సహజంగా పండిన మామిడి పండును 10 సెకన్లలో గుర్తించే ట్రిక్
10 June 2026
TV9 Telugu
TV9 Telugu
వేసవి కాలంలో ఎక్కువగా దొరికే మామిడిపండ్లను అందరూ ఎంతో ఇష్టం తింటారు. అయితే మార్కెట్‌లో కనిపించే ప్రతి మామిడి పండు ఒకే రకమైన నాణ్యతను కలిగి ఉండదు
TV9 Telugu
అందుకే మామిడి పండ్లను కొనుగోలు చేసే సమయంలో కొన్ని విషయాలను తప్పనిసరిగా గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు
TV9 Telugu
మామిడి పండును ఎంపిక చేసే సమయంలో ముందుగా దాని వాసనను పరిశీలించాలి. సాధారణంగా బాగా పండిన మామిడి పండు కాడ దగ్గర నుంచి తియ్యని, సహజమైన సువాసన వస్తుంది
TV9 Telugu
వాసన లేకపోతే ఆ పండు ఇంకా పూర్తిగా పండలేదని అర్థం. అలాంటి పండ్లను ఇంట్లో కొన్ని రోజులు ఉంచితే పక్వానికి వచ్చే అవకాశం ఉంటుంది
TV9 Telugu
మామిడి పండు రంగును మాత్రమే ఆధారంగా తీసుకుని నిర్ణయం తీసుకోవడం సరైంది కాదు. ఎందుకంటే వివిధ రకాల మామిడి పండ్లకు వేర్వేరు రంగులు ఉంటాయి
TV9 Telugu
అందువల్ల రంగు కంటే పండు పై తొక్కను జాగ్రత్తగా పరిశీలించడం మంచిది. కోతలు, గాయాలు, నల్లని మచ్చలు లేదా దెబ్బతిన్న భాగాలు ఉన్న పండ్లను కొనకూడదు
TV9 Telugu
తొక్కపై ముడతలు కనిపించే మామిడి పండ్లను కూడా నివారించడం మంచిది. సాధారణంగా ముడతలు పడటం అంటే పండులోని తేమ తగ్గిపోయిందని, తాజాదనం కోల్పోయిందని సూచిస్తుంది
TV9 Telugu
మంచి మామిడి పండు బొద్దుగా, దృఢంగా, ఆకర్షణీయమైన ఆకారంలో ఉంటుంది. మామిడి పండును చేతిలోకి తీసుకుని దాని బరువును కూడా గమనించాలి. బరువైన పండ్లనే ఎంపిక చేసుకోవాలి