AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Haldwani Protest: రైల్వే భూమిలో కట్టిన 4500 ఇళ్లను కూల్చేయాలని హైకోర్టు ఆదేశాలు.. హల్ద్వానీలో మొదలైన షాహిన్‌బాగ్‌ తరహా ఆందోళన..

హల్ద్వానీ రైల్వే ట్రాక్‌ పొడవున నిర్మించిన 4 వేలకు పైగా అక్రమ కాలనీల తొలగింపు వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరుకుంది.ఉత్తరాఖండ్‌ లోని హల్ద్వానీలో షాహిన్‌బాగ్‌ తరహా ఉద్యమం మొదలైంది. రైల్వే భూముల్లో కట్టిన 45వేల భూములను కూల్చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ..

Haldwani Protest: రైల్వే భూమిలో కట్టిన 4500 ఇళ్లను కూల్చేయాలని హైకోర్టు ఆదేశాలు.. హల్ద్వానీలో మొదలైన  షాహిన్‌బాగ్‌ తరహా ఆందోళన..
Railway Land In Haldwani
Sanjay Kasula
|

Updated on: Jan 04, 2023 | 1:38 PM

Share

ఉత్తరాఖండ్‌ లోని హల్ద్వానీలో రైల్వే భూమిలో కట్టుకున్న 4500 ఇళ్లను కూల్చివేయాలన్న నైనిటాల్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలయ్యింది. కూల్చివేతలను ఆపాలని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కూల్చివేతలను ఆపాలంటూ గత 10 రోజులుగా హల్ద్వానీలో స్థానికులు షహీన్‌బాగ్‌ తరహాలో ఉద్యమం చేస్తున్నారు. నడిరోడ్డు మీదే కూర్చొని మహిళలు నిరసన తెలుపుతున్నారు. హైకోర్టు తీర్పుపై దాఖలైన పిటిషన్లను గురువారం అత్యవసరంగా విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. వారం రోజుల్లో రైల్వే భూమిలో కట్టుకున్న ఇళ్ల నుంచి జనాన్ని ఖాళీ చేయంచాలని డిసెంబర్‌ 20వ తేదీన హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జనం ఇళ్ల నుంచి ఖాళీ చేయకపోతే పారామిలటరీ బలగాలను ప్రయోగించి ఖాళీ చేయించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ రైల్వేస్టేషన్ సమీపంలో నిర్మించిన అక్రమ కాలనీని తొలగించాలనే నిర్ణయానికి వ్యతిరేకత పెరుగుతోంది. నైనిటాల్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వు తర్వాత 2.2 కిలోమీటర్ల పొడవైన రైల్వే స్ట్రిప్‌పై( రైల్వే ట్రాక్ వెంట) నిర్మించిన అక్రమ కాలనీ అయిన బంబుల్‌పురాలోని 4 వేల 500కు పైగా ఇళ్లు కూల్చి వేసేందుకు సిద్దమయ్యారు అధికారులు. దీంతో స్థానికులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో ఈ విషయంలో పలు రాజకీయ పార్టీలు కూడా చేతులు కలిపాయి. దీనిపై ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్, ఏఐఎంఐఎం సహా పలు విపక్షాలు తమ వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. ఇంతకీ ఈ విషయంలో ఏం జరిగిందో తెలుసుకుందాం..

ఒక వర్గాన్నిటార్గెట్‌ చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇళ్లను కూల్చేస్తే 50 వేల మంది రోడ్డున పడతారని కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే కోర్టు ఆదేశాలను పాటిస్తామని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం చెబుతోంది.

70 ఏళ్ల నుంచి తమ కుటుంబాలు ఇక్కడే ఉంటున్నాయని , మూడు ప్రభుత్వ కాలేజ్‌లు కూడా ఇదే స్థలంలో ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ముస్లిం వర్గాన్ని టార్గెట్‌ చేయడానికే ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. అయితే నిరసనకారులు అదే ప్రాంతంలో తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

2026లో ధనవంతులు అవ్వాలంటే.. ఇలా చేయండి!
2026లో ధనవంతులు అవ్వాలంటే.. ఇలా చేయండి!
జాగ్రత్త గురూ.. తక్కువ తాగినా ముప్పుతప్పదట.. తాజా అధ్యయనంలో సంచలన
జాగ్రత్త గురూ.. తక్కువ తాగినా ముప్పుతప్పదట.. తాజా అధ్యయనంలో సంచలన
ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..
ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..
ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే
ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే
MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్