UK News: కొడుకుని లైంగికంగా వేధించిన తండ్రి.. కత్తి తీసుకుని 30 పోట్లు పొడిచేశాడు..!

ఆగ్నేయ లండన్‌లోని బ్రోమ్లీలో ఓ వ్యక్తి ఉన్మాదిలా రెచ్చిపోయాడు. తన కన్నతండ్రినే కడతేడ్చాడు. ఫలితంగా 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది అక్కడి కోర్టు. ఇంకీ అతను తన తండ్రిని..

UK News: కొడుకుని లైంగికంగా వేధించిన తండ్రి.. కత్తి తీసుకుని 30 పోట్లు పొడిచేశాడు..!
Arrest
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 27, 2023 | 7:42 AM

ఆగ్నేయ లండన్‌లోని బ్రోమ్లీలో ఓ వ్యక్తి ఉన్మాదిలా రెచ్చిపోయాడు. తన కన్నతండ్రినే కడతేడ్చాడు. ఫలితంగా 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది అక్కడి కోర్టు. ఇంకీ అతను తన తండ్రిని ఎందుకు చంపాడో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. లండన్‌కు చెందిన సీన్ మారీస్.. తండ్రి పాల్‌ను 30 సార్లు కత్తితో పొడిచాడు. ఆ తరువాత ఘటనా స్థలి నుంచి పారిపోయాడు. అయితే, పోలీసుల కళ్లుగప్పి ఎక్కువకాలం దాక్కోలేకపోయాడు. చివరకు దొరికిపోయిన అతనికి కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, పోలీసుల విచారణలో షాకింగ్ వివరాలు వెల్లడించాడు నిందితుడు సీన్ మారీస్. 52 ఏళ్ల తన తండ్రి.. తనను లైంగికంగా వేధింపులకు గురిచేశాడట. ఆ కారణంగానే అతను తన తండ్రిని హతమార్చాడట.

‘‘నాకు, నాన్నకు మధ్య వాగ్వాదం జరిగింది. నేను నాన్నను కొట్టాను. అందుకు ప్రతిగా రెచ్చిపోయిన ఆయన.. నన్ను లైంగికంగా వేధించాడు. ఈ క్రమంలో రక్షణ కోసం కత్తి తీసుకుని పొడిచేశాను. మీరు నన్ను అరెస్ట్ చేశారు. ఇదేం న్యాయం?’’ అంటూ జమదగ్ని సినిమాలో కృష్ణ రేంజ్‌లో ఊగిపోయాడు నిందితుడు సీన్.

అయితే, ఈ కేసులో వాదనలు, సాక్ష్యాలు పరిశీలించిన న్యాయస్థానం.. సీన్ వాదనతో ఏకీభవించింది. తండ్రి తప్పుడు పనికి పాల్పడినందుకే సీన్ అలా చేసినట్లు నిర్ధారించింది. అయితే, నేరం నేరమే కాబట్టి అతనికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..