AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp Update: వాట్సాప్ లో సరికొత్త మెసేజ్ సెర్చ్ ఆప్షన్.. ఇకపై చాలా ఈజీ.. వెంటనే అప్ డేట్ చేసుకోండి

ఇదే క్రమంలో మరో అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ వినియోగదారులకు మరింత సులభతర మెసేజింగ్‌ అనుభూతిని అందించేందుకు 23.1.75 అప్‌డేట్‌ ను తీసుకొచ్చింది. దీనిలో సెల్ఫ్‌ మెసేజ్‌, సెర్చ్‌ బై డేట్‌ ఫీచర్‌, ఇమేజ్‌, వీడియోల డ్రాగ్‌ అండ్‌ డ్రాప్‌ వంటి యూజర్‌ ఫ్రెండ్లీ ఫీచర్లు పరిచయం చేస్తోంది.

WhatsApp Update: వాట్సాప్ లో సరికొత్త మెసేజ్ సెర్చ్ ఆప్షన్.. ఇకపై చాలా ఈజీ.. వెంటనే అప్ డేట్ చేసుకోండి
Whatsapp
Madhu
| Edited By: Anil kumar poka|

Updated on: Jan 26, 2023 | 10:59 AM

Share

వాట్సాప్‌ లేని ప్రపంచాన్ని ప్రస్తుతం ఊహించలేం. అంతలా దానిపై ఆధారపడేలా చేసేసుకుంది. స్కూల్‌ స్థాయి నుంచి యూనివర్సిటీల వరకూ.. కామన్‌ మేన్‌ నుంచి వ్యాపారవేత్తల వరకూ అందరికీ సమాచార మార్పిడికి ఇదే ప్రధాన మార్గం. అంతలా వినియోగదారులతో కనెక్ట్‌ అయిన వాట్సాప్‌ ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు మెటా ప్రయత్నిస్తోంది. ఎప్పటికప్పుడు వినియోగదారుల ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా యాప్‌ లో అత్యాధునిక ఫీచర్లను తీసుకొస్తూ అందరి మన్ననలు పొందుతోంది. ఇదే క్రమంలో మరో అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ వినియోగదారులకు మరింత సులభతర మెసేజింగ్‌ అనుభూతిని అందించేందుకు 23.1.75 అప్‌డేట్‌ ను తీసుకొచ్చింది. దీనిలో సెల్ఫ్‌ మెసేజ్‌, సెర్చ్‌ బై డేట్‌ ఫీచర్‌, ఇమేజ్‌, వీడియోల డ్రాగ్‌ అండ్‌ డ్రాప్‌ వంటి యూజర్‌ ఫ్రెండ్లీ ఫీచర్లు పరిచయం చేస్తోంది. అయితే ఈ ఫీచర్లను పొందాలంటే ప్లే స్టోర్ కి వెళ్లి మీ వాట్సాప్ ను అప్ డేట్ చేసుకోవాలి. అప్ డేట్ ఇంకా రాకపోతే అది వచ్చే వరకూ వేచి ఉండాలి.

ప్రధానంగా రెండు ఫీచర్లు..

కొత్త అప్‌డేట్లో ప్రధానం రెండు ఫీచర్‌లను వాట్సాప్‌ హైలైట్ చేస్తుంది. అవేంటంటే తేదీ వారీగా మెసేజ్‌ లను వెతకటం.. అలాగే ఇతర యాప్‌ల నుంచి చిత్రాలు, వీడియోలు, డాక్యూమెంట్‌ లను షేర్‌ చేసేందుకు డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్‌ ను ఎనేబుల్‌ చేసింది. ఈ ఫీచర్ల ద్వారా వినియోగదారులు క్యాలెండర్ నుంచి నిర్దిష్ట తేదీకి వెళ్లడం.. అక్కడ అవసరమైన మెసేజ్‌ ను వెతకడం సులభతరం అవుతుంది. కాంటాక్ట్ లేదా గ్రూప్ లనుంచి సెర్చ్‌ ఆప్షన్‌ క్లిక్‌ చేసి, ఆ తర్వాత క్యాలెండర్‌ సింబల్‌ ఎంపిక చేసుకోవడం ద్వారా దీనిని వినియోగించుకోవచ్చు.

పాత మెసేజ్‌లను చూడాలంటే..

  • వాట్సాప్‌ను తెరిచి, మీకు మెసేజ్‌ అవసరం అయిన కాంటాక్ట్‌ లేదా గ్రూప్‌ ను సెలెక్ట్‌ చేయండి.
  • ఇప్పుడు సెర్చ్‌ మెసేజ్‌ క్లికి చేయండి. సెర్చ్‌ బటన్‌కు కుడి వైపున కనిపిస్తున్న క్యాలెండర్ సింబల్‌ ను ఎంపిక చేసుకోవాలి.
  • దానిలో మీకు అవసరమైన డేట్‌ ను సెలెక్ట్‌ చేసుకోవాలి. బాగా వెనక్కి వెళ్లాలి అనుకుంటే జంప్‌ టు డేట్‌ అనే బటన్‌ ను క్లిక్‌ చేయాలి

షేరింగ్‌ చాలా ఈజీ..

వాట్సాప్‌ కొత్త అప్‌డేట్‌ లో మీరు ఏదైనా మీడియాను డ్రాగ్‌ చేసి నేరుగా వాట్సాప్‌ చాట్‌ విండోలో డ్రాప్‌ చేయవచ్చు. అలాగే ఇతర యాప్‌ నుంచి కూడా ఫొటోలు, వీడియోలు, డాక్యూమెంట్లను వాట్సాప్‌ లోకి సులభంగా డ్రాగ్‌ అండ్‌ డ్రాప్ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కొత్త ఫీచర్లు..

ప్రస్తుతం ఉన్న అప్‌డేట్‌తో పాటు మరిన్ని ఫీచర్లను వాట్సాప్‌ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వినియోగదారులకు ఇబ్బందులు పడుతున్న ఫొటో క్లారిటీ పై సరికొత్త అప్‌ డేట్‌ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు వాట్సాప్‌ ఒక ఇమేజ్‌ పంపితే దాని క్వాలిటీ తగ్గిపోతోంది. కంప్రెస్ అయిపోతోంది. దీనిని నివారించేందుకు వాట్సాప్‌ మరో కొత్త అప్‌డేట్‌ త్వరలోనే తీసుకొచ్చే అవకాశం ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం