AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రుడిపై తొలిసారి కాలుపెట్టిన గగనాయని బుజ్‌ గుర్తున్నాడా..? 93 ఏళ్ల వయసులో 4వ పెళ్లితో..

బజ్ ఆల్డ్రిన్, ఫైటర్ పైలట్, చురుకైన శాస్త్రవేత్త, తన చిరకాల స్నేహితురాలు డాక్టర్ అంకా ఫౌరేతో తన ప్రేమను నిలబెట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ ట్వీట్‌లో ఆ వివరాలను వెల్లడించారు.

చంద్రుడిపై తొలిసారి కాలుపెట్టిన గగనాయని బుజ్‌ గుర్తున్నాడా..? 93 ఏళ్ల వయసులో 4వ పెళ్లితో..
Moonwalker Buzz Aldrin
Jyothi Gadda
|

Updated on: Jan 26, 2023 | 1:52 PM

Share

1969లో చంద్రుడిపై కాలు మోపి చారిత్రక మైలురాయిని నెలకొల్పిన ముగ్గురు అమెరికన్ వ్యోమగాముల్లో ఒకరైన నాసా మాజీ శాస్త్రవేత్త బజ్ఆల్డ్రిన్ 93 ఏళ్ల వయసులో 4వ పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ ట్వీట్‌లో ఆ వివరాలను వెల్లడించారు. బజ్ ఆల్డ్రిన్, ఫైటర్ పైలట్, చురుకైన శాస్త్రవేత్త, తన చిరకాల స్నేహితురాలు డాక్టర్ అంకా ఫౌరేతో తన ప్రేమను నిలబెట్టుకున్నారు. ఇటీవలే, బజ్ 64 ఏళ్ల అంకాను లాస్ ఏంజెల్స్‌లో తన స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. బజ్ ట్విట్టర్‌లో ఫోటోను షేర్‌ చేశారు. 93 సంవత్సరాల వయస్సులో, నేను చాలా ఇష్టపడే, గౌరవించే అంకాతో లాస్ ఏంజిల్స్‌లో వైవాహిక జీవితంలోకి ప్రవేశించాను. ఈ ఆలోచనను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ రోజు నా మనస్సు హాయిగా ఉందంటూ క్యాప్షన్‌లో రాసుకొచ్చారు వ్యోమగామి బజ్‌ ఆల్డ్రిన్‌.

ఇది బజ్ ఆల్డ్రిన్‌కు 4వ వివాహం. అతను మూడు సార్లు విడాకులు తీసుకున్నాడు. 1954లో జోవాన్‌ను, 1975లో బెవర్లీని, 1988లో లూయిస్ డ్రిగ్స్‌ను వివాహం చేసుకున్నారు. 93 ఏళ్ల వయసులో 4వ పెళ్లి చేసుకున్న బుజ్రా కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది పెళ్లి శుభాకాంక్షలతో పాటు మళ్లీ చంద్రుడిపై అడుగు పెట్టేందుకు సిద్ధమా అంటూ కామెంట్‌ చేశారు. కాగా, ఈ పోస్ట్‌కు 22,000 కంటే ఎక్కువ మంది లైక్‌ చేశారు. 1.8 మిలియన్ వ్యూస్‌ వచ్చాయి.

ఇవి కూడా చదవండి

ఇకపోతే, 1969లో బూజ్, NASA వ్యోమగాములు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, మిచెల్ కాలిన్స్‌లతో కలిసి అపోలో 11లో చంద్రుని ఉపరితలంపై అడుగు పెట్టారు. 1971లో నాసా నుంచి పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత 1998లో స్పేస్‌షేర్ అనే ఎన్జీవోను ప్రారంభించి, దాని ద్వారా సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధికి కృషి చేస్తున్నాడు. ఇక్కడ గమనించాల్సిన అసలు విషయం ఏంటంటే.. మాజీ గగనాయని భుజ్ ఒక లివింగ్ లెజెండ్. చంద్రునిపై నడిచిన ముగ్గురు వ్యోమగాముల్లో బజ్ ఆల్డ్రిన్ ఒక్కరే సజీవంగా ఉన్నారు. ఏది ఏమైనా లేటు వయసులో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన బుజ్‌ని అభినందిద్దాం.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..