Bank Lockers: మీ డాక్యుమెంట్లను బ్యాంక్ లాకర్‌లలో దాచుకోవాలనుకుంటున్నారా..? అయితే ఈ సమాచారం మీ కోసమే..

ప్రతి ఇంట్లోనూ విలువైన డాక్యుమెంట్లు, డబ్బు, బంగారు ఆభరణాలు ఉంటాయి కదా.. మరి మీరు మీకు సంబంధించిన వాటిని బ్యాంక్ లాకర్‌లో ఉంచి భద్రపరుచుకోవాలనుకుంటే.. మీరు బ్యాంక్‌లకు కొంత ఫీజు చెల్లించవలసి ఉంటుంది. మరి మీకు అలా చేయాలనుకుంటే

Bank Lockers: మీ డాక్యుమెంట్లను బ్యాంక్  లాకర్‌లలో దాచుకోవాలనుకుంటున్నారా..? అయితే ఈ సమాచారం మీ కోసమే..
Bank Lockers
Follow us

|

Updated on: Dec 01, 2022 | 8:25 AM

ప్రతి ఇంట్లోనూ విలువైన డాక్యుమెంట్లు, డబ్బు, బంగారు ఆభరణాలు ఉంటాయి కదా.. మరి మీరు మీకు సంబంధించిన వాటిని బ్యాంక్ లాకర్‌లో ఉంచి భద్రపరుచుకోవాలనుకుంటే.. మీరు బ్యాంక్‌లకు కొంత ఫీజు చెల్లించవలసి ఉంటుంది. మరి మీకు అలా చేయాలనుకుంటే మీరు తప్పక తెలుసుకోవలసిన సమాచారం ఇది. తాజాగా దేశంలోని ప్రముఖ, అత్యంత భద్రమైన  6 బ్యాంకులు బ్యాంక్ లాకర్ ఫీజులను పెంచాయి.ప్రస్తుతం పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రభావం బ్యాంకు లాకర్ల ఛార్జీలపై కూడా కనిపిస్తోంది. SBI, HDFC బ్యాంక్, PNB, ICICI బ్యాంక్‌లతో పాటు యాక్సిస్, కెనరా బ్యాంక్‌లు లాకర్ ఫీజును విడుదల చేశాయి. ఎక్స్‌ట్రా లార్జ్ సైజ్ లాకర్ల ఫీజును రూ.9,000 నుంచి రూ.12,000కు పెంచాలని ఎస్‌బీఐ ప్రతిపాదించింది. అలాగే ఇతర బ్యాంకులు కూడా తమ లాకర్ ఛార్జీలను పెంచాయి. దీని కారణంగా ఇప్పుడు ఖాతాదారులు బ్యాంక్ లాకర్‌ను ఉపయోగించడం కోసం మరింత ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

ఆస్తి పత్రాలు, ఆభరణాలు, రుణ పత్రాలు, పొదుపు బాండ్లు, బీమా పాలసీలు మరియు ఇతర రహస్య వస్తువులు వంటి విలువైన వస్తువులను సురక్షితంగా ఉంచడానికి బ్యాంక్ కస్టమర్లను అనుమతిస్తుంది. లాకర్ సదుపాయాన్ని అందించినందుకు ప్రతిఫలంగా, లాకర్ పరిమాణం మరియు బ్యాంక్ బ్రాంచ్ ఉన్న ప్రదేశం ఆధారంగా ఖాతాదారులకు వార్షిక అద్దెను బ్యాంక్ వసూలు చేస్తుంది. లాకర్‌ను అప్పగించే సమయంలో లాకర్‌ను వినియోగించే ఒప్పందం యొక్క కాపీని అద్దెదారుకు అందజేస్తారు. నిబంధనల ప్రకారం, ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే కస్టమర్ అద్దెను పూర్తిగా చెల్లించాలి.

ఎస్‌బీఐ లాకర్ ఛార్జీలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లోని ఆ బ్యాంక్ చేసిన ప్రకటన ప్రకారం.. ప్రాంతం, లాకర్ సైజు ఆధారంగా బ్యాంక్ లాకర్ ఫీజులను రూ.500 నుంచి రూ.3,000 వరకు ఉంటుంది. మెట్రో, మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో చిన్న, మధ్య, పెద్ద, అదనపు పెద్ద సైజు లాకర్లకు బ్యాంకు రూ.2,000, రూ.4,000, రూ.8,000, రూ.12,000 వసూలు చేస్తుంది. సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న, మధ్యస్థ, పెద్ద, అదనపు పెద్ద సైజు లాకర్ల  కోసం బ్యాంక్ రూ. 1,500, రూ. 3,000, రూ. 6,000, రూ. 9,000 ఫీజుల రూపంలో వసూల్ చేయనుంది.

ఇవి కూడా చదవండి

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లాకర్ ఛార్జీలు

HDFC బ్యాంక్ లాకర్ ఫీజులు లాకర్ పరిమాణం, లభ్యత, ఇంకా బ్యాంక్ ఉన్న ప్రాంతాన్ని బట్టి సంవత్సరానికి రూ. 3,000 నుంచి రూ. 20,000 వరకు ఉండవచ్చు. మెట్రో, పట్టణ ప్రాంతాల్లో చిన్న లాకర్లకు రూ. 3,000, మధ్య తరహా లాకర్లకు రూ. 5,000 ఇంకా పెద్ద లాకర్లకు రూ. 10,000 చొప్పున  ఫీజులను వసూలు చేయనున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది.

ఐసీఐసీఐ బ్యాంక్ లాకర్ ఫీజు

చిన్న సైజు లాకర్‌కు రూ. 1,200 నుంచి రూ. 5,000 వరకు, అదనపు పెద్ద లాకర్‌కు రూ. 10,000 నుంచి రూ. 22,000 వరకు వసూలు చేయనున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. అయితే వీటికి అదనంగా జీఎస్‌టీ చార్జీలు ఉంటాయని కూడా వెల్లడించింది.

పీఎన్‌బీ బ్యాంక్ లాకర్ ఛార్జ్

PNB బ్యాంకులో వార్షిక లాకర్ అద్దె గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాలలో మారుతూ ఉంటుంది. ఆయా ప్రాంతాలలో పీఎన్‌బీ  బ్యాంకు లాకర్ చార్జీల రూపంలో రూ.1250 నుంచి రూ.2000 వరకూ తీసుకుంటుంది.  అలాగే పట్టణ, మెట్రో ప్రాంతాలకు రూ.10,000 వరకు వసూలు చేస్తోంది.

యాక్సిస్, కెనరా బ్యాంక్ లాకర్ ఛార్జీలు

యాక్సిస్ బ్యాంక్‌లో లాకర్ రిజిస్ట్రేషన్ కోసం రుసుము రూ.1000 + GST. ఉచితంగా లాకర్ తీసుకునే అవకాశాలు ఒక కాలెండర్ ఇయర్‌లో మూడు మాత్రమే. కాగా, కెనరా బ్యాంక్ ఖాతాదారులకు, వన్-టైమ్ లాకర్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 400 ప్లస్ జీఎస్టీగా నిర్ణయించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి