AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Antony: యాక్సిడెంట్ తర్వాత ఫస్ట్‌ ట్వీట్‌ చేసిన బిచ్చగాడు హీరో.. హెల్త్‌ కండీషన్‌పై కీలక అప్డేట్‌

తన ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న అనుమానాలు, రూమర్లకు తెరదించాడు బిచ్చగాడు హీరో విజయ్‌ ఆంటోని. యాక్సిడెంట్ తర్వాత మొదటిసారిగా ట్వీట్‌ చేశారాయన. అందులో తన హెల్త్‌ కండీషన్‌పై కీలక అప్డేట్‌ ఇచ్చారు.

Vijay Antony: యాక్సిడెంట్ తర్వాత ఫస్ట్‌ ట్వీట్‌ చేసిన బిచ్చగాడు హీరో.. హెల్త్‌ కండీషన్‌పై కీలక అప్డేట్‌
Hero Vijay Antony
Basha Shek
|

Updated on: Jan 25, 2023 | 9:43 AM

Share

తన ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న అనుమానాలు, రూమర్లకు తెరదించాడు బిచ్చగాడు హీరో విజయ్‌ ఆంటోని. యాక్సిడెంట్ తర్వాత మొదటిసారిగా ట్వీట్‌ చేశారాయన. అందులో తన హెల్త్‌ కండీషన్‌పై కీలక అప్డేట్‌ ఇచ్చారు. ‘డియర్ ఫ్రెండ్స్ మలేషియాలో ‘పిచ్చైకారన్ 2’ (బిచ్చగాడు 2) షూటింగ్‌ చేస్తున్న సమయంలో నేను ప్రమాదానికి గురయ్యాను. ఈ సంఘటనలో నా దవడ, ముక్కుకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. వాటి నుంచి సురక్షితంగా కోలుకున్నాను. ఇప్పుడే మేజర్ సర్జరీ పూర్తి అయ్యింది. వీలైనంత తొందరలో మీ అందరితో మాట్లాడతాను. కఠిన సమయాల్లో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ థాంక్స్’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు విజయ్‌. ఈ సందర్భంగా థంబ్స్ అప్ సింబల్ చూపిస్తూ తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ చెప్పుకొచ్చారాయన. సర్జరీ జరిగిన తర్వాత హాస్పిటల్ బెడ్ మీద నుంచి ఈ ఫొటో తీసినట్లు ఉంది. ప్రస్తుతం ఇది వైరలవుతోంది. విజయ్‌ కోలుకుంటున్నాడని తెలిసి అతని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఆయనను తెర మీద చూడాలనుకుంటున్నామంటూ కామెంట్లు పెడుతున్నారు.

కాగా బిచ్చగాడు హీరోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్‌ ఆంటోని. అంతకుముందు శ్రీకాంత్ మహాత్మ, రవితేజ దరువు చిత్రాలకు స్వరాలు సమకూర్చిన ఆయన నకిలీ, సలీమ్ లాంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను పలకరించాడు. ఆతర్వాత అమ్మ సెంటిమెంట్‌తో వచ్చిన బిచ్చగాడు సూపర్‌హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌ బిచ్చగాడు 2ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరోగా నటిస్తూనే దర్శకత్వం, సంగీతం, ప్రొడక్షన్ బాధ్యతల్ని కూడా చూసుకుంటున్నారు విజయ్ ఆంటోని. ఈక్రమంలో మలేషియాలో యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరిస్తుండగానే ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడీ హీరో.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!