AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: అన్నం పెట్టిన బ్యాంకుకే కన్నం పెట్టాడు.. రూ.కోట్లు కొట్టేందుకు పక్కా స్కెచ్ వేశాడు.. కట్ చేస్తే..

సోమవారం (జూలై 18న) ముగ్గురు నిందితులను ముంబ్రా-థానే పబ్లిక్ రోడ్డు సమీపంలోని మిట్టల్ గ్రౌండ్‌లో నిందితులను అదుపులోకి తీసుకుని.. రూ. 5.80 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఇంకా పరారీలోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Viral News: అన్నం పెట్టిన బ్యాంకుకే కన్నం పెట్టాడు.. రూ.కోట్లు కొట్టేందుకు పక్కా స్కెచ్ వేశాడు.. కట్ చేస్తే..
Money
Shaik Madar Saheb
|

Updated on: Jul 20, 2022 | 9:43 PM

Share

Manpada ICICI Bank Theft: దేశంలో దొంగతనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సరికొత్త పంథాలో అడుగులు వేస్తూ దొంగలు రెచ్చిపోతున్నారు. తాజాగా.. ఓ భారీ బ్యాంకు దోపిడిని మహారాష్ట్ర పోలీసులు చేధించారు. ఈ ఘటన థానే డోంబివాలిలోని మాన్‌పాడలో చోటుచేసుకుంది. మాన్‌పాడలోని ఐసీఐసీఐ బ్యాంక్ వాల్ట్‌లో సుమారు రూ.12.20 కోట్ల చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితులను తొమ్మిది రోజుల తర్వాత.. థానే పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం (జూలై 18న) ముగ్గురు నిందితులను ముంబ్రా-థానే పబ్లిక్ రోడ్డు సమీపంలోని మిట్టల్ గ్రౌండ్‌లో నిందితులను అదుపులోకి తీసుకుని.. రూ. 5.80 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఇంకా పరారీలోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. థానే ప్రాపర్టీ సెల్‌ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. డోంబివాలిలోని మాన్‌పాడలో ఉన్న ఐసిఐసిఐ బ్యాంక్ వాల్ట్‌లో రూ.12.80 కోట్లు మాయమయ్యాయి. అయితే.. ఈ దొంగతనం ప్రధాన సూత్రధారి ఆ బ్యాంకులో పనిచేస్తున్న ముంబ్రా నివాసి అల్తాఫ్ షేక్ (33) గా గుర్తించారు. అల్తాఫ్ కొన్నేళ్లుగా కస్టోడియన్‌గా పనిచేస్తున్నాడు. అతని వద్దే బ్యాంక్ లాకర్స్ కీ ఉండేది. ఈ క్రమంలో జూలై 9న బ్యాంకు నుంచి సుమారు రూ. 32 కోట్లను దొంగిలించాలని ప్లాన్ చేశాడు. దీనిలో భాగంగా కొన్ని గంటల ముందు బ్యాంకులోని అలారం, సిసిటివి కెమెరాను డియాక్టివేట్ చేశాడు. శనివారం రాత్రి ఎయిర్ కండిషన్ ఏర్పాటు చేసిన చిన్న రంధ్రం ద్వారా బ్యాంకు లోపలికి ప్రవేశించాడు. బ్యాంకు మూసిఉండగానే.. లాకర్ తాళం తెరిచి రూ.32 కోట్లు తీసేసాడు. అనంతరం టెంపో డ్రైవర్‌కు ఫోన్ చేసి రూ. 5 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చాడు.

మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో టెంపో బ్యాంకు వెలుపలకు రాగానే రెండు బ్యాగుల్లో ప్యాక్ చేసిన రూ.12.20 కోట్లు టెంపోలో ఉంచాడు. అనంతరం టెంపో డ్రైవర్ పరారయ్యాడు. అయితే.. సీసీటీవీ కెమెరా, అలారం మోగకపోయినా లోపల నుంచి శబ్దం రావడంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. అతను బ్యాంక్‌లోకి ప్రవేశించినప్పుడు అతనికి హార్డ్-డిస్క్ కనిపించలేదు. దీంతోపాటు లాకర్ తెరిచి ఉంది. దీంతో సెక్యూరిటీ గార్డు బ్యాంక్ మేనేజర్‌కు ఫిర్యాదు చేశాడు. బ్యాంకులో జరిగిన రూ.12.20 కోట్ల దొంగతనంపై బ్యాంక్ మేనేజర్‌, సిబ్బంది జూలై 11న సమావేశమయ్యారు. మీటింగ్‌ ప్రారంభం కాగానే ప్రధాన నిందితుడైన కస్టోడియన్‌ తనకు తల నొప్పిగా ఉందని.. ట్యాబ్లెట్ వేసుకుంటానని అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిపై బ్యాంక్‌ మేనేజర్‌, జూలై 14న గురువారం కస్టోడియన్‌పై మాన్‌పాడ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల బృందం బ్యాంకుకు వెళ్లి బ్యాంకుకు వెళ్లి పరిశీలించగా.. ఏయిర్ కండిషనర్ రంధ్రం దగ్గర రూ.20 కోట్లు లభ్యమయ్యాయి.

Crime News

Crime News

అనంతరం అప్రమత్తమైన థానేలోని ప్రాపర్టీ సెల్ క్రైమ్ యూనిట్.. మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో టెంపో డ్రైవర్ ఇస్రార్ ఖురేషీకి సమాచారం తెలుసుకొని.. మిట్టల్ మైదానంలోకి రాగానే అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అతని నుంచి రూ. 5.80 కోట్లు, రూ.10 లక్షలకుపైగా ఇతర వస్తువులను రికవరీ చేశారు. అరెస్టయిన నిందితులను ఇస్రార్ ఖురేషీ (33), సంషాద్ ఖాన్ (33), అనుజ్ ప్రేమ్ గిరి (30)గా గుర్తించారు. అయితే.. ప్రధాన నిందితుడు అల్తాఫ్ షేక్ ఇంకా పరారీలో ఉన్నాడని… అతని కోసం గాలిస్తున్నామని థానే పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి
Crime

Crime

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం.