Tata Altroz: సెకండ్ హ్యాండ్‌లో కారు కొనాలనుకుంటున్నారా.? రూ. 4 లక్షలకే టాటా ఆల్ట్రోజ్ సొంతం చేసుకోండి!

సెకండ్ హ్యాండ్‌లో కారు కొనాలని ఆలోచిస్తున్నారా.? అయితే టాటా ఆల్ట్రోజ్ బెస్ట్ ఆప్షన్. 5 సీట్ల సామర్థ్యంతో ఉన్న ఈ కారు..

Tata Altroz: సెకండ్ హ్యాండ్‌లో కారు కొనాలనుకుంటున్నారా.? రూ. 4 లక్షలకే టాటా ఆల్ట్రోజ్ సొంతం చేసుకోండి!
Tata Altroz
Follow us

|

Updated on: Jan 26, 2023 | 7:58 PM

సెకండ్ హ్యాండ్‌లో కారు కొనాలని ఆలోచిస్తున్నారా.? అయితే టాటా ఆల్ట్రోజ్ బెస్ట్ ఆప్షన్. 5 సీట్ల సామర్థ్యంతో ఉన్న ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.6.34 లక్షల నుంచి రూ.9.99 లక్షల వరకు ఉంది. మధ్యతరగతి వారికి ఇది ఎక్కువ మొత్తం. అందుకే సెకండ్ హ్యాండ్ కార్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు. మరి మీరు ఈ కారును కేవలం రూ.4 లక్షలకే పొందొచ్చు. సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించే ప్రముఖ ఆన్‌లైన్ వెబ్‌సైట్లు టాటా ఆల్ట్రోజ్‌ను అందుబాటు ధరలకు అమ్మకంలో ఉంచాయి. మరి అవేంటో తెలుసుకుందామా.?

  • కార్‌వాలే(Carwale):

ఈ వెబ్‌సైట్‌లో టాటా ఆల్ట్రోజ్ రూ. 5.75 లక్షలకు అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇది 2020 మోడల్‌ కాగా, ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో దొరుకుతోంది. పెట్రోల్‌తో నడిచే ఈ కారులో మాన్యువల్ గేర్‌బాక్స్ అమర్చబడి ఉంది. ఈ ఆల్ట్రోజ్ మోడల్ ఇప్పటిదాకా 55 వేల కి.మీ నడిచింది.

  • ఓఎల్ఎక్స్(OLX):

ఈ వెబ్‌సైట్‌లో 2021 మోడల్ టాటా ఆల్ట్రోజ్ రూ. 5.61 లక్షలకు అందుబాటులో ఉంది. ఇది ఇప్పటివరకు 57 వేల కిలోమీటర్లు తిరిగింది. గురుగ్రామ్ సర్కిల్‌లో ఉన్న ఈ కారును హర్యానా రిజిస్ట్రేషన్‌తో పొందొచ్చు.

ఇవి కూడా చదవండి
  • డ్రూమ్(Droom):

ఇందులో 2021 మోడల్ టాటా ఆల్ట్రోజ్ కేవలం రూ. 5.45 లక్షలకు అమ్మకానికి ఉంచారు. ఈ కారు ఇప్పటివరకు 38 వేల కిలోమీటర్లు ప్రయాణించింది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభించే ఈ కారు ఢిల్లీ సర్కిల్‌లో అందుబాటులో ఉంది. ఇది హర్యానాలోని గురుగ్రామ్‌ రిజిస్ట్రేషన్‌తో లభిస్తోంది.

  • క్వికర్(Quikr):

టాటా ఆల్ట్రోజ్ కారుకు సంబంధించి చౌకైన ఆఫర్ ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. 2021 మోడల్‌కు చెందిన ఈ విలాసవంతమైన హ్యాచ్‌బ్యాక్ కారును కేవలం రూ. 4.00 లక్షలకే పొందొచ్చు. పెట్రోల్‌తో నడిచే ఈ కారు ఇప్పటివరకు 15 వేల కిలోమీటర్లు తిరిగింది. ఈ వాహనం గోవా రిజిస్ట్రేషన్‌తో లభిస్తోంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం..

( గమనిక: సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేసేటప్పుడు.. సదరు వాహన యజమానిని కలవకుండా, కారు పత్రాలను ధృవీకరించకుండా ఆర్ధిక లావాదేవీలు చేయొద్దు. ఈ కథనం కేవలం CarWale, OLX, Droom, Quikr సైట్ల నుంచి లభించిన సమాచారంపై ప్రచురించబడింది)

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?