Adani Group: హిండెన్‌బర్గ్ వ్యవహారంపై అదానీ గ్రూప్ కీలక నిర్ణయం.. న్యాయపరమైన చర్యలకు సిద్ధం.
అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ అనే రీసెర్చ్ సంస్థ చేసిన ఆరోపణలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అదానీ గ్రూప్ తమ ఖాతాల్లో మోసాలు చేస్తోందని సంస్థ నివేదిక చర్చకు దారి తీసింది. ఈ నివేదిక బయటకు రావడంతో అదానీ గ్రూప్ షేర్లు భారీగా నష్టపోయాయి...
అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ అనే రీసెర్చ్ సంస్థ చేసిన ఆరోపణలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అదానీ గ్రూప్ తమ ఖాతాల్లో మోసాలు చేస్తోందని సంస్థ నివేదిక చర్చకు దారి తీసింది. ఈ నివేదిక బయటకు రావడంతో అదానీ గ్రూప్ షేర్లు భారీగా నష్టపోయాయి. దీంతో అదానీ గ్రూప్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. తమ సంస్థకు నష్టం వాటిల్లే చర్యలను ఉపేక్షించేది లేదని అల్టిమేటం జారీ చేసింది. హిండెన్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని అదానీ గ్రూప్ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.
షేర్లలో తాము ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని , కావాలనే అదానీ గ్రూప్‌ను టార్గెట్ చేసేందుకు ఈ నివేదికను తయారు చేశారని తెలిపింది. ఇదిలా ఉంటే హిండెన్‌బర్గ్ వ్యవహారంపై అదానీ గ్రూప్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ‘హిండెన్‌బర్గ్’పై లీగల్ చర్యలకు అదానీ గ్రూప్ నిర్ణయం తీసుకుంది. న్యాయపరమైన చర్యలు తప్పవని అదానీ గ్రూప్ లీగల్ హెడ్ జతిన్ జలుంద్‌వాలా హెచ్చరించారు. షేర్లు, ఖాతాల్లో అవకతవకలకు పాల్పడుతోందంటూ అదానీ గ్రూపుపై హిండెన్‌బర్గ్ తీవ్ర ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పెట్టుబడి దారులు ఏకంగా రూ. 85 వేల కోట్లు నష్టపోయారు.
ఈ నేపథ్యంలోనే తమ ఇన్వెస్టర్లను ప్రభావితం చేసే దుష్ప్రచారంపై చర్యలకు అదానీ గ్రూప్ సమాయత్తమైంది. ఇది అమెరికన్ షార్ట్ సెల్లర్ల పన్నాగమేనన్న అదానీ గ్రూప్ పేర్కొంది. ఈ ఆరోపణలు అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విక్రయాన్ని నాశనం చేయాలన్న దురుద్దేశంతో చేసినవని పేర్కొంది. హిండెన్‌బర్గ్ సంస్థ తమను సంప్రదించకుండా, నిజనిజాలు తెలుసుకోకుండా నివేదికను వెల్లడించడం షాక్‌కు గురిచేసినట్టు అదానీ గ్రూప్ తెలిపింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..