Bank Locker Rules: మీరు బ్యాంకు లాకర్ వాడుతున్నారా? అయితే ఈ రూల్స్ మారాయని తెలుసా..?
లాకర్ల ఫీజు అనేది బ్యాంకు అందించే సదుపాయాలు అలాగే బ్యాంకుల ఉన్న బట్టి మారుతుంటాయి. అయితే ఆర్బీఐ జనవరి 1, 2023 నుంచి బ్యాంకు లాకర్ల నియమాలను సవరించింది.

విలువైన వస్తువులు, ఆస్తి పేపర్లు వంటివి భద్రంగా ఉంచుకోవడానికి ప్రజలు బ్యాంకు లాకర్లను వాడతారు. కస్టమర్లను ఆకట్టుకోడానికి బ్యాంకులు లాకర్ల సదుపాయంపై వివిధ ఆఫర్లను ఇస్తుంటుంది. అలాగే ప్రజలకు కూడా భద్రతపై నమ్మకంతో లాకర్లను ఆశ్రయిస్తుంటారు. లాకర్ల ఫీజు అనేది బ్యాంకు అందించే సదుపాయాలు అలాగే బ్యాంకుల ఉన్న బట్టి మారుతుంటాయి. అయితే ఆర్బీఐ జనవరి 1, 2023 నుంచి బ్యాంకు లాకర్ల నియమాలను సవరించింది.
ఆర్బీఐ సవరించిన నియమాలు
లాకర్ల అధిక అద్దె
సాధారణంగా బ్యాంకులు ఉన్న ప్రాంతాన్ని బట్టి లాకర్ల అద్దెను వసూలు చేస్తుంటాయి. అలాగే మనం సంవత్సరంలో ఎన్నిసార్లు లాకర్ ఓపెన్ చేశామో? అనే అంశంపై కూడా చార్జీలను వసూలు చేస్తుంటాయి. వీటి నుంచి రక్షణకు ఆర్బీఐ లాకర్ నియంత్రణ నియమాలను సవరించింది. ఈ మేరకు లాకర్ సైజును బట్టి అద్దె ఉంటుందని తెలుస్తోంది.
అగ్రిమెంట్
లాకర్లను పొందాలనుకునే కస్టమర్లు, లేదా లాకర్ సదుపాయాలను అనుభవిస్తున్న వినియోగదారులు కచ్చితంగా 2023, జనవరి 1 నుంచి స్టాంప్ పేపర్లపై అగ్రిమెంట్ ను పొందుపరిచి బ్యాంకుకు అందించాల్సి ఉంటుంది. బ్యాంకులు కూడా తమ నిబంధనలన్నీ అగ్రిమెంట్ సమయంలోనే కస్టమర్లకు తెలియజేయాల్సి ఉంటుంది. ఈ మేరకు అన్ని బ్యాంకులు తమ లాకర్ వినియోగదారులకు ఇప్పటికే ఎస్ఎంఎస్ లు పంపాయి. కొన్ని బ్యాంకులు 15 రోజుల ముందుగానే కస్టమర్లకు సమాచారం ఇవ్వగా, మరికొన్ని బ్యాంకులు లేట్ గా డిసెంబర్ 30న ఇచ్చాయి. దీంతో వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.




నష్ట పరిహారం విషయంలో మార్పులు
బ్యాంకులు ఖాతాదారులకు అందించే నష్ట పరిహారం విషయంలో ఆర్బీఐ రూల్స్ ను మార్చింది. ఆర్భీఐ నోట్ ప్రకారం భద్రతా నిల్వలు ఉన్న ప్రాంగణం యొక్క భద్రత బ్యాంకులు బాధ్యత. అగ్ని ప్రమాదం, దొంగతనం, దోపిడీ వంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత బ్యాంకుదే. ఏదైనా ప్రమాదం జరిగి లేదా బ్యాంకు ఉద్యోగులు మోసం చేసి లాకర్ లోని వస్తువులను వినియోగదారులు కోల్పోతే, వారికి కచ్చితంగా బ్యాంకులే నష్ట పరిహారం చెల్లించాలని స్ఫష్టం చేసింది. ప్రమాదాలు జరిగితే తమకు సంబంధం లేదని బ్యాంకులు ఇకపై క్లెయిమ్ చేసుకోలేవు. అయితే బ్యాంకులు అందించే నష్ట పరిహారం వార్షిక లాకర్ చార్జ్ కు 100 రెట్లు ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి