- Telugu News Photo Gallery Cricket photos Rohit Sharma scored Hundred against New Zealand in 3rd ODI and equals Ricky Ponting Centuries Record in the Format
Rohit Sharma: వన్డేల్లో రికీ పాంటింగ్ రికార్డును సమం చేసిన రోహిత్ శర్మ.. ఇంకో సెంచరీ చేస్తే లెక్కలు తిరగరాయడం ఖాయం..
న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో రోహిత్ సాధించిన సెంచరీతో.. అతను ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డును సమం చేశాడు.
Updated on: Jan 25, 2023 | 3:00 PM

మంగళవారం న్యూజిలాండ్ తో ఇండోర్ మైదానంలో జరిగిన మూడో వన్డేలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తన సత్తా చాటాడు. గతంలో ఇదే మైదానంలో టీ20లో సెంచరీ సాధించిన రోహిత్ మళ్లీ అదే మైదానంలో వన్డే సెంచరీ సాధించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో రోహిత్ ఈ ఘనత సాధించి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డును సమం చేశాడు.

కానీ కోహ్లీ గైర్హాజరీలో టీమిండియా తాత్కలిక సారథిగా జట్టును నడిపించిన రోహిత్.. 2017లో శ్రీలంకపై జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 43 బంతుల్లో 118, 2018లో వెస్టిండీస్‌పై జరిగిన టీ20లో 61 బంతుల్లో 111 పరుగు చేశాడు.అలాగే వన్డేల్లో కూడా ఇటీవలె కివీస్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో శతకం బాదాడు హిట్ మ్యాన్.

విశేషమేమిటంటే.. ఈ మ్యాచ్‌లో 6 సిక్సర్లు కొట్టిన రోహిత్.. వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ జాబితాలో హిట్ మ్యాన్ 3వ స్థానానికి చేరుకున్నాడు. అంతకముందు వరకూ వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్ జాబితాలో మూడో స్థానంలో ఉన్న శ్రీలంక మాజీ ప్లేయర్ సనత్ జయసూర్య స్థానాన్ని తన సొంతం చేసుకున్నాడు.

మూడేళ్లలో రోహిత్‌కి ఇదే తొలి వన్డే సెంచరీ. దీనికి ముందు, 2020లో జనవరి 19న ఆస్ట్రేలియాపై సెంచరీ చేశాడు రోహిత్. ఈ సెంచరీతో శ్రీలంక మాజీ ఓపెనర్ సనత్ జయసూర్య రికార్డును రోహిత్ అధిగమించేశాడు. ఓపెనర్‌గా జయసూర్య 28 వన్డే సెంచరీలు చేయగా, ఓపెనర్‌గా రోహిత్ శర్మ 29వ వన్డే సెంచరీని నమోదు చేశాడు ఆ శతకంతో.

ఇక మంగళవారం న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ వన్డేల్లో తన 30వ సెంచరీ చేసిన వెంటనే తన వికెట్ కోల్పోయాడు. మొత్తం 85 బంతులను ఎదుర్కొన్న రోహిత్ 9 ఫోర్లు, 6 సిక్సర్సతో 101 పరుగులు చేశాడు.




