Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vitamin D: అవసరం కంటే ఎక్కువగా విటమిన్ డి తీసుకుంటున్నారా?.. ఈ 4 దుష్ప్రభావాలు శరీరంలో కనిపిస్తాయి.. అవేంటంటే..

ఒక రోజులో 60 -1000 IU విటమిన్ డి అవసరమవుతుంది. అయితే దీని కంటే ఎక్కువ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది.

Vitamin D: అవసరం కంటే ఎక్కువగా విటమిన్ డి తీసుకుంటున్నారా?.. ఈ 4 దుష్ప్రభావాలు శరీరంలో కనిపిస్తాయి.. అవేంటంటే..
Vitamin D
Follow us
Sanjay Kasula

| Edited By: Anil kumar poka

Updated on: Oct 07, 2022 | 2:49 PM

విటమిన్ డి మన శరీరానికి అవసరమైన పోషకం. ఇది మన ఎముకలు, దంతాలను బలంగా చేస్తాయి. మన జీవనశైలి , ఆహారపు అలవాట్లు చాలా మందికి తమ శరీరంలో అవసరమైన విటమిన్ లోపాన్ని ఏర్పర్చుతాయి. వర్క్ ఫ్రం  హోంతో  సూర్యరశ్మిని తీసుకోవడం లేదు. ఎయిర్ కండిషన్డ్ గదులలో గంటలు.. గంటలు గడుపుతున్నాం. ఆహారంలో విటమిన్ డి ఉన్న ఆహారాన్ని తీసుకోవడం లేదు. దీని కారణంగా శరీరంలో ఈ ముఖ్యమైన విటమిన్ లోపం ఏర్పడుతుంది. విటమిన్ డి బలమైన ఎముకలకు అవసరమైన కాల్షియంను శరీరంలో నిలుపుకోవడంలో సహాయపడుతుంది. విటమిన్ డి లేకపోవడం వల్ల ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. దీంతో ఎముకలలో పగుళ్లు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. ఎముకలు, కండరాలలో నొప్పి కలిగే అనుభూతి ఏర్పడుతుంది. ఈ విటమిన్ లోపం వల్ల మహిళల్లో వెన్ను నొప్పి సమస్య పెరుగుతుంది. శరీరంలో విటమిన్ డి లోపాన్ని తీర్చడానికి.. కొంతమంది విటమిన్ డి డైట్ తీసుకుంటారు. అలాగే విటమిన్ డి సప్లిమెంట్‌గా మాత్రలు తీసుకుంటారు.

మనందరికీ రోజుకు 60-1000 IU విటమిన్ డి అవసరం. కానీ కొంతమంది ఈ విటమిన్‌ను అవసరానికి మించి తీసుకోవడం ప్రారంభిస్తారు. విటమిన్ డి అధికంగా తీసుకోవడం వల్ల కూడా శరీరానికి హాని కలుగుతుంది. విటమిన్ డి ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో తెలుసుకుందాం.

జీర్ణక్రియ ప్రభావాన్ని కలిగిస్తుంది:

విటమిన్ డి ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. విటమిన్ డి ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం పరిమాణం పెరుగుతుంది. ఇది మలబద్ధకానికి దారితీస్తుంది. విటమిన్ డి ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, ఆకలి లేకపోవటం, వికారం, మలబద్ధకం వంటివి ఏర్పడతాయి.

మెదడుపై కూడా ప్రభావం చూపుతుంది:

విటమిన్ డి ఎక్కువగా తీసుకోవడం వల్ల మీరు అసౌకర్యానికి గురవుతారు. మీరు అలసిపోయినట్లు, మానసికంగా కలవరపడవచ్చు. విటమిన్ డి అధికంగా తీసుకోవడం మీ మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది.

గందరగోళాన్ని పెంచవచ్చు:

మీరు విటమిన్ డి ఎక్కువగా తీసుకుంటే, నిర్ణయం తీసుకునే సామర్థ్యం దెబ్బతింటుంది. విటమిన్ డి ఎక్కువగా తీసుకునే వ్యక్తులు తరచుగా గందరగోళానికి గురవుతారు.

అధిక దాహం:

శరీరంలో విటమిన్ డి అధికంగా ఉండటం వల్ల, దాహం ఎక్కువ అవుతుంది. మానవులలో డీహైడ్రేషన్ ప్రమాదం పెరుగుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..