Mobile Data: మొబైల్ డేటా అయ్యిపోతుందా? ఈ సింపుల్ డేటా సేవింగ్స్ టిప్స్ పాటిస్తే సరి..
రీగా పెరిగిన స్పీడ్ వల్ల కొందరి రోజువారీ గడవు తీరకముందే అయిపోతుంది. ఒక్కోసారి యాడ్ ఆన్ ప్యాక్స్ వేసుకున్నా డేటా సమస్య వేధిస్తుంటుంది. అయితే డేటా విషయంలో మనం వాడే డేటా కొంతమేరే అయినా కొన్ని బ్యాక్ ఎండ్ యాప్స్ వల్ల మొబైల్ డేటా అయ్యిపోతుంటుంది.

భారతదేశంలో జియో ప్రవేశించిన తర్వాత డేటా వినియోగం బాగా పెరిగింది. టాప్ టెలికం కంపెనీలు కూడా జియో బాటలో పయనిస్తూ వినియోగదారులకు డేటా ఆఫర్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. భారీగా పెరిగిన స్పీడ్ వల్ల కొందరి రోజువారీ గడవు తీరకముందే అయిపోతుంది. ఒక్కోసారి యాడ్ ఆన్ ప్యాక్స్ వేసుకున్నా డేటా సమస్య వేధిస్తుంటుంది. అయితే డేటా విషయంలో మనం వాడే డేటా కొంతమేరే అయినా కొన్ని బ్యాక్ ఎండ్ యాప్స్ వల్ల మొబైల్ డేటా అయ్యిపోతుంటుంది. ముఖ్యంగా డేటా అయ్యిపోయిన సందర్భంలో కొన్ని యాప్స్ ను వాడొద్దని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ప్లే స్టోర్ లో యాప్ అప్ డేట్స్ ను కూడా డిసెబుల్ చేయాలని చెబుతున్నారు. అలాగే డేటా వినియోగంలో ఎక్కువ డేటా డిడక్ట్ అయ్యే యాప్స్ విషయంలో తగిని జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. వారు చెప్పే డేటా సేవింగ్ చిట్కాలను ఓ సారి తెలుసుకుందాం.
ఆటోమెటిక్ డౌన్ లోడ్ ఆఫ్
మనం తరచూగా వాడే వాట్సాప్, టెలీగ్రామ్ వంటి మెసెజ్ యాప్స్ లో ఉండే ఆటోమెటిక్ డౌన్ లోడ్ అనే ఆప్షన్ డియాక్టివేట్ చేయడం ద్వారా చాలా వరకూ డేటా సమస్య నుంచి బయటపడవచ్చు. యాప్ లో సెట్టింగ్స్ వద్దకు వెళ్లి వీటిని ఆఫ్ చేసే అవకాశం ఉంది. ఇలా చేయడం ద్వారా ఎవరైనా ఫ్రెండ్స్ పంపే మనకు అవసరం లేని మీడియా ఫైల్స్ ను డౌన్ లోడ్ అవ్వవు. తద్వరా డేటా సమస్య కొంత మేర తీరుతుంది.
గూగుల్ ఆఫ్ లైన్ మ్యాప్స్
సాధారణంగా మనకు తెలియని ప్రదేశాలకు ఎలా వెళ్లాలో? తెలియనప్పుడు గూగుల్ మ్యాప్స్ ను ఉపయోగిస్తాం. అయితే తరచూ గూగుల్ మ్యాప్స్ ను వాడడం వల్ల డేటా అధికంగా కన్జ్యూమ్ అవుతుంది. కాబట్టి మొబైల్లో ఆఫ్ లైన్ గూగుల్ మ్యాప్స్ ను ఇన్ స్టాల్ చేసుకుంటే డేటా సమస్య ఉండదు. అలాగే అత్యవసర సమయాల్లో కూడా గూగుల్ మ్యాప్స్ ఉపయోగకరంగా ఉంటుంది.



డైలీ డేటా యూసేజ్ లిమిట్
మనం వాడే ప్రతి యాండ్రాయిడ్ ఫోన్లో డైలీ డేటా యూసేజ్ లిమిట్ ను సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని సెట్టింగ్స్ లో ఎనేబుల్ చేసుకోవచ్చు. దీని ద్వారా మన డేటా అయ్యిపోతున్న సందర్భంగా మనకు తరచూ నోటిఫికేషన్లు వస్తాయి. తద్వారా మన డేటా అవ్వకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ కోసం