AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tears: ఆనంద భాష్పాలు ఎందుకు వస్తాయో తెలుసా.. వాటి వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏమిటంటే..

దాదాపు అందరికి ఆనంద భాష్పాలు వస్తాయి. మనం పట్టరాని సంతోషానికి లోనైనప్పుడు మన కళ్ల నుంచి నీళ్లు వాటంతటవే ఉబికి వస్తుంటాయి...

Tears: ఆనంద భాష్పాలు ఎందుకు వస్తాయో తెలుసా.. వాటి వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏమిటంటే..
Tears
Srinivas Chekkilla
|

Updated on: Mar 25, 2022 | 6:15 AM

Share

దాదాపు అందరికి ఆనంద భాష్పాలు వస్తాయి. మనం పట్టరాని సంతోషానికి లోనైనప్పుడు మన కళ్ల నుంచి నీళ్లు వాటంతటవే ఉబికి వస్తుంటాయి. ముఖ్యంగా భావోద్వేగపూరితమైన కొన్ని సందర్భాల్లో నవ్వు, ఏడుపు ఒకేసారి వస్తుంటాయి. తద్వారా మనిషిలో ఉన్న ఒత్తిడి పూర్తిగా తొలగిపోతుంది. ఈ ఆనంద భాష్పాల వెనుక ఉన్న శాస్త్రీయపరమైన కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని అధ్యయనాల ప్రకారం… ఆనంద భాష్పాలకు 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం.. మనం స్వేచ్ఛగా నవ్వినప్పుడు.. అది మన మెదడులోని లాక్రిమల్ గ్రంధులపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా కళ్ల నుంచి నీళ్లు బయటకు వస్తాయి.రెండో కారణం ఏమిటంటే.. భావోద్వేగపూరిత సందర్భంలో నవ్వినప్పుడు.. అది ముఖంలోని కణాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. అప్పుడు కళ్ల నుంచి నీళ్లు బయటకొస్తాయి. ఒక రకంగా మన శరీరం కన్నీళ్ల ద్వారా ఒత్తిడిని సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తుంది.

వాస్తవానికి ఈ మొత్తం ప్రక్రియ ఒక్కొక్కరిలో భిన్నంగా ఉంటుంది. కొంతమంది త్వరగా ఉద్విగ్నతకు లోనవుతారు. అలాంటివారిలో ఆనందభాష్పాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ భావోద్వేగానికి గురవుతారని చెబుతారు. బాల్టిమోర్‌లోని యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్‌కి చెందిన మనస్తత్వవేత్త రాబర్ట్ ప్రొవిన్ ప్రకారం మనిషి భావోద్వేగానికి గురికావడంలో హార్మోన్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని చెప్పారు. నిరంతరం నవ్వడం లేదా ఏడవడం వల్ల మెదడు కణాలపై చాలా ఒత్తిడి ఉంటుందన్నారు. అప్పుడు కార్టిసాల్, అడ్రినలిన్ అనే హార్మోన్లు శరీరంలో విడుదలవుతాయని. మీరు నవ్వినప్పుడు లేదా ఏడ్చినప్పుడు అందుకు వ్యతిరేకంగా జరిగే ప్రతిచర్యకు ఈ హార్మోన్లే కారణమని తెలిపారు.

గమనిక:- ఈ కథనం కేవలం నిపుణుల సూచనల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది.

Read Also.. Breakfast: ఉదయం అల్పాహారంగా ఈ పదార్థాలు తీసుకుంటున్నారా.. అయితే వెంటనే ఆపేయండి..