Pumpkin: గుమ్మడి కాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ కణాలు ఆక్సీకరణం చెందినప్పుడు,.. అవి రక్త నాళాల గోడలకు అంటుకుని గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి.

Pumpkin: గుమ్మడి కాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 04, 2023 | 1:08 PM

గుమ్మడికాయతో చాలా మంది చాలా రకాల వంటకాలు చేస్తుంటారు.కొందరు వీటితో స్వీట్స్‌, వడియాలు చేసుకుంటారు. మరికొందరు పప్పు కూరగా కూడా వండుకుంటారు. అయితే, ఈ గుమ్మడిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగివున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. గుమ్మ‌డికాయ‌ల్లో విటమిన్‌ ఏ 200 శాతం ఉంటుంది. విటమిన్ సి, ఇ, రైబోఫ్లేవిన్, పొటాషియం, కాప‌ర్, మాంగ‌నీస్, విట‌మిన్ బి6, ఫోలేట్‌, ఐర‌న్, ఫాస్ఫ‌ర‌స్ వంటి పోష‌కాలు కూడా గుమ్మ‌డికాయ‌ల్లో పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల శరీరానికి కావాల్సిన పోష‌ణ గుమ్మడికాయలో ల‌భిస్తుంది. గుమ్మడికాయలో ఉండే విటమిన్ సి..తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. రోగనిరోధక కణాలను మరింత సమర్థవంతంగా పని చేసేలా చేస్తుంది. ఫలితంగా రకరకాల వైరస్‌లూ, ఇన్‌ఫెక్షన్లు దూరమవుతాయి.

గుమ్మడికాయలో కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసే కాంపౌండ్స్ అధికంగా ఉంటాయి. ఇది కొన్ని క్యాన్సర్ల నుండి రక్షిస్తుంది. గుమ్మడికాయలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే వివిధ పోషకాలు ఉన్నాయి. ఇందులో పొటాషియం, విటమిన్ సి, ఫైబర్ అధికంగా ఉంటాయి, ఇది గుండె ప్రయోజనాలతో ముడిపడి ఉంది. దీనిలో ఉండే విటమిన్ ఎ శరీరంలో బీటాకెరొటిన్‌గా మారి హార్మోన్ల అసమతుల్యత రాకుండా కాపాడుతుంది. ఎముక సాంద్రత దృఢపడుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి. అంతేకాదు ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, బీటాకెరొటిన్లు అధికంగాఉంటాయి. ఇవి కంటిచూపు స్పష్టంగా ఉండటానికి దోహదం చెస్తాయి. కంటి సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.

గుమ్మడికాయలో చర్మానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుమ్మడికాయలో ఉండే, విటమిన్ సి ఆరోగ్యకరమైన చర్మానికి అవసరం. చర్మాన్ని బలంగా ఆరోగ్యంగా ఉంచే కొల్లాజెన్ అనే ప్రొటీన్‌ను తయారు చేయడానికి శరీరానికి ఈ విటమిన్ అవసరం. అంతేకాదు, గుమ్మడి గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి.

ఇవి కూడా చదవండి

ముఖ్యంగా చదువుకునే పిల్లలకు గుమ్మడితో చేసిన వంటకాలు తినిపించడం ఎంతో మంచిది. ఇంకా, తల్లి కావాలనుకుంటున్నవారికి గుమ్మడి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే ఇనుము సంతాన సాఫల్యతను పెంచుతుంది. గుమ్మడికాయలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది చెడు LDL కొలెస్ట్రాల్‌ను ఆక్సీకరణం నుండి రక్షిస్తుంది. ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ కణాలు ఆక్సీకరణం చెందినప్పుడు,.. అవి రక్త నాళాల గోడలకు అంటుకుని గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే