Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garlic Pickle: ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి వెల్లుల్లి ఊరగాయ.. కేవలం 10 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి..

ఊరగాయను సైడ్ డిష్ లేదా రుచిని పెంచడానికి అన్నంలో కలుపుకుని తింటారు. తినే ఆహారపుఁ పదార్ధాల  రుచిని రెట్టింపు చేస్తుంది. ఎన్నో రకాల పచ్చళ్లున్నాయి. వీటితో ఒకటి వెల్లుల్లి ఊరగాయ. రుచికరమైన వెల్లుల్లి ఊరగాయను తయారు చేయగల ఒక సాధారణ వంటకం.

Garlic Pickle: ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి వెల్లుల్లి ఊరగాయ.. కేవలం 10 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి..
Garlic Pickle
Follow us
Surya Kala

|

Updated on: Jan 24, 2023 | 12:55 PM

సాంప్రదాయ భారతీయ భోజనంలో ఊరగాయ ఒక ముఖ్యమైన భాగం. పూర్వకాలం నుంచి ఊరగాయ ఒక రుచికరమైన ఆహారపదార్ధం. ఒకప్పుడు దక్షిణభారతంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో కనిపించే ఈ ఊరగాయ ఇప్పుడు దేశ వ్యాప్తంగా తన స్థానాన్ని పదిలం చేసుకుంది.  ఊరగాయను సైడ్ డిష్ లేదా రుచిని పెంచడానికి అన్నంలో కలుపుకుని తింటారు. తినే ఆహారపుఁ పదార్ధాల  రుచిని రెట్టింపు చేస్తుంది. ఎన్నో రకాల పచ్చళ్లున్నాయి. వీటితో ఒకటి వెల్లుల్లి ఊరగాయ. రుచికరమైన వెల్లుల్లి ఊరగాయను తయారు చేయగల ఒక సాధారణ వంటకం. ఈ రోజు వెల్లుల్లి ఆవకాయ రెసిపీ గురించి తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు: 

పచ్చి వెల్లుల్లి పాయలు -1 కిలోల

ఇవి కూడా చదవండి

నీరు-, 2-3 కప్పులు

పసుపు పొడి- , 4 టీ స్పూన్లు

కారం –  8 టేబుల్ స్పూన్లు

వేయించిన మెంతి పొడి-  1/2 టీస్పూన్

ఉప్పు రుచికి సరిపడా

నిమ్మకాయలు- 3

నూనె -ఊరగాయకు సరిపడా

పోపు కోసం: 

ఆవాలు

వెల్లుల్లి

ఎండు మిర్చి ముక్కలు

తయారీ విధానం: వెల్లుల్లి ఊరగాయను సిద్ధం చేయడానికి.. ముందుగా వెల్లుల్లిని ఒలిచి వెల్లుల్లి రెబ్బలను శుభ్రం చేయాలి. అనంతరం వాటిని ఆవిరితో ఉడికించాలి. ఉడికిన వెల్లుల్లిని ఒక పెద్ద గిన్నెలోకి మార్చుకోండి. ఇప్పుడు కారం, పసుపు, మెంతిపొడి, కొంచెం ఉప్పు వేసి కలపాలి. అందులో నిమ్మవేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి బాణలి పెట్టి.. దానిలో వేరుశనగ నూనె వేసి వేడి చేయాలి. తగినంత వేడి అయ్యాక రెండు స్పూన్ల ఆవాలు, కొని వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి ముక్కలు వేసి ..చిటపటలాడనివ్వండి. అనంతరం ఈ నూనెను మ్యారినేట్ చేసిన వెల్లుల్లి రెబ్బలపై పోయాలి. బాగా కలపండి. అంతే రుచికరమైన వెల్లుల్లి ఊరగాయ రెడీ. దీనిని గాలి చొరబడని గాజు సీసాలో వేసుకుని రిఫ్రిజిరేటర్‌లో పెట్టుకోవాలి. ఇది మూడు నెలల వరకూ నిల్వ ఉంటుంది.

వాస్తవానికి  వెల్లుల్లి వందల సంవత్సరాలుగా భారతీయ వంటకాల్లో ఉపయోగిస్తున్నారు. వెల్లుల్లిలో అద్భుతమైన ఔషధ విలువలు ఉన్నాయి. వెల్లుల్లి తినడం వలన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వెల్లుల్లి ఊరగాయ యాంట్-బ్యాక్టీరియల్‌తో నిండి ఉంటుంది.  యాంటీబయాటిక్ , యాంటీ వైరల్ లక్షణాలు, ప్రాణాంతక వ్యాధులను నిరోధించడంలో సహాయపడుతుంది. అందుకనే ప్రస్తుతం ఊరగాయ వెల్లుల్లి చాలా ప్రజాదరణ పొందుతోంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..