంటుంది. అయితే ప్రశాంత నిద్ర కోసం అలా చేస్తున్నాం అని చాలా మంది అనుకుంటారు. కానీ అది కూడా ఓ వ్యాధేనని నిపుణులు చెబుతున్నారు. నిద్రపోతున్నప్పుడు ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడితే ఆటోమెటిక్ గా నోటితో శ్వాస తీసుకుంటాం. అయితే ఇది స్లీప్ అప్నియా వ్యాధిని సూచిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే కొందరు అలవాటు కొద్దీ నోరు తెరిచి పడుకుంటారని, నోరు తెరిచి పడుకున్న వారందరికీ ఈ వ్యాధి ఉన్నట్లు కాదని చెబుతున్నారు. సాధారణంగా వ్యక్తి పడుకున్పుడు ముక్కు లోపల రక్త నాళాలన్నీ రక్తంతో నిండిపోయి వాపు, సంకోచానికి కారణమవుతాయి. దీంతో ఆ వ్యక్తి శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని కాబట్టి నోటి ద్వారా శ్వాసను తీసుకుంటాడు. అలాగే నోరు తెరిచి పడుకోడానికి చాలా కారణాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓ సారి చూద్దాం.

ఒత్తిడి

మితిమీరిన ఆత్రుత, ఒత్తిడికి గురికావడం వల్ల రాత్రి సమయంలో నోటి ద్వారా శ్వాస పీల్చుకునే అవకాశం ఉంది. వాస్తవానికి, ఒక వ్యక్తి ఆందోళన చెందుతున్నప్పుడు, శ్వాస కూడా వేగం మారుతుంది. దీంతో రక్తపోటు పెగిన సమయంలో తన నోరు తెరిచి వేగంగా ఊపిరి పీల్చుకుంటాడు.

అలర్జీలు

నోటి ద్వారా శ్వాస తీసుకోవడానికి అలెర్జీలు మరొక సాధారణ కారణంగా నిలుస్తాయి. అలర్జీలు ఉన్న వారు దాని నివారణకు వేగంగా ఊపిరి పీల్చుకుంటారు. ఆ సమయంలో నోటి ద్వారా ఊపిరి పీల్చుుకునే అవకాశం ఉంది. 

ఇవి కూడా చదవండి

ఆస్తమా

ఆస్తమా వ్యాధి ఊపిరితిత్తులలో వాపు వల్ల వస్తుంది. ఈ వ్యాధి ఉన్నవారికి తరచుగా శ్వాస ఆడకపోవడం మరియు గురకకు కారణమవుతుంది. ఇది నయం కావడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఈ వ్యాధి ఉన్న వారు నోటి ద్వారా శ్వాస తీసుకుంటారు. 

జలుబు, దగ్గు

సాధారణంగా శీతాకాలంలో అందరూ జలుబు, దగ్గుతో బాధపడుతుంటారు. ఇలాంటి సమయంలో, శరీరం పూర్తిగా సాధారణమైన ఆక్సిజన్‌ను పొందడానికి నోటి ద్వారా శ్వాస తీసుకుంటారు. అంతే కాకుండా జలుబుతో సైనస్ లాంటి జబ్బు వచ్చినా నోటితోనే ఊపిరి పీల్చుకుంటారు. 

కాబట్టి, మీకు ఈ సమస్యలు ఏమైనా ఉంటే, మీరు నిద్రపోతున్నప్పుడు మీ నోటి ద్వారా శ్వాస తీసుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ, సమస్య కొనసాగితే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
ఈ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు.. లేటెస్ట్‌ వెదర్‌ రిపోర్ట్‌
ఈ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు.. లేటెస్ట్‌ వెదర్‌ రిపోర్ట్‌
లీకైన కొత్త ఐఫోన్ ఫొటోలు.. స్టన్నింగ్ లుక్ అంటున్న నెటిజనులు..
లీకైన కొత్త ఐఫోన్ ఫొటోలు.. స్టన్నింగ్ లుక్ అంటున్న నెటిజనులు..
ఇంట్లో ఈ పరిస్థితులు ఉంటే.. నెగిటివ్‌ ఎనర్జీ ఉన్నట్లే..
ఇంట్లో ఈ పరిస్థితులు ఉంటే.. నెగిటివ్‌ ఎనర్జీ ఉన్నట్లే..
డయాబెటిస్‌తో బాధపడుతున్నా నో ప్రాబ్లమ్‌.. ఈ డైట్‌ ఫాలో అయితే చాలు
డయాబెటిస్‌తో బాధపడుతున్నా నో ప్రాబ్లమ్‌.. ఈ డైట్‌ ఫాలో అయితే చాలు
పాలల్లో చక్కెరకు బదులు తేనె కలిపి తాగుతున్నారా?
పాలల్లో చక్కెరకు బదులు తేనె కలిపి తాగుతున్నారా?
కన్నకొడుకు కడచేరినా.. కొందరి జీవితాలను మార్చిన తల్లిదండ్రుల ఐడియా
కన్నకొడుకు కడచేరినా.. కొందరి జీవితాలను మార్చిన తల్లిదండ్రుల ఐడియా
వచ్చేవారం మార్కెట్లో విడుదల కానున్న మూడు స్మార్ట్‌ ఫోన్లు..
వచ్చేవారం మార్కెట్లో విడుదల కానున్న మూడు స్మార్ట్‌ ఫోన్లు..
చర్మాన్ని నవయవ్వనంగా ఉంచే ఆహారాలు ఇవే..
చర్మాన్ని నవయవ్వనంగా ఉంచే ఆహారాలు ఇవే..
ఓ మై గాడ్.! ఇలా ఉన్నావేంట్రా.. అది నూడిల్స్ కాదురా నాగుపాము..!
ఓ మై గాడ్.! ఇలా ఉన్నావేంట్రా.. అది నూడిల్స్ కాదురా నాగుపాము..!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.