Rohit Sharma: సనత్ జయసూర్యను వెనక్కు నెట్టి 3వ స్థానంలో నిలిచిన రోహిత్ శర్మ.. ఆ జాబితాలో ఎమ్ఎస్ ధోని ఎన్నో స్థానంలో ఉన్నాడంటే..
శివలీల గోపి తుల్వా |
Updated on: Jan 25, 2023 | 9:20 PM
Rohit Sharma: వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్ జాబితాలో రోహిత్ శర్మ మూడో స్థానంలో నిలిచాడు. మరి వన్డే క్రికెట్‌లో ఇప్పటివరకు అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ ఎవరో చూద్దాం..
Jan 25, 2023 | 9:20 PM
వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్ జాబితాలో రోహిత్ శర్మ మూడో స్థానంలో నిలిచాడు. మరి వన్డే క్రికెట్‌లో ఇప్పటివరకు అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ ఎవరో చూద్దాం..
1 / 8
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో రోహిత్ శర్మ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 85 బంతులు ఆడిన హిట్‌మ్యాన్ 6 సిక్సర్లు, 9 ఫోర్లతో 101 పరుగులు చేశాడు.
2 / 8
విశేషమేమిటంటే.. ఈ మ్యాచ్‌లో 6 సిక్సర్లు కొట్టిన రోహిత్.. వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ జాబితాలో హిట్ మ్యాన్ 3వ స్థానానికి చేరుకున్నాడు. అంతకముందు వరకూ వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్ జాబితాలో మూడో స్థానంలో ఉన్న శ్రీలంక మాజీ ప్లేయర్ సనత్ జయసూర్య స్థానాన్ని తన సొంతం చేసుకున్నాడు.
3 / 8
1. షాహిద్ అఫ్రిది: పాకిస్థాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది 369 వన్డే ఇన్నింగ్స్‌లలో మొత్తం 351 సిక్సర్లు కొట్టాడు. దీంతో వన్డే క్రికెట్‌లో సిక్సర్ల రారాజుగా కొనసాగుతున్నాడు ఈ పాకిస్తానీ ప్లేయర్.
4 / 8
2. క్రిస్ గేల్: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మ్యాన్ క్రిస్ గేల్ 294 వన్డే ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 331 సిక్సర్లు కొట్టాడు. దీంతో ఈ జాబితాలో 2వ స్థానంలో నిలిచాడు.
5 / 8
3. రోహిత్ శర్మ: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 234 వన్డే ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 273 సిక్సర్లు బాదాడు. దీని ద్వారా టీమిండియా తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా, వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్రపంచంలో 3వ ఆటగాడిగా నిలిచాడు.
6 / 8
4.సనత్ జయసూర్య: శ్రీలంక మాజీ ఓపెనర్ సనత్ జయసూర్య 433 వన్డే ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 270 సిక్సర్లు బాదాడు.
7 / 8
5. మహేంద్ర సింగ్ ధోని: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని 297 వన్డే ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 229 సిక్సర్లు కొట్టాడు. దీంతో వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన 2వ భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన ధోని.. ఈ జాబితాలో 5 స్థానంలో ఉన్నాడు.