Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.
యువత జల్సా తనం శృతిమించి జుగుప్సాకరంగా మారుతున్నది. అదే విచ్చలవిడితనంగా మారి చూడటానికే ఇబ్బందికరంగా ఉంటున్నది. విశాఖపట్నం గాజువాక ప్రాంతంలో
యువత జల్సా తనం శృతిమించి జుగుప్సాకరంగా మారుతున్నది. అదే విచ్చలవిడితనంగా మారి చూడటానికే ఇబ్బందికరంగా ఉంటున్నది. విశాఖపట్నం గాజువాక ప్రాంతంలో ఇలాంటి వికృతమే చోటుచేసుకుంది. టూ వీలర్‌పై యువతీ యువకులు అభ్యంతకర తీరులో కూర్చొని రోడ్డుపై పరుగులు తీసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. స్టీల్ సిటీ రోడ్డుపై ఓ యువకుడు తన ద్విచక్రవాహనంపై పెట్రోల్ ట్యాంకుపై ఎదురుగా యువతిని కూర్చుండబెట్టుకొని బండిని పరుగులు పెట్టించాడు. సినిమాల్లో మాత్రమే సాధ్యమయ్యే అభ్యంతకరమైన రీతిలో ఆ ఇద్దరూ ప్రయణిస్తున్న తీరు అదే రోడ్డుపై కారులో వెళ్తున్న వ్యక్తులు వీడియో తీసి ఇది సభ్యతనేనా అన్నట్లు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతే అది క్షణాల్లో వైరల్ అయ్యింది. ఆ వైరల్ వీడియో గాజువాక పోలీసుల కంట పడింది. వెంటనే ఆ పోలీసులు యువతీ యువకుల ఆచూకీని కనిపెట్టి ఆ ఇద్దరినీ స్టేషన్‌కు తరలించారు. ఈ యువతీ యువకులు చేసిన అసభ్యకర విన్యాసం చూస్తుంటే యువతపై సినిమా ప్రభావం ఏ రీతిన ఉందో అర్థం అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
కొత్త రకం రెల్లుజాతి పామును చూసారా ??
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే

