AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eating Tips: తెలివిగా తింటే ఆరోగ్యంతో పాటు ఆనందం.. ఈ ఫుడ్‌ విషయంలో మీరు ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా.?

మనం డైలీ తీసుకునే ఆహారంలో పోషకాహారం చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. కాబట్టి తినే ఆహారంలో పోషకాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి.

Eating Tips: తెలివిగా తింటే ఆరోగ్యంతో పాటు ఆనందం.. ఈ ఫుడ్‌ విషయంలో మీరు ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా.?
Protein Deficiency
TV9 Telugu Digital Desk
| Edited By: Anil kumar poka|

Updated on: Jan 10, 2023 | 6:37 PM

Share

తినడం అనేది మన జీవితంలో తప్పనిసరిగా చేయాల్సిన క్రియ. అయితే తినడం ఎంత ముఖ్యమో ఎలా తింటున్నాం? ఎంత మేర తింటున్నాం అనేది కూడా ఆలోచించాలి. మనం డైలీ తీసుకునే ఆహారంలో పోషకాహారం చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. కాబట్టి తినే ఆహారంలో పోషకాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. కానీ  డైలీ ఎలాంటి పోషకాహారాన్నితీసుకోవాలి? అనే దానిపై నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. వారు డైలీ ఆహారంలో సూచించే ఆరోగ్యకరమైన పోషకాల గురించి ఓ సారి తెలుసుకుందాం.

ఓమేగా-3 

ఓమెగా -3 పోషకాన్ని కచ్చితంగా మన ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఓమెగా-3 శరీరంలో ఉత్పత్తి అవ్వద్దు. కాబట్టి కచ్చితంగా ఆహారం ద్వారానే దాన్ని శరీరానికి అందించాలి. ఓమెగా-3 అనేది గుడ్ ఫ్యాట్. ఈ పోషకం మెండుగా ఉండే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని అనుభవించడానికి సాయం చేస్తుంది. మెదడు ఆరోగ్యాన్ని పెంచడానికి కూడా ఓమెగా -3 హెల్ప్ చేస్తుంది.  శరీరానికి ఓమెగా-3 అందించడం ఎంత ముఖ్యమో? అలాగే ఇతర పోషకాలు కూడా అదే రీతిలో అందించాలి. అప్పుడే పూర్తిస్థాయిలో శక్తి వస్తుంది. ఎక్కువగా ఓమెగా-3 చేపలు, ఆకు కూరల్లో లభిస్తుంది. ఓమెగా-3 కు అదనంగా గుడ్లు, చికెన్, పాల ఉత్పత్తులు, వాల్ నట్స్ ఆహారంలో చేర్చుకుంటే మంచి ప్రోటీన్లు శరీరానికి అందుతాయి. 

స్నాక్స్ విషయంలో జాగ్రత్తలు

శరీరానికి అనవసరమైన పదార్థాలు అన్నీ బయట స్నాక్స్ తింటేనే వస్తాయి. ముఖ్యంగా స్నాక్స్ తినే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొవ్వు అధికంగా ఉండే స్నాక్స్ ను నియంత్రించి, పండ్లు, కూరగాయలు, త్రుణ ధాన్యాలు వంటి పోషకాహారం ఉండే పదార్థాలు స్నాక్స్ కింద తినడం ఉత్తమం. అలాగే భోజనం తర్వాత చక్కెర తినాలి అనే కోరికను అదపులో ఉంచుకోవాలి. లేదంటే ఆ సమయంలో అనవసరమైన కొవ్వు పదార్థాలను శరీరానికి అందించాల్సి వస్తుంది. 

ఇవి కూడా చదవండి

ఎంత తింటున్నామో కూడా ముఖ్యమే

కేవలం ఆకలి వేసినప్పడు ఆహారంపై ధ్యాస పెట్టకుండా రోజు మొత్తంలో ఎంత ఆహారం తినాలో ముందే టైంటేబుల్ వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. చాలా అన్నం లేదా వంటకాలు వేస్ట్ అవుతాయని ఎక్కువ తినేస్తుంటారు. ఈ అలవాటు ప్రస్తుతానికి బాగానే ఉన్నా ధీర్ఘకాలంలో ఊబకాయం, మధుమేహం వంటి అనారోగ్యాలకు కారణం అవుతుంది. కాబట్టి ఆహారం తీసుకునే సమయంలో నియంత్రణ పాటించాలని చెబుతున్నారు. మన శరీరానికి ఎన్ని క్యాలరీల ఆహారాన్ని అందిస్తున్నామో? కూడా తరచూ తనిఖీ చేసుకోవాలి. ఆహారం తినే సమయంలో ప్రోటీన్ల ప్రకారం ఆహారాన్ని కొలిచి తీసుకోవడం ఉత్తమం. అలాగే బయట ఆహారాన్ని తినాల్సి వచ్చినప్పుడు ఆ ప్యాకెట్లపై ప్రచురించిన పోషకాల విలువను ఆధారంగా చేసుకుని వాటిని తినే విషయంలో నియంత్రణ పాటించాలి .

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..