- Telugu News Photo Gallery Cricket photos Icc odi batting rankings shubman gill enters in top 6 in odi rankings virat kohli rohit sharma top 10 list
Team India: లంకకు చుక్కలు.. కివీస్‌కు ముచ్చెమటలు.. కట్ చేస్తే.. కోహ్లీకీ షాకిచ్చిన యంగ్ ప్లేయర్.. ఎవరంటే?
Shubman Gill ODI Ranking: న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో శుభ్‌మన్ గిల్ ప్రయోజనం పొందాడు. వన్డే ర్యాంకింగ్స్‌లో తొలిసారి టాప్-10కి చేరుకున్నాడు.
Updated on: Jan 25, 2023 | 5:31 PM

ODI Batting Rankings: న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 360 పరుగులు చేసిన శుభ్‌మన్ గిల్ బ్యాట్స్‌మెన్ వన్డే ర్యాంకింగ్స్‌లో 6వ స్థానానికి చేరుకున్నాడు. వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-10లో చేరడం ఇదే తొలిసారి.

ఇక్కడ విశేషమేమిటంటే.. ఫామ్‌లో ఉన్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీని కూడా వెనక్కునెట్టాడు. ప్రస్తుతం కోహ్లి ఏడో స్థానానికి పడిపోయాడు. ఇక భారత్ నుంచి టాప్-10లో రోహిత్ శర్మ కూడా ఉన్నాడు.

రెండు వారాల క్రితం శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన శుభ్‌మన్ గిల్.. వన్డే ర్యాంకింగ్స్‌లో లాంగ్ జంప్ చేసి 26వ స్థానానికి చేరుకున్నాడు.

బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో సెంచరీ చేసిన శుభమాన్ గిల్.. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన 7వ ఆటగాడిగా నిలిచాడు. 54 బంతుల్లోనే సెంచరీ చేసిన గిల్, 63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో అజేయంగా 126 పరుగులు చేశాడు.

భారత జట్టు తరఫున అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో గిల్ కంటే ముందు ఈ ఘనతను కొద్ది మంది ప్లేయర్లు మాత్రమే సాధించారు. మరి ఆ ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

గత వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ 10వ స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు స్టీవ్ స్మిత్‌తో కలిసి సంయుక్తంగా ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. ఇండోర్ వన్డేలో సెంచరీ కారణంగా రోహిత్ శర్మ ర్యాంకింగ్ మెరుగుపడింది.

వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్‌కు చెందిన బాబర్ అజామ్ (887) అగ్రస్థానంలో ఉన్నాడు. రెండవ, మూడవ స్థానంలో సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్స్ నిలిచారు. రాసి వాన్ డెర్ డస్సెన్ (766) రెండో స్థానంలో, క్వింటన్ డికాక్ (759) మూడో స్థానంలో ఉన్నారు.

ఆ తర్వాతి స్థానాల్లో డేవిడ్ వార్నర్ (747), ఇమామ్ ఉల్ హక్ (740), శుభ్‌మన్ గిల్ (734), విరాట్ కోహ్లీ (727), స్టీవ్ స్మిత్ (719), రోహిత్ శర్మ (719), జానీ బెయిర్‌స్టో (710) ఉన్నారు.





























