Minister Roja: జబర్తస్త్ ప్రేమ పక్షులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన రోజా.. కాబోయే పెళ్లి కూతురుకు పట్టు చీరతో..

తమ ఎంగేజ్‌మెంట్‌కు బంధుమిత్రులు, స్నేహితులు, సన్నిహితులను ఆహ్వానించేందుకు రెడీ అయ్యారు రాకేశ్‌, సుజాత. ఇందులో భాగంగా మొదట ప్రముఖ నటి, మంత్రి రోజా ఇంటికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా కాబోయే దంపతులకు సర్‌ప్రైజ్‌ నిచ్చారు రోజా, సెల్వమణి దంపతులు.

Minister Roja: జబర్తస్త్ ప్రేమ పక్షులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన రోజా.. కాబోయే పెళ్లి కూతురుకు పట్టు చీరతో..
Roja , Racking Rakesh And Sujatha
Follow us
Basha Shek

|

Updated on: Jan 25, 2023 | 2:29 PM

జబర్దస్త్‌ ప్రేమ పక్షులు రాకింగ్ రాకేశ్‌- జోర్దార్‌ సుజాతల పెళ్లిపీటలెక్కేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. గత కొద్దికాలంగా ప్రేమలో మునిగితేలుతున్న వీరిద్దరు ఈ నెల చివర్లో నిశ్చితార్థం చేసుకోనున్నారు. ఈ విషయాన్ని జోర్దార్‌ సుజాతనే తన యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా వెల్లడించింది. ఇక తమ నిశ్చితార్థానికి సంబంధించి షాపింగ్‌ కూడా చేశారీ లవ్‌ బర్డ్స్‌.ఆ వీడియోను కూడా తన యూట్యూబ్‌ ఛానల్‌లో రిలీజ్‌ చేసింది సుజాత. తాజాగా తమ ఎంగేజ్‌మెంట్‌కు బంధుమిత్రులు, స్నేహితులు, సన్నిహితులను ఆహ్వానించేందుకు రెడీ అయ్యారు రాకేశ్‌, సుజాత. ఇందులో భాగంగా మొదట ప్రముఖ నటి, మంత్రి రోజా ఇంటికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా కాబోయే దంపతులకు సర్‌ప్రైజ్‌ నిచ్చారు రోజా, సెల్వమణి దంపతులు. సుజాతకు పట్టుచీర పెట్టి దీవెనలు అందించారు. అలాగే రాకింగ్‌ రాకేశ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కాబోయే దంపతులను స్వయంగా తన కారులో తిరుపతి కొండకు తీసుకెళ్లారు. అక్కడ వెంకటేశ్వర స్వామి దీవెనలు పొందారు. ‘మేడమ్‌ మమ్మల్ని వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం ప్రోటోకాల్‌ కారులో దగ్గరుండి తిరుపతి కొండకు తీసుకెళ్లడం ఎన్నో జన్మల అదృష్టం’ అంటూ మురిసిపోయాడు రాకేశ్‌. కాగా ఈ తతంగానికి ముందు రోజా ఇంట్లో ఒక సరదా సన్నివేశం చోటుచేసుకుంది. అదేంటంటే.. తమ పెళ్లి వార్త చెబుదామని మంత్రి గారి ఇంటికెళ్లాడు రాకేశ్- సుజాత. అయితే ఆ సమయంలో రోజా ఏదో మీటింగ్‌లో ఉండటంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వంటిట్లో దూరాడు.

తనే స్వయంగా ఆలూ ఫ్రై, మునగాకు కర్రీ తదితర వంటకాలను రెడీ చేశాడు. ఇక రోజా ఇంటికి రాగానే ఆమెకు స్వయంగా వడ్డించాడు. కాగా టీవీ యాంకర్‌గా పరిచయమైన సుజాత బిగ్‌బాస్‌ షోతో మరింత క్రేజ్‌ తెచ్చుకుంది. ప్రస్తుతం జబర్దస్త్‌ షోలో సందడి చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రముఖ కమెడియన్‌ రాకింగ్‌ రాకేష్‌ టీంతో కలిసి బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. ఈక్రమంలోనే రాకేష్‌తో ప్రేమలో పడిపోయింది. త్వరలోనే తమ ప్రేమ బంధాన్ని మూడుముళ్ల బంధంగా మార్చుకునేందుకు సిద్ధమయ్యారీ లవ్‌ బర్డ్స్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే