Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vitamin D: శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? విటమిన్ డీ లోపం ఉన్నట్లే.. అవేంటో తెలుసుకోండి

Benefits Of Vitamin D: బలమైన ఎముకలు, ఆరోగ్యవంతమైన దంతాల కోసం శరీరానికి విటమిన్ డి చాలా అవసరం. విటమిన్ డి లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. విటమిన్ డి లోపం వల్ల

Vitamin D: శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? విటమిన్ డీ లోపం ఉన్నట్లే.. అవేంటో తెలుసుకోండి
Vitamin D
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 24, 2022 | 9:53 PM

Benefits Of Vitamin D: బలమైన ఎముకలు, ఆరోగ్యవంతమైన దంతాల కోసం శరీరానికి విటమిన్ డి చాలా అవసరం. విటమిన్ డి లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. విటమిన్ డి లోపం వల్ల శరీరంలో కనిపించే లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. విటమిన్ డి లోపాన్ని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోవడంలో సహాయపడతాయి. విటమిన్ డి ఇతర విటమిన్ల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఇది హార్మోన్ (Vitamin D Deficiency) గా పనిచేస్తుంది. ఇది మన శరీరానికి చాలా ముఖ్యం. ఇది శరీరంలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం మొదలైనవాటిని గ్రహించడంలో సహాయపడుతుంది. సూర్యరశ్మి విటమిన్ డికి మంచి మూలం. విటమిన్ డి లోపాన్ని తీర్చడానికి, మీరు అవకాడో, చికెన్, వేరుశెనగలు, వెన్న లాంటివి తీసుకోవాలి. విటమిన్ డి లోపం వల్ల ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

అలసట..

సరైన ఆహారం తీసుకోకపోయినా, తగినంత నిద్రపోయినా చాలా మందికి అలసటగా అనిపిస్తుంది. దీనికి కారణం శరీరంలో విటమిన్ డి తగినంతగా లేకపోవడం. విటమిన్ డి లోపం వల్ల చాలా అలసట వస్తుంది. దీనిని విస్మరించడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలాంటి పరిస్థితిలో విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. దీంతో శక్తి స్థాయిలను మెరుగుపడతాయి. లేకపోతే వైద్యుడిని సంప్రదించడం మేలు.

ఎముకలు – కండరాల నొప్పి

విటమిన్ డి ఎముకలను దృఢంగా చేస్తుంది. శరీరంలో కాల్షియం ఉత్పత్తికి విటమిన్ డి అవసరం. విటమిన్ డి లేకపోవడం వల్ల శరీరానికి తగినంత కాల్షియం అందదు. దీని వల్ల ఎముకలు, కండరాల్లో నొప్పి సమస్య ఉంటుంది. కొన్నిసార్లు వెన్ను లేదా కండరాలలో నొప్పి ఉంటుంది. ఇవి విటమిన్ డి లోపం లక్షణాలు కావచ్చు.

టెన్షన్

విటమిన్ డి లోపం కారణంగా.. మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. విటమిన్ డి తక్కువగా ఉన్న మహిళలు తరచుగా ఒత్తిడికి గురవుతారు. సూర్యకాంతి మీ మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మెదడులో సెరోటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుందని అధ్యయనంలో తెలింది.

బలహీన రోగనిరోధక శక్తి

విటమిన్ డి మీ రోగనిరోధక వ్యవస్థను బలంగా మార్చుతుంది. ఇది వైరస్లు, బ్యాక్టీరియా నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. మీరు తరచుగా అనారోగ్యానికి గురైనా జలుబు లేదా ఫ్లూ వంటి సమస్యను ఎదుర్కొంటే విటమిన్ డి లోపం ఒక లక్షణం కావచ్చు. ప్రతి సీజనల్ మార్పు మీ శరీరంపై ప్రభావం చూపుతుంది.

Also Read:

Male Contraceptive Pills: మగవారికి గుడ్‌న్యూస్.. అందుబాటులోకి బర్త్ కంట్రోల్ పిల్స్.. ప్రయోగం సక్సెస్..

Celery Juice: అన్ని సమస్యలకు ఒక్కటే జ్యూస్.. ఎండాకాలంలో రోజూ ఇది తాగితే బోలెడన్ని లాభాలు..