AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venkatesh: వెంకీమామ 75 మూవీ ఫస్ట్ గ్లింప్స్ అదిరిపోయింది.. టైటిల్ ఏంటంటే..

వెంకీమామా.. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ప్రముఖ నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పై వెంకట్ బోయనపల్లి నిర్మించనున్న హై-బడ్జెట్ చిత్రం ఇది. ‘HIT’ ఫ్రాంచైజ్ తో వరుస విజయాల్ని అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ శైలేశ్ కొల‌ను దర్శకత్వం వహించనున్నారు.

Venkatesh: వెంకీమామ 75 మూవీ ఫస్ట్ గ్లింప్స్ అదిరిపోయింది.. టైటిల్ ఏంటంటే..
Venky75
Rajitha Chanti
|

Updated on: Jan 25, 2023 | 2:51 PM

Share

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్3 సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయం అందుకున్నారు విక్టరీ వెంకటేష్. ప్రస్తుతం రానానాయుడు వెబ్ సిరీస్ చేస్తోన్న వెంకీమామా.. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ప్రముఖ నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పై వెంకట్ బోయనపల్లి నిర్మించనున్న హై-బడ్జెట్ చిత్రం ఇది. ‘HIT’ ఫ్రాంచైజ్ తో వరుస విజయాల్ని అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ శైలేశ్ కొల‌ను దర్శకత్వం వహించనున్నారు. వెంకటేష్ ల్యాండ్‌మార్క్ 75వ చిత్రం #వెంకీ75, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి ప్రొడక్షన్ నెం 2 గా రాబోతుంది. వెంకటేష్‌కి ఇది అత్యంత భారీ బడ్జెట్ సినిమా కానుంది.

సక్సెస్ ఫుల్ పీపుల్ నుంచి వస్తున్న ఈ సినిమాపై సహజంగానే భారీ అంచనాలు వున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్‌లో వెంకటేష్ చేతిలో ఏదో పట్టుకున్న సిల్హౌట్ ఇమేజ్ కనిపించింది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియో మరో లెవల్లో ఉందనే చెప్పుకోవాలి. కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా ఓ రేంజ్ కంబ్యాక్ గా అనిపించిందో అదే తరహాలో ఓ సాలిడ్ యాక్షన్ చిత్రంలా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో కనిపించిన విజువల్స్.. ఎలివేషన్స్ సాలిడ్ గా ఉన్నాయి. చాలా కాలం తర్వాత మరోసారి మాస్ యాక్షన్ లుక్ లో అలరించనున్నారు.

విన్నంగ్ స్క్రిప్ట్‌ను రాసిన శైలేశ్ కొల‌ను, వెంకటేష్ ను మునుపెన్నడూ చూడని సరికొత్త పాత్రలో ప్రజంట్ చేయనున్నారు. ఈ చిత్రానికి సైంధవ్ అని టైటిల్ ఫిక్స్ చేశారు. అంతేకాకుండా ఈ మూవీని పాన్ ఇండియా సినిమాగా అనౌన్స్ చేశారు. దీంతో వెంకీ కెరీర్ లో మొదటి పాన్ ఇండియా భారీ బడ్జెట్ చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోనున్నారు. ఈ సినిమా షూటింగ్ రేపటి నుంచి మరింత వేగంగా జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటీనటులు నటించనున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో మేకర్స్ అనౌన్స్ చేస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
పచ్చి బొప్పాయి vs పండిన బొప్పాయి.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
పచ్చి బొప్పాయి vs పండిన బొప్పాయి.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
Video: వైడ్‌ ఇచ్చిన అంపైర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన చైనామన్..!
Video: వైడ్‌ ఇచ్చిన అంపైర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన చైనామన్..!
డీజేలో మోత మోగిపోతున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..
డీజేలో మోత మోగిపోతున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..
ఆన్‌లైన్‌ టికెట్ బుకింగ్‌లో లోయర్ బెర్త్ రాలేదా..? ఇలా చేస్తే..
ఆన్‌లైన్‌ టికెట్ బుకింగ్‌లో లోయర్ బెర్త్ రాలేదా..? ఇలా చేస్తే..
పుష్ప లాంటి సినిమా.. మరో ఓటీటీలోకి వచ్చిన సునీల్ సూపర్ హిట్ మూవీ
పుష్ప లాంటి సినిమా.. మరో ఓటీటీలోకి వచ్చిన సునీల్ సూపర్ హిట్ మూవీ
చేతులెత్తేసిన గిల్ సేన.. 24 ఏళ్ల చెత్త రికార్డులో మనోళ్లు
చేతులెత్తేసిన గిల్ సేన.. 24 ఏళ్ల చెత్త రికార్డులో మనోళ్లు
ఆపదలో ఉన్న అన్నదాతకు అనంత్ అంబానీ భరోసా.. రైతు ఆనందం వీడియోలో..
ఆపదలో ఉన్న అన్నదాతకు అనంత్ అంబానీ భరోసా.. రైతు ఆనందం వీడియోలో..
NEET UG కౌన్సెలింగ్‌లో ఆ 37 మంది MBBS, BDS సీట్లు రద్దు!
NEET UG కౌన్సెలింగ్‌లో ఆ 37 మంది MBBS, BDS సీట్లు రద్దు!
23.20 సెకన్లలో ఫినిష్.. 200 మీటర్ల పరుగులో భారత్‌కు కాంస్యం..!
23.20 సెకన్లలో ఫినిష్.. 200 మీటర్ల పరుగులో భారత్‌కు కాంస్యం..!