Railway Upper Berth Rules: రైలులో అప్పర్ బెర్త్ బుక్‌ చేసుకున్నారా?  అలా చేశారంటే తిప్పలు తప్పవు

అప్పర్ బెర్త్‌ను ఎంచుకున్నవారు పగటి సమయంలో లోయర్‌ బెర్త్‌లో కూర్చోవచ్చో.. లేదో..? ఒక వేళ కూర్చుంటే ఎంత సమయం వరకు కూర్చోవాలి? సీట్‌లో ఇద్దరు ఆర్‌ఏసీ టికెట్స్ ఉన్నవారు కూర్చున్నట్టైతే అప్పర్ బెర్త్‌లో ఉన్నవారు ఎక్కడ కూర్చోవాలి? అనే విషయాలు..

Railway Upper Berth Rules: రైలులో అప్పర్ బెర్త్ బుక్‌ చేసుకున్నారా?  అలా చేశారంటే తిప్పలు తప్పవు
Railway Upper Berth Rules
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 26, 2023 | 5:50 PM

తక్కువ బడ్జెట్‌లో జర్నీ ప్లాన్‌ చేయాలంటే చాలా మంది రైలు మార్గాన్నే ఎంచుకంటారు. ప్రయాణ తేదీకి ముందుగానే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకుని హాయిగా ప్రయాణాన్ని ఎంజాయ్‌ చేస్తారు. అధిక మంది స్లీపర్‌లో వారి ప్రాధాన్యతను బట్టి లోయర్ బెర్త్, మిడిల్ బెర్త్, అప్పర్ బెర్త్, సైడ్ లోయర్ బెర్త్, సైడ్ అప్పర్ బెర్త్‌లలో ఏదో ఒక బెర్త్ ఆప్షన్‌ను ఎంచుకుంటుంటారు. బుకింగ్‌ తేదీన బెర్త్ అందుబాటులో ఉంటే ఇండియన్‌ రైల్వే.. ప్రయాణికులు కోరుకున్న బెర్త్‌ను కేటాయిస్తుంది. లేదంటే ఏదో ఒక బెర్త్‌ను కేటాయిస్తుంది. అలాంటి సందర్భంలో తప్పనిసరిగా అడ్జస్ట్‌ అవ్వకతప్పదు. ఐతే అప్పర్ బెర్త్‌ను ఎంచుకున్నవారు పగటి సమయంలో లోయర్‌ బెర్త్‌లో కూర్చోవచ్చో.. లేదో..? ఒక వేళ కూర్చుంటే ఎంత సమయం వరకు కూర్చోవాలి? సీట్‌లో ఇద్దరు ఆర్‌ఏసీ టికెట్స్ ఉన్నవారు కూర్చున్నట్టైతే అప్పర్ బెర్త్‌లో ఉన్నవారు ఎక్కడ కూర్చోవాలి? అనే విషయాలు చాలా మందికి తెలియవు.

స్లీపర్ క్లాస్‌లో ప్రతీ సెక్షన్‌లో ఎనిమిది బెర్తులుంటాయి. వాటిలో 2 లోయర్ బెర్త్, 2 మిడిల్ బెర్త్, 2 అప్పర్ బెర్త్, 1 సైడ్ లోయర్ బెర్త్, 1 సైడ్ అప్పర్ బెర్త్ ఉంటాయి. ఒకవైపు 6 బెర్తులు, మరోవైపు 2 బెర్తులు ఉంటాయి. 6 బెర్తులు ఉన్నవైపు 2 లోయర్ బెర్త్‌లల్లో ఆరుగురు ప్రయాణికులు కూర్చోవచ్చు. కాబట్టి మిడిల్ బెర్త్, అప్పర్ బెర్త్‌లో ఉన్నవారు లోయర్ బెర్త్‌లో కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే అవకాశం ఉంటుంది. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవరి బెర్తుల్లో వారు నిద్రపోవాలి. అలాగే సైడ్ లోయర్ బెర్త్‌ను ఇద్దరు ఆర్‌ఏసీ ప్రయాణికులకు కేటాయిస్తే.. సైడ్ అప్పర్ బెర్త్‌లో ఉన్నవారు కింద కూర్చోవాలంటే వారి అనుమతి తీసుకోవాలి. లేదంటే పై బెర్తులోనే అడ్జస్ట్‌ అవ్వాలి. ఒకవేళ సైడ్‌ లోయర్‌ బెర్త్‌ను ఒకరికే కేటాయిస్తే, ఆ ప్రయాణికుడి అనుమతి తీసుకుని పగలు కింద కూర్చోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.