Activa EV: వచ్చే ఏడాదిలో హోండా యాక్టివా ఈవీ.. క్లారిటీ ఇచ్చిన సీఈవో..

ముఖ్యంగా మధ్య తరగతి వినియోగదారులు పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో ఈవీ వైపు మొగ్గు చూపుతున్నాడని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా స్కూటర్ అమ్మకాల్లో రికార్డ్ సృష్టించిన హోండా యాక్టివాలో ఎలక్ట్రిక్ వెర్షన్ ఎప్పుడు వస్తుందో? అని వినియోగదారులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల కంపెనీ యాక్టివాలో కొత్త వెర్షన్ ను రిలీజ్ చేయడంతో ఎలక్ట్రిక్ వాహనాల ప్రియులు నిరుత్సాహానికి గురయ్యారు.

Activa EV: వచ్చే ఏడాదిలో హోండా యాక్టివా ఈవీ.. క్లారిటీ ఇచ్చిన సీఈవో..
Honda Activa Electric
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 25, 2023 | 8:50 PM

ప్రస్తుతం కొత్త కంపెనీల్లో మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తుంది. ఎలక్ట్రిక్ కార్ల విషయం పక్కనపెడితే ముఖ్యంగా చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్ లు, బైక్ లను రిలీజ్ చేస్తున్నాయి. దీంతో భవిష్యత్ అంతా ఈవీ వాహనాలదే అని అంతా అనుకుంటున్నారు. ముఖ్యంగా మధ్య తరగతి వినియోగదారులు పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో ఈవీ వైపు మొగ్గు చూపుతున్నాడని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా స్కూటర్ అమ్మకాల్లో రికార్డ్ సృష్టించిన హోండా యాక్టివాలో ఎలక్ట్రిక్ వెర్షన్ ఎప్పుడు వస్తుందో? అని వినియోగదారులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల కంపెనీ యాక్టివాలో కొత్త వెర్షన్ ను రిలీజ్ చేయడంతో ఎలక్ట్రిక్ వాహనాల ప్రియులు నిరుత్సాహానికి గురయ్యారు. అయితే ఈ వార్తలపై కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్, సీఈఓ అట్ సుషి ఒగాటా స్పందించారు. 

హోండా కంపెనీ తన యాక్టివా వెర్షన్ లో కొత్త మోడల్ ను రిలీజ్ చేసిందని, ఇది రాబోయే కఠిన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈవీ యాక్టివాను వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం రిలీజ్ చేసిన యాక్టివాతో మోటార్ సైకిల్ సెగ్మెంట్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 56 శాతం మార్కెట్ వాటాతో స్కూటర్ సెగ్మెంట్ లో కంపెనీ అగ్రగామిగా కొనసాగుతుంది. ఈ బైక్ తో గ్రామీణ, సెమీ అర్బన్ మార్కెట్ లో పట్టు నిలుపుకోవాలని ప్రయత్నిస్తుంది. అయితే 2024 లో మాత్రం కంపెనీ కొత్త ఈవీ యాక్టివాను రిలీజ్ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతీయ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఏడాది మొదట్లో ఫిక్స్ బ్యాటరీతో స్కూటర్ ను రిలీజ్ చేసి, రెండో మోడల్ లో బ్యాటరీ రీప్లేస్ మెంట్ ఫీచర్ ను తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యల బట్టి యాక్టివా లో ఈవీ వెర్షన్ కచ్చితంగా సంవత్సరం ఆగాల్సిందేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్