Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congo Rocks Electricity: ఆఫ్రికాలో రాళ్ల నుండి విద్యుత్ ఉత్పత్తి అవుతుందా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? వీడియో వైరల్

పురాతన కాలంలో రాళ్లను రుద్దడం ద్వారా అగ్నిని ఉత్పత్తి చేసేవారని మీరు చరిత్ర పుస్తకాల్లో చదివి ఉంటారు. నేడు అగ్గిపుల్లలు ఉన్నప్పటికీ, ఇతర పద్దతులను ఉపయోగిస్తున్నారు..

Congo Rocks Electricity: ఆఫ్రికాలో రాళ్ల నుండి విద్యుత్ ఉత్పత్తి అవుతుందా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? వీడియో వైరల్
Africa
Follow us
Subhash Goud

|

Updated on: Jan 27, 2023 | 9:34 AM

పురాతన కాలంలో రాళ్లను రుద్దడం ద్వారా అగ్నిని ఉత్పత్తి చేసేవారని మీరు చరిత్ర పుస్తకాల్లో చదివి ఉంటారు. నేడు అగ్గిపుల్లలు ఉన్నప్పటికీ, ఇతర పద్దతులను ఉపయోగిస్తున్నారు. యాగం కోసం చెక్క యంత్రం నుండి అగ్నిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే యంత్రాన్ని అరణి అంటారు. పూర్వం భారతదేశంలో ఈ పద్ధతిని ప్రతి పనికి నిప్పు వెలిగించేవారు. ఇటీవలే బాగేశ్వర్ ధామ్‌కు చెందిన ఆచార్య ధీరేంద్ర శాస్త్రి కూడా ఈ పద్ధతి ద్వారా అగ్ని జ్వాల వెలిగించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆఫ్రికా ఖండంలోని కాంగోలో ఓ విచిత్రమైన వాదన వినిపిస్తోంది.

రాళ్ల నుండి విద్యుత్తును ఉత్పత్తి జరగదు

ఆఫ్రికాలో దొరికే వైబ్రేనియం రాళ్లు విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలవని ప్రజలు పేర్కొంటున్నారు. అది కూడా దానితో బల్బు వెలిగించడం ద్వారా ఆఫ్రికా ఖండంలోని ప్రతి దేశంలోని విద్యుత్ సమస్యను పరిష్కరించవచ్చు. అయితే ఇది నిజంగా సాధ్యమేనా? ఈ వీడియోను చూసిన నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వీడియో ద్వారా రెండు రాళ్లను రుద్దడం ద్వారా విద్యుత్తును ఎలా ఉత్పత్తి చేస్తారనే చర్చ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతున్న ఈ వీడియోకి కోటి వ్యూస్ వచ్చాయి. చివరికి ఈ విషయాన్ని ప్రపంచంలోని కొంతమంది శాస్త్రవేత్తల దృష్టికి తీసుకువెళ్లారు.

ఇవి కూడా చదవండి

ఫ్యాక్ట్ చెక్‌లో ఏం తేలింది?

బీబీసీలో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం.. ఈ వీడియోను చూసిన తర్వాత శాస్త్రవేత్తలు ఈ విధంగా విద్యుత్తును ఉత్పత్తి చేయడం సాధ్యం కాదని చెబుతున్నారు. ఇలాంటి ఖనిజాలు ఆ దేశంలో ఉన్నప్పటికీ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం సాధ్యం కాదని చెబుతున్నారు. అదే విధంగా ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ జియోసైన్సెస్‌కు చెందిన ప్రొఫెసర్ స్టువర్ట్ మాట్లాడుతూ.. రాళ్ల తాకిడి వల్ల ఇంట్లోని అన్ని అవసరాలకు సరిపడా విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చనే సందేహం ఉందని, నిప్పురవ్వలు బయటకు వస్తున్న రాళ్లను పట్టుకున్న వారు అతని చేతులకు గ్లౌజులు ఉన్నాయి. అందులో ఏదో దాగి ఉండొచ్చు. మెటాలిక్ ఉత్పత్తులు మంచి కండక్టర్‌లు, గ్లోవ్ నుండి వస్తున్న విద్యుత్ స్పార్క్ రూపంలో కనిపించే అవకాశం ఉంది. కాంగోలోని ఈ ప్రాంతంలో లిథియం నిల్వలు దాగి ఉన్నందున కొందరు వ్యక్తులు ఈ రాళ్లను రుద్దడం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తారనే వాదనను నిజంగా పరిగణిస్తున్నారు. కాగా నిజనిర్ధారణలో ఇది ధృవీకరించలేదు. రెండు రాళ్లను పట్టుకుని విద్యుత్‌ వచ్చేలా చేస్తున్న ఈ వీడియోలో గ్లౌస్‌లో ఏదో దాగి ఉండవచ్చని చెబుతున్నారు.

నైజీరియా విశ్వవిద్యాలయంలో జియాలజీ లెక్చరర్ అయిన డాక్టర్ ఇకెన్నా ఒకోంక్వో కూడా వీడియోలను పరిశీలించారు. రాళ్ళు జింక్ లేదా సీసం ధాతువులా కనిపిస్తాయని ఆయన చెప్పారు. ఈ ఖనిజాలకు బల్బును వెలిగించేంత శక్తి సామర్థ్యం ఖచ్చితంగా లేదని ఆయన చెప్పుకొచ్చారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి