ఎంప్లాయిస్‌కి షాక్.. భారీగా ఉద్యోగులను తగ్గించే పనిలో దిగ్గజ సంస్థలు.. ఇప్పుడు అమెజాన్ సైతం ఇదే బాటలో..

ఇటీవల అమెజాన్ ఎంప్లాయి ఒకరు.. సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ తో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. ఇంకెందరి ఉద్యోగాలు పోనున్నాయో అంటూ నిర్వేదంతో కూడిన ఈ పోస్ట్ ద్వారా.. భారీ కలకలం చెలరేగింది.

ఎంప్లాయిస్‌కి షాక్.. భారీగా ఉద్యోగులను తగ్గించే పనిలో దిగ్గజ సంస్థలు.. ఇప్పుడు అమెజాన్ సైతం ఇదే బాటలో..
Amazon Layoffs
Follow us
Surya Kala

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 15, 2022 | 10:43 AM

మొన్న ఫేస్ బుక్, నిన్న ట్విట్టర్, ఇవాళ అమేజాన్. వరుసగా పోతున్న ఉద్యోగాలు. కారణాలు ఏమై ఉంటాయ్? ఈ టెక్ సంస్థలు వరుసగా ఎందుకు ఉద్యోగాల్లో కోతలు పెడుతున్నాయని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఒక పక్క ఆదాయం క్రమేణా తగ్గుతుండగా.. మరో పక్క.. ఆర్ధిక మాంద్యం సూచనలు, పెరుగుతున్న వడ్డీ రేట్లకు హడలెత్తిపోతున్నాయి కంపెనీలు. ముందు జాగ్రత్తగా ఉద్యోగ తొలగింపు చర్యలు చేపడుతున్నాయి పలు దిగ్గజ సంస్థలు. ఇప్పటికే మెటా, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్ సంస్థలు ఉద్యోగులపై వేటు వేయగా.. తాజాగా ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ సైతం ఇదే బాటలో పయనిస్తోంది.

ఇటీవల అమెజాన్ ఎంప్లాయి ఒకరు.. సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ తో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. ఇంకెందరి ఉద్యోగాలు పోనున్నాయో అంటూ నిర్వేదంతో కూడిన ఈ పోస్ట్ ద్వారా.. భారీ కలకలం చెలరేగింది. రాబోయ రోజుల్లో.. ఖర్చు తగ్గించుకోవడంలో భాగంగా ఈ సంస్థలు ఇంకెన్ని ఉద్యోగాలు తొలగిస్తాయో అన్న ఆందోళన నానాటికీ పెరుగుతోంది. ప్రస్తుతం ఇంటర్నేషనల్ జాబ్ మార్కెట్ లో వినిపిస్తోన్న పదాలు ఏంటంటే.. హైరింగ్ ఫ్రీజ్, ఉద్యోగాల కోత. ఇది చిన్నా చితకా కంపెనీల వ్యవహారం కాదు.. ఆపిల్ లాంటి భారీ సంస్థల నుంచి వినిపిస్తోన్న మాట. అక్టోబర్- 2022 నాటికి సిలికాన్ వ్యాలీ దాదాపు 45 వేల మందిని తొలగించినట్టు చెబుతున్నాయి గణాంకాలు. దీనంతటికీ కారణంగా.. ఈ సాంకేతిక సంస్థలు ఆర్ధిక మందగమనంతో భారీ పోరాటం చేస్తుండటం. దీంతో ఉద్యోగాలను తగ్గించడం లేదంటే నియామకాలను స్తంభింప చేయడం వంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి.

భారత్ లోనూ ఇందుకు మినహాయింపేం కాదు. ఇంక్- 42 అనే వెబ్ సైట్ ప్రకారం ఇండియాలో సుమారు 15 వేల మంది వరకూ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. వీటిలో బైజుస్, కార్స్ 24, చార్జ్ బీ, లీడీ్, మీషో, ఎంపీఎల్ వంటి సంస్థలతో పాటు మరో 44 స్టార్టప్స్ ఉన్నాయి.  ఫేస్ బుక్ పేరెంట్ కంపెనీ మెటా తన ఉద్యోగులను తొలగించుకునే పనిలో ఉంది. పోయిన ఆగస్ట్ లోనే జుకర్ బర్గ్.. కొందరు ఉద్యోగులను తొలగించమంటూ ఆదేశాలు జారీ చేశారు. కారణం గత ఏడాదికంటే ఈ ఏడాది 52 శాతం ఆదాయం తగ్గడం. ఉన్నవారితో పని చేయమంటూ తన సిబ్బందికి సూచించారు జుకర్ బర్గ్. నష్టాలను నివారించాలంటే.. కొత్త ఉద్యోగులను తీస్కోకుండా ఆపడంతో సరిపోదు. పాత వారిలో కొందర్ని తీసెయ్యాల్సి వస్తుందని అంటన్నాయీ దిగ్గజ సంస్థలు.

ఇవి కూడా చదవండి

కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ట్విట్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఎలన్ మస్క్ పాలనలో అంతా అయోమయంగా మారింది. ఇప్పటికే ట్విట్టర్ సీఈఓ పరాగ్, సీఎఫ్ఓ సెగల్, లీగల్ సెల్ చీఫ్ విజయ వంటి టాప్ ఎగ్జిక్యుటివ్స్ ను తొలగించి సంచలనం సృష్టించింది ట్విట్టర్. ఖర్చులు మరింత తగ్గించడంలో భాగంగా.. తనకున్న 7500మందిలో సగానికి సగం ఉద్యోగులను తగ్గించాలని చూస్తోంది ట్విట్టర్. మొత్తంగా ఉద్యోగుల సంఖ్యను రెండు వేల మందికి తీసుకురావాలన్నదే ఎలన్ మస్క్ స్కెచ్. ట్విట్టర్ కు ఇండియాలో ఉన్న 230 మందిలో 180 మందిని తొలగించారంటే అర్ధం చేసుకోవచ్చు.. ఉద్యోగాల కోత ఎలా ఉందో చెప్పడానికి.

ప్రస్తుతం ఈ కంపెనీల ఆలోచన ఎలా ఉందంటే.. అయితే కొత్త ఉద్యోగ నియామకాల ఆపివేత, లేదంటే పాత ఉద్యోగాల తొలగింపు. ఆపిల్ కూడా ఇటీవల ఒక వంద మంది వరకూ ఉద్యోగులను తొలగించింది. ఒక్క ఆర్ అండ్ డీ తప్ప.. వివిధ విభాగాల్లో ఉద్యోగులను తీసుకోవడం పూర్తిగా నిలిపి వేసింది. కారణం ఆపిల్ ఐ ఫోన్ అమ్మకాలు ఆశినంత మేర సాగడం లేదు. దీంతో నియామకాలను నిలిపి వేసి.. బడ్జెట్ ఆదా చేయాలని చూస్తోందీ దిగ్గజ టెక్ సంస్థ.

మైక్రోసాఫ్ట్ లోనూ ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే వివిధ విభాగాల్లో వెయ్యి మంది వరకూ తొలగించారు. ఇవన్నీ తమ నిర్మాణాత్మక సర్దుబాట్లుగా చెబుతోందీ సంస్థ. నాలుగు నెలల్లో ఇది మూడో రౌండ్ తొలగింపు.. అంటేనే అర్ధం చేసుకోవచ్చు.. ఈ సంస్థ ఎంత వేగంగా తమ ఉద్యోగులను తొలగిస్తుందో చెప్పడానికి. లక్షా 80 వేలుగా ఉన్న ఈ కంపెనీ వర్క్ ఫోర్స్ నుంచి సుమారు ఒక శాతం మందిని తొలగించేలా అడుగులు వేస్తోంది.

ఇక నాప్ చాట్ 1200 మందిని తొలగించగా.. టెన్సెట్ ఐదు వేల మందికి పైగా ఉద్యోగులను తీసేసింది. సీగేట్ 3వేల మందిని తొలగించింది, ఇంటెల్ అయితే తన నాలుగో త్రైమాసిక ప్రణాళికలో భాగంగా వేలాది మందిని తీసేసే యోచనలో ఉంది. ఒక్క బైజూసే తన యాభై వేల మంది ఉద్యోగుల్లోంచి సుమారు 2500 మంది ఉద్యోగులను తొలగించేలా చర్యలు తీసుకుంటోంది.

ప్రపంచ మంతా విస్తరించిన ఇండియన్ టెక్, కమ్ కార్పొరేట్ ఎంప్లాయిస్ ఈ ఉద్యోగ కోతను తీవ్రంగా ఎదుర్కుంటున్నారు. పేరుకు పెద్ద కంపెనీల ఉద్యోగాలని సంబర పడే లోపు.. వారి వారి ఉద్యోగాలు ఊడిపోతుండటంతో.. ఏం చేయాలో దిక్కుతోచని స్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడం కూడా ఏమంత సులభం కాదు. దీంతో తీవ్ర నిరాశా నిస్పృహల్లోకి వెళ్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గోల్డ్ లవర్స్‌కి అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధర
గోల్డ్ లవర్స్‌కి అదిరిపోయే న్యూస్.. తగ్గిన బంగారం ధర
బిగ్ బాస్ విజేతగా నిఖిల్.. ప్రైజ్ మనీతో పాటు పారితోషికం భారీగానే
బిగ్ బాస్ విజేతగా నిఖిల్.. ప్రైజ్ మనీతో పాటు పారితోషికం భారీగానే
ముగిసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌.. 445 పరుగులకు ఆలౌట్
ముగిసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌.. 445 పరుగులకు ఆలౌట్
Horoscope Today: ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు..
Horoscope Today: ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో వారికి శుభవార్తలు..
'శ్రీతేజ్‌ను అందుకే కలవలేకపోతున్నా.. నిత్యం ప్రార్థిస్తున్నా'
'శ్రీతేజ్‌ను అందుకే కలవలేకపోతున్నా.. నిత్యం ప్రార్థిస్తున్నా'
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజేతగా నిఖిల్.. రన్నరప్ గా గౌతమ్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజేతగా నిఖిల్.. రన్నరప్ గా గౌతమ్
ప్రముఖ తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ హఠాన్మరణం
ప్రముఖ తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ హఠాన్మరణం
రూ.699లకే టీవీ ఛానల్స్‌, సూపర్‌ఫాస్ట్ ఇంటర్నెట్, 12 OTTలు
రూ.699లకే టీవీ ఛానల్స్‌, సూపర్‌ఫాస్ట్ ఇంటర్నెట్, 12 OTTలు
పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
జియో యూజర్లకు గుడ్‌న్యూస్‌.. 3 నెలల వ్యాలిడిటీతో చౌకైన ప్లాన్‌..!
జియో యూజర్లకు గుడ్‌న్యూస్‌.. 3 నెలల వ్యాలిడిటీతో చౌకైన ప్లాన్‌..!
పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్