Aadhaar Address Update: ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవడం ఇప్పుడు మరింత ఈజీ.. ఇంట్లో నుంచే ఇలా చేయండి..
ఆధార్ బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. ఇప్పటి వరకు, ఆధార్‌లోని చిరునామాను మార్చడానికి ఒకరు తన వ్యక్తిగత చిరునామా రుజువును ఇవ్వాల్సివచ్చేది.. ఇప్పుడు అది అవసరం లేదు. కుటుంబ పెద్ద చిరునామా ఉంటే సరిపోతుంది.
ఆధార్ కార్డ్ హోల్డర్‌లకు గుడ్ న్యూస్. ఇక ముందు ఆధార్ కార్డులో చిరునామాను మార్చుకోవడం మరింత సులభతరంగా మారింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఇప్పుడు మీరు ఆధార్‌లోని చిరునామాను అప్‌డేట్ చేయడం గురించి తిరగాల్సిన అవసంర లేదు.. ఇప్పుడు మీరు వ్యక్తిగత చిరునామా రుజువు లేకుండా కూడా మీ ఆధార్‌ను అప్‌డేట్ చేయవచ్చు. ఈ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లో చేసుకుంటే సరిపోతుంది.
ఇంతకుముందు, ఆధార్ కార్డ్‌లోని చిరునామాను అప్‌డేట్ చేయడానికి, కార్డ్ హోల్డర్ వ్యక్తిగత చిరునామా రుజువును అందించాలి. ఇప్పుడు చిరునామాను మార్చడానికి మీ చిరునామా రుజువును అందించాల్సిన అవసరం లేదు. కార్డ్ హోల్డర్ కుటుంబ పెద్ద చిరునామాను రుజువుగా చూపిస్తే సరిపోతుంది.. దీని కోసం కుటుంబ పెద్ద సమ్మతి తీసుకోవడం అవసరం. రేషన్ కార్డు, మార్కుల షీట్, మ్యారేజ్ సర్టిఫికెట్, పాస్‌పోర్టు తదితర ధ్రువీకరణ పత్రాల్లో ఏదైనా ఒకటి సమర్పించవచ్చు. కానీ, ఇందులో ఇంటిపెద్ద పేరు, దరఖాస్తుదారుడి పేరు, వారిద్దరి మధ్య సంబంధం గురించి తప్పనిసరిగా ఉండాలి.
ధార్‌లో ఈ కొత్త అప్‌డేట్‌తో, చిరునామాను మార్చడం చాలా సులభం. వ్యక్తిగత అడ్రస్ ప్రూఫ్ స్థానంలో సపోర్టింగ్ అడ్రస్ ప్రూఫ్ ఇచ్చి పని చేస్తే ప్రజలకు ఎంతో ఉపశమనం లభిస్తుంది.
ఎలా అప్‌డేట్ చేయాలి?
ఆధార్‌పై చిరునామా మార్పు కోసం ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో రేషన్ కార్డ్, మార్క్ షీట్, వివాహ ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ మొదలైన వాటిని సంబంధాల పత్రాలుగా ఉపయోగించవచ్చు. ఇందులో దరఖాస్తుదారుడి పేరు, కుటుంబ పెద్ద, ఇద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని పేర్కొనాల్సి ఉంటుంది. కుటుంబ అధిపతి (HOF)తో OTP ద్వారా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అభ్యర్థనను ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి కుటుంబ పెద్దకు 30 రోజుల సమయం ఇవ్వబడుతుంది.
సంబంధాన్ని నిరూపించడానికి ఎవరి వద్ద ఎటువంటి పత్రాలు లేకుంటే, కుటుంబ పెద్ద స్వీయ-డిక్లరేషన్ ఫారమ్‌ను పూరించవచ్చు.
గొప్ప ఉపశమనం
తమ స్వంత వ్యక్తిగత చిరునామా రుజువు లేని పిల్లలు, జీవిత భాగస్వాములు, తల్లిదండ్రులకు లేదా కుటుంబానికి దూరంగా ఇతర నగరాల్లో నివసిస్తున్న వారికి HoF ఆధారిత ఆన్‌లైన్ చిరునామా అప్‌డేట్‌ను ప్రవేశపెట్టడం చాలా సహాయకారిగా ఉంటుందని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం