UK’s PM office Pongal: వాహ్వా..! యూకే ప్రధాని కార్యాలయంలో పొంగల్ విందు భోజనాలు..! ఖండాలు దాటినా తెలుగు సంప్రదాయం..
ప్రపంచవ్యాప్తంగా తమిళులు పొంగల్, తెలుగు వారు సంక్రాంతి పండుగను గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు. ఈ నేపథ్యంలోనే బ్రిటన్‌లోని ప్రధానమంత్రి కార్యాలయ సిబ్బంది..
ప్రపంచవ్యాప్తంగా తమిళులు పొంగల్, తెలుగు వారు సంక్రాంతి పండుగను గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు. ఈ నేపథ్యంలోనే బ్రిటన్‌లోని ప్రధానమంత్రి కార్యాలయ సిబ్బంది ఈ పండగను ఘనంగా జరుపుకుంది. రుచికరమైన తీపి వంటకం పొంగల్‌ను ఆస్వాదించారు. ఇందుకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో రక్షణ యూనిఫారం ధరించిన వారితో పాటు, ఇతర అధికారులు వరుసగా కూర్చుని పొంగల్, బియ్యం, బెల్లం, పాలతో చేసిన స్వీట్‌మీట్‌ను అరగించారు. అరటి ఆకులపై ఇడ్లీ, చట్నీ, అరటిపండ్లను వడ్డించుకుని మరీ తిన్నారు. పంచె, చొక్కా ధరించిన ఒక వ్యక్తి వారికి ఇంకేమైనా కావాలా అంటూ అడిగి మరీ వడ్డించారు. వారిలో కొందరు భోజనం చేసేందుకు చెంచాలు వాడుతుండగా, మరికొందరు చేతులతో తినేశారు. ఇదిలావుంటే యూకే ప్రధానమంత్రి రిషి సునక్ దేశంలోని తమిళ, తెలుగు వారందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో, “తై పొంగల్, సంక్రాంతి జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలని పేర్కొన్నారు. వైవిధ్యాన్ని చాటుతున్న ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

