Mars Travel: 45 రోజుల్లో అంగారకుడిపై కాలు మోపొచ్చు! నాసా సరికొత్త ప్రణాళిక.. ఎప్పటి నుంచి అంటే..
సాధారణంగా 39,600 కి.మీ/గం వేగంతో ప్రయాణించే వ్యోమనౌక మార్స్ గ్రహాన్ని చేరుకోవడానికి దాదాపు 200 రోజులు పడుతుంది. ఇంతకన్నా వేగంగా అక్కడకు చేరుకోవడానికి ఏదైనా మార్గం ఉందా? అంటే ఉందనే అంటోంది నాసా.

అంతరక్షంలో ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరం ఉంటుంది. సాధారణంగా కాంతి వేగంతో ప్రయాణిస్తే నెలలు, సంవత్సరాలు పడుతుంది. అలాంటిది భూమి నుంచి కేవలం 45 రోజుల వ్యవధిలో మార్స్ (అంగారకుడు)పై చేరుకోగలిగితే. ఆ ఊహ చాలా బాగుంది కదా. ఆ దిశగానే ప్రయోగాలు చేస్తున్నట్లు ప్రకటించింది అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా(NASA).. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
సాధ్యమేనా..
అంగారకుడిపై అడుగు పెట్టేందుకు మనం సిద్ధమయ్యామా? దీనికి సమాధానం ఇప్పటి వరకూ లేదు అనే చెప్పాలి. కానీ ఇటీవలి సాంకేతికతంగా సాధిస్తున్న అభివృద్ధి.. దీనిని సుసాధ్యం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. సాధారణంగా 39,600 కి.మీ/గం వేగంతో ప్రయాణించే వ్యోమనౌక మార్స్ గ్రహాన్ని చేరుకోవడానికి దాదాపు 200 రోజులు పడుతుంది. ఇంతకన్నా వేగంగా అక్కడకు చేరుకోవడానికి ఏదైనా మార్గం ఉందా? అంటే ఉందనే అంటోంది నాసా.
45 రోజుల్లో వెళ్లేలా..
NASA ఇన్నోవేటివ్ అడ్వాన్స్‌డ్ కాన్సెప్ట్‌లు (NIAC), NASA శాస్తవేత్తలు ఓ ప్రణాళికను రూపొందించాయి. అదేంటంటే ఒక న్యూక్లియర్ కాన్సెప్ట్. ఇది మనల్ని 45 రోజుల్లో అంగారక గ్రహానికి పంపగలగుతుందట. ఇది అసాధ్యమైన పనిగానే కనిపిస్తున్నా.. కానీ సైన్స్ మనకు దీనిని సుసాధ్యం చేసినా ఎంతమాత్రం ఆశ్చర్యం ఉండదు.
ఏంటి న్యూక్లియర్ కాన్సెప్ట్..
ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి చేరుకోడానికి యూఎస్ అంతరిక్ష సంస్థ న్యూక్లియర్ కాన్సెప్ట్ ను తీసుకొచ్చింది. అదేంటంటే బిమోడల్ న్యూక్లియర్ ప్రొపల్షన్ సిస్టమ్ లో వేవ్ రోటర్ టోపింగ్ సైకిల్ 900 సెకన్ల స్పెసిఫిక్ ఇంపల్షన్(Isp) అందిస్తుంది. అంటే ఇది కెమికల్ రాకెట్ల శక్తికి రెట్టింపు. న్యూక్లియర్-థర్మల్ ప్రొపల్షన్ విధానంలో, లిక్విడ్ హైడ్రోజన్ (LH2) ఇంధనం ఐయనైజ్డ్ హైడ్రోజన్ వాయువు (ప్లాస్మా) అయ్యే వరకు వేడి చేయబడుతుంది. రాకెట్ కావాల్సిన థ్రస్ట్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే దీనిలో కొన్ని సవాళ్లు, ఇబ్బందులు కూడా ఉన్నాయని పేర్కొంది. వీటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నట్లు నాసా ప్రకటించింది. అందుకోసం $12,500 నిధులు వెచ్చిస్తోంది. ఈ సాంకేతికత విజయవంతం కావాలని, ప్రజలు అతి త్వరలో అంగారక గ్రహాన్ని సందర్శించాలని ఆశిద్దాం..
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం..