AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాహుల్‌-అతియా పెళ్లికి అన్ని కోట్ల విలువైన కానుకలొచ్చాయా..? బీఎమ్‌డబ్యూ కారు, రూ.50 కోట్ల బంగ్లా ఇంకా..

టీంఇండియా స్టార్ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌, నటి అతియా శెట్టిల వివాహం జనవరి 23న అంగరంగ వైభవంగా జరగింది. సినీప్రముఖులు, సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి..

రాహుల్‌-అతియా పెళ్లికి అన్ని కోట్ల విలువైన కానుకలొచ్చాయా..? బీఎమ్‌డబ్యూ కారు, రూ.50 కోట్ల బంగ్లా ఇంకా..
KL Rahul gets expensive gifts
Srilakshmi C
|

Updated on: Jan 25, 2023 | 8:01 PM

Share

టీంఇండియా స్టార్ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌, నటి అతియా శెట్టిల వివాహం జనవరి 23న అంగరంగ వైభవంగా జరగింది. సినీప్రముఖులు, సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఐతే పెళ్లికి వచ్చిన ప్రముఖులు ఇచ్చిన గిఫ్ట్‌ల గురించి తాజాగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా విరాట్‌ కోహ్లీ, సల్మాన్‌ ఖాన్‌, జాకీ ష్రాఫ్, ఎమ్‌ఎస్‌ ధోనీ వంటి ప్రముఖులు కోట్ల రూపాయల ఖరీదైన బహుమతులు ఇచ్చారని సమాచారం. విరాట్‌ కోహ్లీ, ధోనీతో రాహుల్‌కు ఉన్న అనుబంధం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఐతే రాహుల్‌, అతియాలకు పెళ్లి కానుకగా కోహ్లీ ఏకంగా 2.17 కోట్ల రూపాయల విలువైన బీఎమ్‌డబ్ల్యూ కారు గిఫ్ట్‌గా ఇచ్చాడట. ఇక ధోనీ 80 లక్షల రూపాయలన విలువైన కవసాకి నింజా బైక్‌ను బహుమతిగా ఇచ్చాడని సమాచారం.

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సునీల్‌ శెట్టి తన గారాల కూతురికి పెళ్లి బహుమతిగా ముంబాయిలో 50 కోట్ల రూపాయల విలువైన విలాసవంతమైన బంగ్లా ఇచ్చినట్లు టాక్‌. ఇక సునీల్‌ శెట్టి సహనటులైన సల్మాన్‌ ఖాన్‌, జాకీ ష్రాఫ్‌లు సైతం ఖరీదైన బహుమతులు ఇచ్చారట. 1.64 కోట్ల రూపాయల విలువైన ఆడీ కారును అతియాకు గిఫ్ట్‌గా ఇచ్చాడని, జాకీ ష్రాఫ్‌ 30 లక్షల రూపాయల విలువైన చోపర్డ్‌ కంపెనీకి చెందిన లగ్జరీ వాచ్‌, అర్జున్‌ కపూర్‌ 1.5 కోట్ల విలువైన డైమండ్‌ బ్రేస్‌లెట్‌ను నూతన దంపతులను బహుమతులుగా సమర్పించినట్లు తెలుస్తోంది. ఇక అతియా, రాహుల్‌లు ఇండస్ట్రీలోని ఫ్రెండ్స్‌ కోసం ముంబయిలో గ్రాండ్‌గా రిసెప్షన్‌ నిర్వహించనున్నారు. ఈ రిసెప్షన్‌ వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని సునీల్‌ శెట్టి మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.

గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
బైక్‌పై వచ్చి ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. మహిళ దగ్గరకు వచ్చి
బైక్‌పై వచ్చి ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. మహిళ దగ్గరకు వచ్చి