Family Budget Planning: కొత్త సంవత్సరంలో ఇదే మీ పొదుపు మంత్రం.. మీ నెలవారీ బడ్జెట్ ను ఇలా ప్లాన్ చేసుకోండి..
నెలవారీ జీతాలతో జీవనం సాగించే వారికి నెలవారీ బడ్జెట్ ప్లానింగ్ అత్యవసరం. ఎక్కడ ఖర్చుపెట్టాలి..? ఎక్కడ ఖర్చు తగ్గించుకోవాలి..? ఎంత మొత్తం పొదుపు చేయాలి..? అన్న అంశాలపై అవగాహన పెంచుకోవాలి.

జీవితంలో ప్రతి ఒక్కరికీ ఓ గోల్ ఉండాలని నిపుణులు చెబుతుంటారు. ఏదో ఒక లక్ష్యంతో పనిచేయాలని సూచిస్తుంటారు. నిజమే.. గురి ఉంటేనే మన ప్రయాణం ఎలా సాగుతుంది? ఇంకా మనం ఏయే విషయాలలో మెరుగవ్వాలి? అనే అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. మారుతున్న కాలం, పెరుగుతున్న వయసుతో పాటు ఖర్చులు కూడా బాగా అధికవమవుతుంటాయి. ఈ సమయంలో ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. ముఖ్యంగా నెలవారీ జీతాలతో జీవనం సాగించే వారికి నెలవారీ బడ్జెట్ ప్లానింగ్ అత్యవసరం. ఎక్కడ ఖర్చుపెట్టాలి..? ఎక్కడ ఖర్చు తగ్గించుకోవాలి..? ఎంత మొత్తం పొదుపు చేయాలి..? అన్న అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఏదైనా అనారోగ్య పరిస్థితుల్లో ఇలా పొదుపు చేసిన మొత్తం మనకు సహకరిస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని చిన్న చిట్కాలు పాటించడం ద్వారా మీ నెలవారీ బడ్జెట్ ను సులభంగా నిర్వహించుకోవచ్చు. ఆర్థిక నిపుణులు చెబుతున్న ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
అత్యవసర పరిస్థితి కోసం కొంత మొత్తం.. జీవితంలో పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. అందుకే కొంత మొత్తాన్ని అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకోవడానికి వీలుగా.. మీ చేతికి వస్తున్న సంపాద నుంచి 20 నుంచి 30 శాతం వరకూ పొదుపు చేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఒక వేళ ఇంత మొత్తంలో మీరు చేయలేకపోయినా.. మీకు అవకాశం ఉన్నంత వరకూ పక్కన పెట్టాలని చెబుతున్నారు.
ఫ్యామిలీ అభిప్రాయంతోనే.. ఫ్యామిలీ బడ్జెట్ ను కఠినంగా అమలు చేయడం ద్వారా ఇంట్లో మిగిలిన వ్యక్తులకు మీరు పెద్ద బడ్జెట్ పద్మనాభం లాగా కనిపించవచ్చు. అందుకనే నెలవారీ బడ్జెట్ ప్లానింగ్ కోసం మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూర్చోబెట్టి వివరించాలి. రాబడి, ఖర్చుల విషయాలను అందరితో చర్చించాలి. అప్పుడు వారికి కూడా అవగాహన ఏర్పడి, ఖర్చులు తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
అనవసర ఖర్చులు తగ్గించాలి.. ప్రధానంగా పొదుపు చేయాలి అంటే కుటుంబంలో అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి. ఏది అవసరం, ఏది అనవసరం అని నిర్ణయించుకోవాలి.
ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవాలి.. మీ బడ్జెట్ ను నెలవారీ రివ్యూ చేసుకోవాలి. ఏమైనా మార్పులు అవసరం అయితే చేసుకోవాలి. దీని కోసం మీ ఫ్యామిలీ మెంబర్స్ అభిప్రాయం తీసుకోవాలి. కచ్చితంగా పెట్టవలసని ఖర్చును పక్కన పెట్టి.. ఇంకా ఏమైనా ఆదా చేసుకునే మార్గం ఉందేమో చూడాలి.
క్రెడిట్ కార్డుతో జాగ్రత్త.. క్రెడిట్ కార్డు ఉన్నది అత్యవసర సమయంలో ఉపయోగపడటానికి మాత్రమే అని గుర్తుంచుకోవాలి. ఉంది కదా అని విచ్చలవిడిగా ఖర్చుపెట్టకూడదు. మీ నెలవారీ రాబడిని అంచనా వేసుకొని మాత్రమే వినియోగించాలి.
పొదుపు పథకాల్లో..
ఇలా ప్రతి నెలా బడ్జెట్ ప్లానింగ్ చేసుకొని ఆదా చేసిన సొమ్మును ఖతాలో అలా ఉంచకుండా.. మార్కెట్ రిస్క్ లేని పెట్టుబడి పథకాలు అంటే గోల్డ్, రియల్ ఎస్టేట్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టాలి. అప్పుడు దీర్ఘకాలంలో మీకు మంచి రాబడులు వచ్చే అవకాశం ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..