Viral: మార్కెట్లో అనుమానాస్పదంగా తిరుగుతోన్న నలుగురు మహిళలు.. విషయం ఆరా తీయగా స్థానికులకు షాక్.. చివరకు!

ఆ మహిళలు ఏదో తప్పు చేస్తున్నట్లు వారు గ్రహించి అసలు విషయం తెల్చాలని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో దిమ్మతిరిగే విషయం వెలుగులోకి వచ్చించి.

Viral: మార్కెట్లో అనుమానాస్పదంగా తిరుగుతోన్న నలుగురు మహిళలు.. విషయం ఆరా తీయగా స్థానికులకు షాక్.. చివరకు!
Woman Reprajentative Image
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 20, 2022 | 6:19 PM

Viral News: నలుగురు మహిళలు అనుమానాస్పద రీతిలో ఓ చోట కనిపించారు. మొదట వారిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అక్కడే వారు పదే పదే కనిపించడంతో వారిపై స్థానికులకు అనుమానం కలిగింది. ఆ మహిళలు ఏదో తప్పు చేస్తున్నట్లు వారు గ్రహించి అసలు విషయం తెల్చాలని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో దిమ్మతిరిగే విషయం వెలుగులోకి వచ్చించి. రంగంలోకి దిగిన పోలీసులకు.. ఆ మహిళల అసలు బండారం బయటపడింది. వారు డ్రగ్స్‌ను విక్రయించే కిలాడీ లేడి ముఠాగా తేలడంతో పోలీసులు విస్తుపోయారు. ఈ షాకింగ్ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ద్వారకా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని నజాఫ్‌గఢ్‌లోని ఇందిరా మార్కెట్‌ ప్రాంతంలో నలుగురు మహిళల తీరుపై అనుమానం వ్యక్తం చేస్తూ స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీంతో రంగలోకి దిగిన పోలీసులు ఆ ప్రాంతంలో రోజూ అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురు మహిళలపై డేగకన్ను పెట్టారు. ఆ మహిళలు అక్రమంగా డ్రగ్స్, గంజాయిని విక్రయిస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి దగ్గరున్న 6.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోన్నారు. నలుగురు మహిళలను అరెస్టు చేసి అక్రమ మాదక ద్రవ్య నిరోధక చట్టంలోని సెక్షన్ 8, 20 కింద కేసు నమోదు చేశారు. వీరి వెనుక ఉన్న మరో ప్రధాన సూత్రధారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకే ఆ ప్రధాన సూత్రధారి డ్రగ్స్ వ్యాపారానికి ఆ మహిళలను పావులుగా వాడుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ మహిళలు ఢిల్లీ యూనివర్సిటీ ప్రాంతంలోని యువకులకు డ్రగ్స్, గంజాయి విక్రేయించే వారని పోలీసుల దర్యాప్తులో తేలింది. పట్టుబడిన గంజాయి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.కోటికి పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం.

దిల్‌ రాజు మనవడు, మనవరాలిని చూశారా? ఇషిక శారీ ఫంక్షన్ ఫొటోస్
దిల్‌ రాజు మనవడు, మనవరాలిని చూశారా? ఇషిక శారీ ఫంక్షన్ ఫొటోస్
రూ. 18 కోట్లకు అర్షదీప్‌ను దక్కించుకున్న పంజాబ్..
రూ. 18 కోట్లకు అర్షదీప్‌ను దక్కించుకున్న పంజాబ్..
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఆధార్‌తో యాక్టివేట్ చేయాలని తెలుసా?
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఆధార్‌తో యాక్టివేట్ చేయాలని తెలుసా?
ఏపీ విద్యుత్తు శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. నో ఎగ్జాం
ఏపీ విద్యుత్తు శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. నో ఎగ్జాం
ఏ సమయంలో ఎండలో నిలబడితే విటమిన్‌ D అధికంగా వస్తుందో తెలుసా?
ఏ సమయంలో ఎండలో నిలబడితే విటమిన్‌ D అధికంగా వస్తుందో తెలుసా?
ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఎవరో తెలుసా?
ఐపీఎల్ హిస్టరీలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఎవరో తెలుసా?
టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 తుది ఫలితాల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 తుది ఫలితాల తేదీ వచ్చేసింది.. ఎప్పుడంటే?
పెర్త్ టెస్ట్ పై పట్టుబిగించిన టీమిండియా.. ఇక విజయం లాంఛనమే
పెర్త్ టెస్ట్ పై పట్టుబిగించిన టీమిండియా.. ఇక విజయం లాంఛనమే
కోహ్లీ @ 30.. డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్
కోహ్లీ @ 30.. డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్
ఆయుర్వేద దివ్యౌషధం.. ఈ ఒక్క టీ తో ఆ సమస్యలన్నీ పరార్..
ఆయుర్వేద దివ్యౌషధం.. ఈ ఒక్క టీ తో ఆ సమస్యలన్నీ పరార్..