Norovirus: కేరళలో కోరలు చాస్తోన్న మరో వైరస్.. 19 మంది విద్యార్థులకు పాజిటివ్.. లక్షణాలు ఎలా ఉంటాయంటే..

కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పడుతున్న తరుణంలో నోరోవైరస్ కేసులు కలకలం రేపుతున్నాయి. కేరళలో 19 నోరోవైరస్ కేసులు నిర్ధారణ కావడం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.

Norovirus: కేరళలో కోరలు చాస్తోన్న మరో వైరస్.. 19 మంది విద్యార్థులకు పాజిటివ్.. లక్షణాలు ఎలా ఉంటాయంటే..
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 24, 2023 | 12:42 PM

కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పడుతున్న తరుణంలో నోరోవైరస్ కేసులు కలకలం రేపుతున్నాయి. కేరళలో 19 నోరోవైరస్ కేసులు నిర్ధారణ కావడం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. దక్షిణాది రాష్ట్రంలో ఈ వైరస్‌ని గుర్తించడం ఇదే మొదటిసారి కానప్పటికీ, ఇప్పటివరకు నమోదైన కేసులన్నీ చిన్నారులే కావడం ఆందోళన కలిగిస్తోంది. చిన్నారుల్లో అధిక స్థాయిలో ఇన్ఫెక్షన్ గుర్తించడంతో ప్రభత్వం అప్రమత్తమైంది. ఈ వైరస్ అతిసారం, వాంతులతో సంబంధం కలిగి ఉంటుంది. చికిత్స సులభమే అయినప్పటికీ ఒక్కోసారి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఎర్నాకుళంలోని ఒక పాఠశాలలో కనీసం 19 మంది విద్యార్థులు నోరోవైరస్ పాజిటివ్ గా పరీక్షించడంతో.. 50 పాఠశాలలను ముందస్తుగా మూసివేశారు. చాలా మంది విద్యార్థులలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తుండటంతో అధికారులు అప్రమత్తమై చర్యలు తీసుకుంటున్నారు.

గతేడాది జూన్‌లో దక్షిణాది రాష్ట్రంలో ఈ వైరస్ కేసులు నమోదయ్యాయి. నోరోవైరస్ మొదటి వ్యాప్తి జూన్ 2021 లో అలప్పుజా సమీపంలో గుర్తించారు. 950 తీవ్రమైన అతిసార వ్యాధుల కేసులు వైరస్‌తో ముడిపడి ఉన్నాయని తెలిపారు. అప్పట్లో ఈ వైరస్ రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించింది. మంచి పరిశుభ్రతతో దీనిని నివారించవచ్చని అధికారులు వెల్లడించారు.

నోరోవైరస్ అనేది అతిసారం.. వాంతులతో సంబంధం కలిగిఉంటుంది. ఇటీవలి సంవత్సరాలలో మానవాళిని కలవరపెడుతున్న అన్ని వైరస్‌ల మాదిరిగానే నోరోవైరస్ కూడా అంటువ్యాధి. వైరస్‌లు కలుషితమైన ప్రదేశాలు లేదా కలుషితమైన ఆహారం ద్వారా సోకిన వ్యక్తుల నుంచి మరింత వ్యాప్తిచెందుతుంది. ఈ వైరస్‌ను వింటర్ వామిటింగ్ బగ్ అని కూడా అంటారు.

ఇవి కూడా చదవండి

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది నోరోవైరస్‌ని “స్టమ్ ఫ్లూ” అని పిలుస్తారు. అయినప్పటికీ నోరోవైరస్ సాధారణ ఫ్లూ (ఇన్ఫ్లుఎంజా)కి ఏ విధంగానూ సంబంధం లేదని వైద్యనిపుణులు వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 685 మిలియన్ల నోరోవైరస్ కేసులు నమోదవుతున్నాయి. ఈ 685 మిలియన్ కేసులలో దాదాపు 200 మిలియన్లు మంది 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలేనని పేర్కొంటున్నారు.

నోరోవైరస్ లక్షణాలు

సాధారణంగా నోరోవైరస్ యొక్క లక్షణాలు 1 రోజు నుంచి 72 గంటల మధ్య ఉంటాయి. దాని కంటే ఎక్కువ కాలం పాటు లక్షణాలుంటే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించారు.

  • నోరోవైరస్ ముఖ్య లక్షణాలలో ఒకటి మలంలో రక్తం.
  • వాంతులు – వికారం
  • వదులుగా విరేచనాలు
  • కడుపు నొప్పి – తిమ్మిరి
  • జ్వరం
  • కండరాల నొప్పి – తిమ్మిరి
  • నీరసం, తలనొప్పి

కాగా.. నోరో వైరస్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌ తెలిపారు. సరైన నివారణ, చికిత్సతో, వ్యాధి త్వరగా నయమవుతుందని ప్రజలకు సూచించారు. కడుపు, పేగుల్లో వాపు, కడుపు నొప్పి, తీవ్రమైన వాంతులు, అతిసారం, జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలుంటే జాగ్రత్తగా ఉండాలని.. ఎప్పటికప్పుడు పరిశుభ్రతను పాటించాలని సూచించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..