Vitamin D Deficiency: ఎముకల వ్యాధితో బాధపడుతున్నారా? ఇవి తిన్నారంటే వ్యాధి దూరం..

విటమిన్-డి లోపం వల్ల ఓస్టియోపొరోసిస్ (బోలు ఎముకల వ్యాధి) వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం తినే ఆహారం వల్లే విటమిన్-డి లోపం వస్తుందని చెబుతున్నారు. విటమిన్ డి లోపంతో బాధపడేవారు ప్రతి రోజు తినే ఆహారంలో విటమిన్ -డి ఎక్కువగా ఉండే ఆహార పదార్థలను తీసుకోవాలి. తద్వారా 10 నుంచి 20 శాతం వరకూ సమస్యను అధిగమించవచ్చు.

Vitamin D Deficiency: ఎముకల వ్యాధితో బాధపడుతున్నారా? ఇవి తిన్నారంటే వ్యాధి దూరం..
Vitamin D
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Jan 04, 2023 | 2:09 PM

విటమిన్ -డి శరీరానికి చాలా ముఖ్యమైన పోషకం. శరీరంలోని ఎముకల రక్షణకు ఇది చాలా సాయం చేస్తుంది. అయితే విటమిన్-డి లోపం ఎముకల వ్యాధులకు కారణమవుతుందని మీకు తెలుసా? నిజమే విటమిన్-డి లోపం వల్ల ఓస్టియోపొరోసిస్ (బోలు ఎముకల వ్యాధి) వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం తినే ఆహారం వల్లే విటమిన్-డి లోపం వస్తుందని చెబుతున్నారు. విటమిన్ డి లోపంతో బాధపడేవారు ప్రతి రోజు తినే ఆహారంలో విటమిన్ -డి ఎక్కువగా ఉండే ఆహార పదార్థలను తీసుకోవాలి. తద్వారా 10 నుంచి 20 శాతం వరకూ సమస్యను అధిగమించవచ్చు. సమస్య మాత్రం అధికంగా ఉంటే కచ్చితంగా డాక్టర్ చూపించుకోవాలి. విటమిన్-డి లోప నివారణకు నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. అవేంటో ఓ సారి చూద్దాం.

ఎండలో ఉండడం

విటమిన్ -డి లోపంతో బాధపడే వారు ప్రతి రోజు ఉదయం 9 గంటలలోపు వచ్చే ఎండలో ఓ అరగంట సేపైనా ఉండాలి. అంటే అరగంట సేపు నుంచోవడం కాదని గమనించాలి. ఉదయం పూట వచ్చే ఎండలో వ్యాయామం చేయడం. లేదా కనీసం కాళ్లు, చేతులు కదిలిస్తూ వాకింగ్ చేస్తూ శరీరంలోని ప్రతి భాగానికి ఎండ తగిలేలా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

కాడ్ లివర్ ఆయిల్

విటమిన్-డి లోపంతో బాధపడేవారు కచ్చితంగా కాడ్ లివర్ ఆయిల్ రోజూ తమ ఆహారంలో చేర్చుకోవాలి. కాడ్ లివర్ ఆయిల్ విటమిన్-డి ను అధికంగా సప్లయ్ చేస్తుంది. కాబట్టి కాడ్ లివర్ ఆయిల్ ఉపయోగాలను గుర్తించి ప్రతిరోజూ ఆహారంలో చేర్చుకోవాలి.

ఇవి కూడా చదవండి

చేపలు

మనం అప్పుడప్పుడు తీసుకునే మాంసాహార ఉత్పత్తులో చేపలు ఒకటి. అయితే చేపలను అధికంగా తీసుకుంటే విటమిన్ -డి లోపం నుంచి బయటపడవచ్చని నిపుణులు వాదన. చేపల్లోని ట్యూనా, సాల్మన్, మాకెరిల్, హీర్రింగ్ వంటి రకాల్లో విటమిన్-డి అధికంగా ఉంటుంది. 

గుడ్లు

గుడ్డు అనేది సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే ఆహారం. గుడ్లను ప్రతిరోజూ తింటే శరీరంలో విటమిన్ -డి శాతం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి విటమిన్-డి లోపంతో ఉన్నవారు కచ్చితంగా గుడ్డును డైలీ తీసుకోవాలని సూచిస్తున్నారు. 

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు