ఎయిరిండియా విమానంలో తాగుబోతు హల్‌చల్‌.. వృద్ధురాలిపై మూత్రంపోసి.. వెకిలి చేష్టలు..

తాగుబోగు పాసింజర్ చేసిన పనితో త‌న దుస్తులు, బ్యాగ్, షూ త‌డిసిన‌ట్లు ఆమె ఆరోపించారు. చాలా సేపటి తర్వత గానీ, విమానం సిబ్బంది త‌న‌కు

ఎయిరిండియా విమానంలో తాగుబోతు హల్‌చల్‌.. వృద్ధురాలిపై మూత్రంపోసి.. వెకిలి చేష్టలు..
Air India
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 04, 2023 | 12:40 PM

అమెరికా నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న 70 ఏళ్ల వృద్ధురాలిపై మద్యం మత్తులో ఓ వ్యక్తి మూత్రం పోశాడని బాధితురాలు వాపోయింది.. జరిగిన విషయం వెంటనే ఆ వృద్ధురాలు క్యాబిన్ సిబ్బందికి చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది.  పైగా అతను ఏమీ జరగనట్టుగానే ఈజీగా విమానం దిగి విమానాశ్రయం నుండి తప్పించుకుని బయటపడ్డాడని చెప్పింది.. ఇదే విషయమై బాధిత మహిళ టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌కు లేఖ రాయడంతో కేసు దర్యాప్తు ప్రారంభమైంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ సంఘటన గత ఏడాది నవంబర్ 26న ఎయిర్ ఇండియా విమానం AI-102లో జరిగింది. న్యూయార్క్‌లోని JFK విమానాశ్రయం నుండి మధ్యాహ్నం 1 గంటలకు బయలుదేరింది.. భోజనం చేసిన కొద్ది నిమిషాలకే లైట్లు ఆర్పివేశారని వృద్ధురాలు తన లేఖలో రాసింది. ఇంతలో ఓ తాగుబోతు తన సీటు దగ్గరకు వచ్చాడని,  అతను తన ప్యాంట్ తీసి తన ప్రైవేట్ పార్ట్‌లను చూపించాడు.. తనపై మూత్ర విసర్జన చేసిన తర్వాత ఆ వ్యక్తి అక్కడే నిలబడి తన వ్యక్తిగత భాగాలను నిర్మొహమాటంగా ప్రదర్శించాడని లేఖలో పేర్కొన్నారు. తోటి ప్రయాణికుడు కల్పించుకుని వెళ్లగోడితేనే అతను వెళ్లిపోయాడు. వెంటనే క్యాబిన్ సిబ్బందికి సంఘటనపై ఫిర్యాదు చేసినట్టుగా చెప్పింది. నా బట్టలు, బూట్లు, బ్యాగ్ పూర్తిగా మూత్రంతో తడిసిపోయాయని రాసింది. క్యాబిన్ సిబ్బంది తన సీటు వద్దకు వచ్చి మూత్రం వాసన చూసారని లేఖద్వారా వివరించారు.

తనకు జరిగిన దారుణంపై క్యాబిన్ సిబ్బంది ఎటువంటి చర్యలు తీసుకోలేదని లేదని వృద్ధురాలు తన లేఖలో రాసింది. లేఖ ప్రకారం, సిబ్బంది నుండి ప్రతిస్పందన వస్తుందని ఇన్ని రోజులుగా ఎదురు చూశానని చెప్పింది. చివరకు తనకు జరిగిన దానిపై ఎవరూ స్పందించకపోవటంతో..తన వాదనను తానే సమర్పించాల్సి వచ్చిందని మహిళ వాపోయింది. ఈ సంఘటన జరిగిన సమయంలో ఎయిర్‌లైన్ తన భద్రత, సౌకర్యాన్ని కాపాడటానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదని బాధిత వృద్ధరాలు ఫిర్యాదు లేఖలో ప్రస్తావించింది.

ఇవి కూడా చదవండి

తాగుబోగు పాసింజర్ చేసిన పనితో త‌న దుస్తులు, బ్యాగ్, షూ త‌డిసిన‌ట్లు ఆమె ఆరోపించారు. చాలా సేపటి తర్వత గానీ, విమానం సిబ్బంది త‌న‌కు దుస్తుల్ని, చెప్పుల‌ను ఇచ్చిన‌ట్లు ఆమె తెలిపారు. ఫ‌స్ట్ క్లాస్‌లో చాలా సీట్లు ఖాళీగా ఉన్నా.. సిబ్బంది సీటులో ప్ర‌యాణించాల్సి వ‌చ్చింద‌ని ఆమె చెప్పారు.

ఈ మేరకు ఎయిర్ ఇండియా ఈ విషయంపై ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మొత్తం వ్యవహారం ప్రభుత్వ కమిటీ చేతిలోనే ఉందని సమాచారం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?