Kim Jong un: రోజంతా తాగుతూ.. ఏడుస్తున్న కిమ్ జోంగ్ ఉన్.. అసలు ఏమైందంటే ??
ఉత్తర కొరియా నియంత, అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మధ్య వయస్సు సమస్యలతో బాధపడుతున్నాడు. రోజంతా విపరీతంగా తాడుతూ ఏడుస్తున్నాడు.
ఉత్తర కొరియా నియంత, అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మధ్య వయస్సు సమస్యలతో బాధపడుతున్నాడు. రోజంతా విపరీతంగా తాడుతూ ఏడుస్తున్నాడు. కిమ్ అనారోగ్య జీవనశైలిని గడుపుతున్నాడని ఎక్కువ సమయం స్పిరిట్, వైన్ తాగుతూ ఉన్నాడని తీవ్ర అస్వస్థతకు గురైనట్టు ఓ నివేదిక బయటికొచ్చింది. ప్రస్తుతం కిమ్ జోంగ్ ఉన్ వయసు 39 ఏళ్లు. కిమ్ జోంగ్ ఉన్ తన వ్యక్తిగత ఆరోగ్యం, భద్రతపై ఆందోళన చెందుతున్నాడని.. తాగి ఏడుస్తున్నట్లు విన్నానని సియోల్‌లో సెటిల్ అయిన ఓ ఉత్తర డాక్టర్ ప్రకటించారు. కిమ్ చాలా ఒత్తడిని, ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్నాడని అన్నారు. వైద్యులతో పాటు భార్య తరుచుగా వ్యాయామం చేయమని చెబుతున్నారని.. అయితే వాటిని కిమ్ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. తన వ్యక్తిగత జీవితాన్ని చాలా రహస్యంగా ఉంచే కిమ్ జోంగ్ ఉన్, గతేడాది తన కుమార్తెతో కలిసి క్షిపణి ప్రయోగ కేంద్రాన్ని పరిశీలించారు. తొలిసారిగా తన కుమార్తెను ప్రపంచానికి పరిచయం చేయడం చర్చనీయాంశం అయింది.