ఈ నాన్నకు హ్యాట్సాప్‌ ..! ఆడపిల్ల పుట్టిందని ఓ తండ్రి చేసిన హంగామా మామూలుగా లేదు..

కూతురికి లక్ష్మి అని పేరు పెట్టాడు. పెళ్లయ్యాక ఆమెను ఆడంబరంగా పంపిస్తారు. కాబట్టి ఆమె పుట్టినప్పుడు కూడా ఆసుపత్రి నుండి అంతే అట్టహాసంగా తీసుకురావాలని భావించాడు. అందుకే

ఈ నాన్నకు హ్యాట్సాప్‌ ..! ఆడపిల్ల పుట్టిందని ఓ తండ్రి చేసిన హంగామా మామూలుగా లేదు..
Baby Girl Birth
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 27, 2023 | 12:40 PM

బేటీ బచావో-బేటీ పఢావో అంటూ నినాదాలు చేస్తూ బేగుసరాయ్‌లో ఒక కుటుంబం తమ కుమార్తె పుట్టిన వేడుకను జరుపుకుంది. అలాగే పెళ్లికూతురులా అలంకరించిన ఈ-రిక్షాలో కూతురు, భార్యను సదర్ ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లాడు తండ్రి. బెగుసరాయ్ మహానగర కార్పొరేషన్‌లోని వార్డ్ నెం.42 బిషన్‌పూర్ నౌలాఖా నివాసి తుంటన్ కుమార్ సోను భార్య జూలీ కుమారి జనవరి 23న సదర్ ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చి కుటుంబ సభ్యులందరినీ ఆనందపరిచింది. తుంటన్ కుమార్‌కు ఇప్పటికే ఇద్దరు కుమారులు ఉన్నారు. అతని భార్య గర్భవతి అయినప్పటి నుండి అతను తన కుటుంబం, బంధువులతో కలిసి కుమార్తె కోసం ప్రార్థిస్తున్నాడు. ఇప్పుడు కూతురు పుట్టిన సందర్భంగా కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉన్నారు.

ఇ-రిక్షా డ్రైవరు అయిన తుంటన్ తనకు కూతురు పుట్టినందుకు సంతోషించాడు. ఆమెను చూడటానికి ఆర్కెస్ట్రాతో వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆర్కెస్ట్రా 20 వేలు డిమాండ్ చేయటంతో వెనక్కి తగ్గాడు. తన వద్ద ఉన్నంతలో తన ఈ-రిక్షాను పూలు, బెలూన్లతో అందంగా అలంకరించాడు. అదే రిక్షాలో సదర్ ఆస్పత్రి నుంచి కూతురిని, భార్యను ఇంటికి తీసుకువచ్చాడు. భారీ హంగామాతో కూతురిని ఇంటికి తీసుకొచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అతనికి అప్పటికే ఇద్దరు కుమారులు ఉన్నారు, కానీ కుమార్తె కోసం దేవుడిని ప్రార్థించాడు. తన భార్య, స్నేహితులు, కుటుంబ సభ్యుల ప్రార్థనలను దేవుడు ఆలకించాడని తుంటన్ సంతోషం వ్యక్తం చేశాడు. అతని భార్య జూలీ కుమారి కూడా కూతరు పుట్టిందనే సంతోషం వ్యక్తం చేసింది.

జనవరి 24 సాయంత్రం తుంటన్ కుమార్ ఈ-రిక్షాను అలంకరించి సదర్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అతను తన కుమార్తెను, భార్యను ఇంటికి ఎలా తీసుకువెళ్లాడో దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కూతురికి లక్ష్మి అని పేరు పెట్టాడు. పెళ్లయ్యాక ఆమెను ఆడంబరంగా పంపిస్తారు. కాబట్టి ఆమె పుట్టినప్పుడు కూడా ఆసుపత్రి నుండి అంతే అట్టహాసంగా తీసుకురావాలని భావించాడు. అందుకే అందంగా అలంకరించిన ఈ-రిక్షాలో చిన్నారిని ఇంటికి తీసుకువచ్చానని చెప్పాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కల్తీ నెయ్యి కథ తేలే సమయం వచ్చేసింది.. తిరుమల లడ్డు విచారణలో
కల్తీ నెయ్యి కథ తేలే సమయం వచ్చేసింది.. తిరుమల లడ్డు విచారణలో
నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తినడం వల్ల బోలెడన్నిఆరోగ్యప్రయోజనాలు
నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తినడం వల్ల బోలెడన్నిఆరోగ్యప్రయోజనాలు
ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆమెనా..
ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆమెనా..
మెగా వేలంలో రికార్డ్ ప్రైజ్ పొందే ముగ్గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు
మెగా వేలంలో రికార్డ్ ప్రైజ్ పొందే ముగ్గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు
పోస్టాఫీసులు అద్భుతమైన స్కీమ్‌.. నెలకు రూ.20,500
పోస్టాఫీసులు అద్భుతమైన స్కీమ్‌.. నెలకు రూ.20,500
సిద్ధార్థ్‌ హిట్ కొట్టేలా ఉన్నాడే.. ఆసక్తికరంగా 'మిస్‌ యూ' ట్రైలర
సిద్ధార్థ్‌ హిట్ కొట్టేలా ఉన్నాడే.. ఆసక్తికరంగా 'మిస్‌ యూ' ట్రైలర
డస్ట్‌ అలర్జీ బాధిస్తోందా..? ఈ ఆయుర్వేద ఇంటి చిట్కాలు మీకోసం..!
డస్ట్‌ అలర్జీ బాధిస్తోందా..? ఈ ఆయుర్వేద ఇంటి చిట్కాలు మీకోసం..!
రూ. 4 వేల పెన్షన్‌కు ముహుర్తం ఖరారు? తెలంగాణ ప్రభుత్వం కసరత్తు..
రూ. 4 వేల పెన్షన్‌కు ముహుర్తం ఖరారు? తెలంగాణ ప్రభుత్వం కసరత్తు..
చరిత్ర సృష్టించిన ఎలోన్ మస్క్.. 3 ఏళ్ల రికార్డు బద్దలు
చరిత్ర సృష్టించిన ఎలోన్ మస్క్.. 3 ఏళ్ల రికార్డు బద్దలు
హైదరాబాద్‌లో మరో దారుణం.. బిర్యానీలో బొద్దింక, ఎక్కడంటే..
హైదరాబాద్‌లో మరో దారుణం.. బిర్యానీలో బొద్దింక, ఎక్కడంటే..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!