దేశరాజధాని ఢిల్లీలో మరో దారుణం.. 21 ఏళ్ల యువతిని పదేపదే క‌త్తితో పొడిచిన యువకుడు.. వీడియో

ఈ కేసులో పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు. ఈ కేసు కారణంగా ఢిల్లీలో మహిళల భద్రత అంశం చర్చనీయాంశమైంది.

దేశరాజధాని ఢిల్లీలో మరో దారుణం.. 21 ఏళ్ల యువతిని పదేపదే క‌త్తితో పొడిచిన యువకుడు.. వీడియో
Delhi Man
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 04, 2023 | 1:02 PM

దేశరాజధాని ఢిల్లీ దారుణాలకు అడ్డగా మారుతోంది. ఇప్పటికే పలు హత్యా ఉదంతాలు యావత్‌ దేశాన్ని వణికిస్తున్నాయి. తాజాగా, ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ ప్రాంతంలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ నిరాకరించినందుకు గానూ 21 ఏళ్ల యువతిని అతి దారుణంగా,పట్టపగలే ఓ యువకుడు కత్తితో పొడిచాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యువతి తనను దూరం పెట్టిందనే కోపంలో ఉన్న ఆ వ్య‌క్తి ఆమెను క‌త్తితో పొడిచాడు. సుమారు అయిదారుసార్లు క‌త్తితో పొడిచిన‌ట్లు వీడియో ఆధారంగా తెలుస్తోంది. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు నిందితుడు సుఖ్వింద‌ర్‌ను అరెస్టు చేశారు. అత‌నిపై పలు సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. వారిద్దరికీ చాలా ఏళ్లుగా పరిచయం ఉంది. అయితే ఈ ఇద్దరి మధ్య హఠాత్తుగా విభేదాలు వచ్చాయి. ఈ అమ్మాయి సుఖ్‌విందర్ సింగ్‌తో మాట్లాడటం మానేసింది. ఈ విషయంపై కోపోద్రిక్తుడైన సుఖ్వీందర్ యువతిపై దాడికి ఒడిగట్టాడు. కత్తితో పదేపదే పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. సుఖ్వీందర్ అంబాలాకు పారిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ సమాచారం మేరకు పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

గాయపడిన యువతిని ఢిల్లీలోని జహంగీర్‌పురిలోని బాబు జగ్జీవన్‌రామ్ ఆసుపత్రిలో చేర్చారు. యువతి పరిస్థితి నిలకడగా ఉందని తెలిసింది. ఈ కేసులో పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు. ఈ కేసు కారణంగా ఢిల్లీలో మహిళల భద్రత అంశం చర్చనీయాంశమైంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. .

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?