Tech Layoffs: టాప్ టెక్ కంపెనీల్లో లే ఆఫ్స్ ఫీవర్.. డబ్బు కోసమే పని చేయాలంటూ ఉద్యోగుల ఆగ్రహం
గూగుల్, అమెజాన్, ట్విట్టర్, మెటా వంటి టాప్ దిగ్గజ కంపెనీలు దాదాపు 50000 మంది వరకూ తొలగించినట్లు ఓ అంచనా. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లను కలిగి ఉన్న మార్క్ జుకర్‌బర్గ్ మెటా కంపెనీ గత ఏడాది నవంబర్‌లో 11,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ అసందర్భ తొలగింపులు తమనుదిగ్భ్రాంతికి గురి చేశాయని పలువురు ఉద్యోగులు బాహాటంగానే విమర్శిస్తున్నారు.
గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి సంస్థలు ఒక్కప్పుడు సురక్షితంగా పని చేసుకునే అవకాశం ఉన్న కంపెనీలుగా ఉండేవి. ఇటీవల ఫైనాన్షియర్ ఇయర్ 2023 లో దాదాపు 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రకటించింది. అలాగే గూగుల్, అమెజాన్, ట్విట్టర్, మెటా వంటి టాప్ దిగ్గజ కంపెనీలు దాదాపు 50000 మంది వరకూ తొలగించినట్లు ఓ అంచనా. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లను కలిగి ఉన్న మార్క్ జుకర్‌బర్గ్ మెటా కంపెనీ గత ఏడాది నవంబర్‌లో 11,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ అసందర్భ తొలగింపులు తమనుదిగ్భ్రాంతికి గురి చేశాయని పలువురు ఉద్యోగులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. గూగుల్ ఈ ఏడాది 17 బిలియన్ల నికర లాభాన్ని ఆర్జించినా ఉద్యోగులను ఎందుకు తొలగించారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లే ఆఫ్ లతో కలత చెందిన మరికొంత మంది ఉద్యోగులు సీఈఓ పదవి నుంచి సుందర్ పిచాయ్ ను తొలగించాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క గూగుల్ నే కాదు మైక్రోసాఫ్ట్, మెటా మాజీ ఉద్యోగులు కూడా వారి పని చేసిన సంస్థను సోషల్ మీడియా వేదికగా ఏకిపడేస్తున్నారు. ఖర్చులు తగ్గించుకునే సాకుతో ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శిస్తున్నారు. కంపెనీకి నిబద్ధతతో పని చేసిన నేరమే అని ఆగ్రహిస్తున్నారు. సోషల్ మీడియాలో పలువురు ఉద్యోగులు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. అవేంటో ఓ సారి చూద్దాం.
వాల్ మార్ట్ సాఫ్ట్ వేర్ ఇంజినీరైన అంకుర్ కేశర్వాణి ఓ ఉద్యోగి మైక్రోసాఫ్ట్ లో 21 ఏళ్లు, మరొకరు గూగుల్ 16 ఏళ్లు పని చేశారు. అలాంటి వారిని రెప్పపాటు కాలంలో తొలగిస్తే వారు విధేయంగా ఎలా ఉంటారు? ఇన్నాళ్లూ కంపెనీకి చేసిన సేవలకు విలువ ఇవ్వకుండా తొలగిస్తే, మిగిలిన ఉద్యోగులు కంపెనీపై విధేయంగా ఉంటారని మీరు అంగీకరిస్తున్నారా? అంటూ ప్రశ్నించారు.
- డేటా ఇంజినీర్ అయిన సూరజ్ మరికొంత ముందుకెళ్లి ఉద్యోగులు కేవలం డబ్బు కోసమే పని చేయాలని సూచించారు. ఎందుకంటే కంపెనీ లాయల్టీ అనే జోక్ తో కంపెనీ, ఉద్యోగుల మధ్య సంబంధాన్ని డబ్బుతో వెలకట్టినప్పుడు ఉద్యోగులు కంపెనీ లాభనష్టాలతో పని లేకుండా కేవలం డబ్బు కోసమే పని చేయాలని అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- గూగుల్ లేఆఫ్ నిర్ణయం షాక్ కు గురి చేసిందని హెచ్ ఆర్ ప్రొఫెషనల్ అనుషా బయ్యారపు షేర్ చేశారు. అలాగే కేథరీన్ అనే మరో ఉద్యోగి కూడా తాను ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి అని లే ఆఫ్ విషయం తెలిసి బాధపడుతున్నాని పేర్కొంది.
- గూగుల్ ఇంజినీరింగ్ మేనేజర్ అయిన జస్టిస్ మూర్ 16.5 సంవత్సరాలుగా గూగుల్ కంపెనీకి సేవలందిస్తున్నారు. ఈయనను తెల్లవారు జాము మూడు గంటల సమయంలో ఆటోమేటిక్ అకౌంట్ డీయాక్టివేషన్ ద్వారా తొలగించారు. అలాగే తర్వాత ఎలాంటి సంప్రదింపులు లేవని, గూగుల్ వంటి పెద్ద సంస్థే ఉద్యోగులను ఇలా చేస్తే ఎలా? అని మండిపడ్డారు.
అయితే వీరందరి వేదన వెనుక ఒకటే కారణం ఉంది. తమను అన్యాయంగా తొలగించారని, గౌరవప్రదంగా తమను సాగనంపలేదని వీరి వాదన. అలాగే ఇన్నేళ్లు సేవలందించినా తమను ఇప్పుడే ఎందుకు తొలగించాల్సి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. అలాగే కంపెనీలు తమకు తాము ఇచ్చుకునే ట్రైనింగ్ ఇంక ఎలాంటి అర్థం ఉందంటూ ప్రశ్నిస్తున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం