22.5 ఓవర్ల మెయిడిన్లు.. బెంబేలెత్తించే స్పిన్ మాంత్రికుడు.. కట్ చేస్తే ప్రపంచ రికార్డు.. ఎవరంటే?
అది సంవత్సరం 1957. దక్షిణాఫ్రికా జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. ఆ రెండు జట్ల మధ్య జరిగిన మూడో మ్యాచ్ ఇది.
అది సంవత్సరం 1957. దక్షిణాఫ్రికా జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. ఆ రెండు జట్ల మధ్య జరిగిన మూడో మ్యాచ్ ఇది. గ్రౌండ్ కింగ్స్‌మీడ్ డర్బన్. ఈ మ్యాచ్‌లో తొలుత ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. సఫారీలపై ఇంగ్లీష్ బ్యాటర్లు అధిపత్యం చెలాయిస్తారని అందరూ భావించారు. అయితే ఇక్కడ సీన్ కాస్తా రివర్స్ అయింది. తనకు వచ్చిన అవకాశాన్ని సరిగ్గా అందిపుచ్చుకున్న ప్రోటీస్ బౌలర్ హ్యూటేఫీల్డ్. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను ముచ్చెమటలు పట్టించాడు. అలాగే ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పాడు. ఆ టెస్టు మ్యాచ్ జరిగి నేటికి 66 ఏళ్లు గడిచినా, హ్యూ టేఫీల్డ్ చేసిన ప్రపంచ రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు.
1957, జనవరి 25-30 మధ్య జరిగిన ఆ డర్బన్ టెస్టులో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 283 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 254 పరుగులు చేసి దక్షిణాఫ్రికా ముందు 190 పరుగుల లక్ష్యాన్ని ఉంచగా.. సఫారీల జట్టు 6 వికెట్లకు 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో చివరికి ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
వరుసగా 137 డాట్ బాల్స్..
హ్యూటేఫీల్డ్ తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ తీయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు పడగొట్టాడు. ఈ విధంగా, రెండు ఇన్నింగ్స్‌లలోనూ కలిపి హ్యూటేఫీల్డ్ 9 వికెట్లు తీశాడు.అయితే ఇక్కడేం ప్రపంచ రికార్డు ఉందని అనుకుంటున్నారా.? హ్యూటేఫీల్డ్ ఈ మ్యాచ్‌లో ఏకంగా 22.5 ఓవర్లు మెయిడిన్లు వేశాడు. అంటే, అతడు వరుసగా 137 డాట్ బాల్స్ బౌలింగ్ చేశాడు. ఇది ఇప్పటికీ ప్రపంచ రికార్డు. కాగా, దక్షిణాఫ్రికా తరపున అత్యంత వేగంగా 100 టెస్టు వికెట్లు తీసిన బౌలర్‌గా టేఫీల్డ్ నిలిచాడు. అయితే, ఈ రికార్డును ఆ తర్వాత 2008లో డేల్ స్టెయిన్ బద్దలు కొట్టాడు.