Google Layoffs: సుందర్‌ పిచాయ్‌ ‘గోల్డెన్‌ 12K’ ప్యాకేజీ గురించి విన్నారా? ఉద్యోగులకు బలేగా వీడ్కోలు..

పొదుపు చర్యల్లో భాగంగా గూగుల్‌ గత శుక్రవారం ఏకంగా 12,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకున్నట్లు ప్రకటించింది. మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 6 శాతం మందిని తొలగించేందుకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో ఎటువంటి..

Google Layoffs: సుందర్‌ పిచాయ్‌ 'గోల్డెన్‌ 12K' ప్యాకేజీ గురించి విన్నారా? ఉద్యోగులకు బలేగా వీడ్కోలు..
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 25, 2023 | 8:50 PM

పొదుపు చర్యల్లో భాగంగా గూగుల్‌ గత శుక్రవారం ఏకంగా 12,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకున్నట్లు ప్రకటించింది. మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 6 శాతం మందిని తొలగించేందుకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా పెద్ద ఎత్తున జాబ్‌ కోతలు విధిస్తోంది. కంపెనీ వృద్ధి నెమ్మదించిన నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపుపై కఠినంగా వ్యవహరించవల్సి వస్తోందని సోమవారం నిర్వహించిన అంతర్గత సమావేశంలో సుందర్ పిచాయ్‌ వ్యాఖ్యానించారు. కొవిడ్‌-19 పరిణామాల సమయంలో, అప్పటి అవసరాలకు తగ్గట్లుగా అధిక నియామకాలు చేపట్టామని, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అసాధారణ నైపుణ్యమున్న ఉద్యోగులకూ వీడ్కోలు చెప్పాల్సి వస్తోందని, దీనిపై నేను క్షమాపణలు చెబుతున్నానని పిచాయ్‌ అన్నారు.

కేవలం ఉద్యోగుల తొలగింపులతో ఈ ప్రక్రియ ఆగిపోదని ఆయన అన్నారు. సుదీర్ఘకాలం కంపెనీలో పనిచేసి తాజాగా ఉద్యోగం కోల్పోయిన వారికి పరిహార ప్యాకేజీని సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తొలగించిన ఉద్యోగులకు ‘గోల్డెన్ 12K’ ప్యాకేజ్‌ ఇస్తున్నారని సమాచారం. దీంతో ప్రొఫెషనల్ కమ్యూనిటీ యాప్–‘Google 12K’ అనే పదంపై నెట్టింట చర్చ సాగుతోంది. దీనిని నోటీస్‌ పిరియడ్‌ (60 రోజులు) సమయంలో గూగుల్ చెల్లించనుంది. ఈ ప్యాకేజీ కింద 16 వారాల జీతంతోపాటు, ఏడాదికి రెండు వారాల జీతం చొప్పున అదనంగా చెల్లిస్తారు. అలాగే ఆరు నెలలపాటు హెల్త్‌కేర్‌, జాబ్ ప్లేస్‌మెంట్‌ సర్వీసెస్‌, ఇమ్మిగ్రేషన్‌ సపోర్ట్‌ ఇవ్వనుందని సమాచారం. ఈ సదుపాయాలన్నీ అమెరికాలో ఉన్న వారికి మాత్రమే వర్తిస్తాయట. యూఎస్‌ వెలుపల ఉన్న దేశాల్లోని ఉద్యోగులకు స్థానిక పద్ధతులకు అనుగుణంగా గూగుల్‌ ప్యాకేజీ సిద్ధం చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.